iDreamPost
android-app
ios-app

Devara సక్సెస్ మీట్ లో హరిపై తారక్ షాకింగ్ కామెంట్స్! ఈ హరి ఎవరు?

  • Published Oct 05, 2024 | 1:10 PM Updated Updated Oct 05, 2024 | 1:10 PM

Devara: దేవర బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడంతో గ్రాండ్ సక్సెస్ పార్టీ నిర్వహించారు మేకర్స్. అయితే ఈ వేదికపై జూనియర్ ఎన్టీఆర్ చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి.

Devara: దేవర బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడంతో గ్రాండ్ సక్సెస్ పార్టీ నిర్వహించారు మేకర్స్. అయితే ఈ వేదికపై జూనియర్ ఎన్టీఆర్ చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి.

  • Published Oct 05, 2024 | 1:10 PMUpdated Oct 05, 2024 | 1:10 PM
Devara సక్సెస్ మీట్ లో హరిపై తారక్ షాకింగ్ కామెంట్స్! ఈ హరి ఎవరు?

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ తాజా పాన్ ఇండియా చిత్రం ‘దేవర’ కుమ్మేస్తుంది. బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తుంది. ఫస్ట్ షో నుంచి ఎక్కడా తగ్గకుండా దూసుకుపోతుంది. తారక్ కెరీర్ లోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచింది. స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ఈ చిత్ర విజయంతో కం బ్యాక్ అయ్యడు. ఇక బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ టాలీవుడ్లో డెబ్యూ మూవీతోనే బ్లాక్ హిట్ అందుకుంది. సైఫ్ అలీఖాన్ కు కూడా తెలుగులో మంచి ఆరంభం దక్కింది. సినిమా విడుదల అయ్యి వారం రోజులైనా థియేటర్స్ హౌస్ ఫుల్స్ అవుతున్నాయి. కేవలం మూడు రోజుల్లోనే 300 కోట్లకు పైగా రాబట్టిన దేవర మొదటి వారానికి గాను రూ. 407 కోట్ల పైగా గ్రాస్ వసూళ్లు కొల్లగొట్టింది.

దేవర ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడంతో గ్రాండ్ సక్సెస్ పార్టీ నిర్వహించారు మేకర్స్. అయితే ఈ వేదికపై జూనియర్ ఎన్టీఆర్ చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి. తారక్ మాట్లాడుతూ.. ‘ముందుకు ఎప్పుడు రాడు, ఎప్పుడు వెనకాలే నిల్చుంటాడు మా హరి. చాలా మంది ఎన్నో రకాలుగా అతన్ని సరిగా అర్ధం చేసుకోరు. ఎందుకంటే అతను ముందుకు వచ్చి తన గురించి చెప్పుకోడు. ఎవరేమి అన్నా, ఎవరేమి అనుకున్నా ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ కి మూల స్థంభం హరి. నాకు, కళ్యాణ్ అన్నకి మా ఇద్దరికీ స్ట్రెంత్ హరి. ఇందులో ఎటువంటి డోకా ఉండదు. నచ్చిన వాళ్ళు జీర్ణించుకుంటారు. నచ్చని వాళ్ళు జీర్ణించుకోవాల్సిన అవసరం లేదు’ అని అన్నారు. దేవర ఇంత బ్లాక్ బస్టర్ అయ్యింది. అభిమానులు పండగ చేసుకుంటున్నారు. తారక్ కి అభిమానులు అంటే ఎంత ఇష్టమో అందరికీ తెలుసు. అలాంటి తారక్ దేవర సక్సెస్ పై పూర్తిగా హ్యాపీగా లేరు. దానికి కారణం హరిపై వస్తున్న నిందలు. అసలు ఇంతకీ ఈ హరి ఎవరు? ఎందుకు తారక్ హరి గురించి ప్రత్యేకంగా మాట్లాడారు? తారక్ ఇంతలా ఈయన్ని ఎందుకు ఇష్టపడుతున్నారు? హరిపై వస్తున్న నిందలు ఏంటి ? అసలు హరి తారక్ కి ఏమవుతారు? అన్న ప్రశ్నలు సోషల్ మీడియాలో బలంగా వినిపిస్తున్నాయి. ఈ ప్రశ్నలన్నింటికి సమాధానాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.

నిజానికి హరి ఎవరో కాదు. కళ్యాణ్ రామ్ కి స్వయానా బామ్మర్ది. కళ్యాణ్ రామ్ భార్య తమ్ముడు. ఎన్టీఆర్ ఫ్యామిలి కోసం నిరంతరం కష్టపడే వ్యక్తి. కళ్యాణ్ రామ్ అన్నా, ఎన్టీఆర్ అన్నా హరికి చాలా ఇష్టం. వారి కుటుంబానికి ఎప్పుడు అండగా ఉండే వ్యక్తి. కళ్యాణ్ రామ్, ఎన్టీఆర్ సినిమా వ్యవహారాల మొత్తం హరినే చూసుకుంటారు. గతంలో తారక్ మ్యానేజర్ గా పని చేసిన కోనేరు మహేష్ తో కలిసి ప్రతి పనిని దగ్గరుండి చూసుకున్నారు హరి. కోనేరు మహేష్ చనిపోయాక తారక్ వెన్నంటే వున్నారు హరి. తారక్ సినిమా పనుల పూర్తి బాధ్యతలను తన భుజాన వేసుకున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే హరి ఎన్టీఆర్ కి రామ బంటు లాంటి వారు. హరి అజాత శత్రువు. ఎలాంటి శత్రువులు లేని మంచి వ్యక్తి. అందుకే ఎన్టీఆర్ కి హరి అంటే అభిమానం. ఆయనకి అంత ఇష్టమైన హరిపై ఈమధ్య కాలంలో ఎన్టీఆర్ సర్కిల్ లో చాలా బ్యాడ్ టాక్స్ వచ్చాయి. అతను వచ్చాకే ఫ్యాన్స్ కు తారక్ కు మధ్య గ్యాప్ వచ్చిందని ఎప్పుటి నుంచో టాక్ నడుస్తుంది. హరిని తీసేయాలని కొందరు ఫ్యాన్స్ ఆ మధ్య గొడవలు కూడా చేసారు. దేవర ప్రి రిలీజ్ ఈవెంట్ క్యాన్సిల్ కి హరినే ప్రధాన కారణం అనుకున్నారు. దాంతో కొందరు ఫ్యాన్స్ ‘X’ లో హరిని చాలా దారుణంగా తిట్టారు. తమ కోసం నిరంతరం కష్టపడే హరిని ఫ్యాన్స్ ఇంతలా ద్వేషించడం తారక్ తట్టుకోలేకపోయారు. అందుకే వారందరికి తారక్ ఇలా ఆన్సర్ ఇచ్చారని టాలీవుడ్ సర్కిల్ నుంచి తెలిసింది. మరి.. జూనియర్ యన్టీఆర్ కామెంట్స్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişjojobetjojobetJojobetJojobetjojobetJojobetjojobetJojobetcasibomcasibomfixbetcasibomfixbetcasibomfixbetcasibom girişşanlıurfa haberbetciobetciobetcioGrandpashabetHoliganbetHoliganbetHoliganbetjojobetjojobet