iDreamPost
android-app
ios-app

వీడియో: స్టేజ్‌పైనే కన్నీళ్లు పెట్టుకున్న శేఖర్- గణేష్ మాస్టర్లు.. ఏమైందంటే?

  • Published Aug 31, 2024 | 2:49 PM Updated Updated Aug 31, 2024 | 2:49 PM

Dhee Celebrity Special 2 Show: తెలుగు బుల్లితెరపై వస్తున్న ఢీ షో ఇప్పటి వరకు 17 సీజన్లు పూర్తి చేసుకుంది. ప్రస్తుతం డీ సెలబ్రెటీ స్పెషల్ 2 సీజన్ మొదలైంది. తాజాగా ఢీ స్టేజ్ పై శేఖర్, గణేష్ మాస్టర్స్ ఎమోషన్ అయ్యారు.

Dhee Celebrity Special 2 Show: తెలుగు బుల్లితెరపై వస్తున్న ఢీ షో ఇప్పటి వరకు 17 సీజన్లు పూర్తి చేసుకుంది. ప్రస్తుతం డీ సెలబ్రెటీ స్పెషల్ 2 సీజన్ మొదలైంది. తాజాగా ఢీ స్టేజ్ పై శేఖర్, గణేష్ మాస్టర్స్ ఎమోషన్ అయ్యారు.

  • Published Aug 31, 2024 | 2:49 PMUpdated Aug 31, 2024 | 2:49 PM
వీడియో: స్టేజ్‌పైనే కన్నీళ్లు పెట్టుకున్న శేఖర్- గణేష్ మాస్టర్లు.. ఏమైందంటే?

ఇప్పటి వరకు తెలుగు బుల్లితెరపై ఎన్నో రియాల్టీ షోలు ఆడియన్స్ ని ఆకట్టుకుంటున్నాయి. డ్యాన్స్, గేమ్, కామెడీ షోలు బుల్లితెర ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేస్తున్నాయి. అలాంటి షోస్ లో ‘ఢీ’ డ్యాన్స్ షో ఒకటి. ఇప్పటి వరకు 17 సీజన్లు పూర్తి చేసుకొని ఇటీవల ‘డీ సెలబ్రెటీ స్పెషల్ 2’ సీజన్ మొదలైంది. ఈ షోకి శేఖర్ మాస్టర్, హన్సిక, గణేష్ మాస్టర్ లు జడ్జీలుగా వ్యవహరిస్తున్నారు. హైపర్ ఆది, శ్రీ సత్య టీమ్ లీడర్లుగా ఉంటున్నారు. హైస్ట్ గా నందూ వ్యవహరిస్తున్నారు. తాజాగా స్టేజ్ పైనే శేఖర్, గణేష్ మాస్టర్లు ఎమోషన్ అయ్యారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది.

తెలుగు బుల్లితెరపై ఎన్నో ఎంటర్‌టైన్‌మెంట్ రియాల్టీ షోలు వచ్చాయి.. వాటిలో ‘ఢీ’ డ్యాన్స్ షో అందరినీ బాగా ఆకర్షించింది. ఈ షో ద్వారా ఎంతోమంది కొరియోగ్రాఫర్లు, డ్యాన్సర్లుగా మంచి పేరు తెచ్చుకోవడమే కాదు ఇండస్ట్రీలో రాణిస్తున్నారు. ప్రస్తుతం ఢీ సెలబ్రిటీ స్పెషల్ 2 సీజన్ నడుస్తుంది. ఈ షోలో కంటెస్టెంట్స్ తమ అద్భుతమైన డ్యాన్స్ పర్ఫామెన్స్ తో ఆకట్టుకుంటున్నారు. ఇక హైపర్ ఆది పంచ్ ల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. తాజాగా రిలీజ్ చేసిన ప్రోమోలో టీచర్స్ డే సందర్భంగా ఢీలో ఉన్న మాస్టర్స్ అందరూ కలిసి స్పెషల్ పర్మామెన్స్ చేశారు.

స్టేజ్ పై మాస్టర్స్ చేసి డ్యాన్స్ చూసి స్టేజ్ పైకి వచ్చి వారందరిని మెచ్చుకున్నారు శేఖర్, గణేష్ మాస్టర్స్. ఈ సందర్భంగా గణేష్ మాస్టర్ తన కెరీర్ బిగినింగ్ లో జరిగిన అనుభవాల గురించి చెబుతూ ఎమోషనల్ అవుతూ.. కన్నీరు పెట్టుకున్నాడు. గణేష్ మాస్టర్ ని చూసి శేఖర్ మాస్టర్ కూడా కంట నీరు పెట్టుకున్నారు. వీరిద్దరి ఎమోషన్ చూసి అక్కడ వాతావరణం మొత్తం సైలెన్స్ గా మారిపోయింది. ఈ షో కి సంబంధించిన ప్రోమో వైరల్ గా మారింది. ఫుల్ ఎపిసోడ్ కోసం వచ్చే వారం వరకు ఆగాల్సిందే.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişjojobet girişCasibombetciograndpashabet