iDreamPost
android-app
ios-app

ఒకే ఫ్రేమ్ లో నందమూరి బ్రదర్స్! ఫ్యాన్స్ కి కిక్కిస్తున్న ఫోటోలు!

  • Author ajaykrishna Published - 11:28 AM, Mon - 21 August 23
  • Author ajaykrishna Published - 11:28 AM, Mon - 21 August 23
ఒకే ఫ్రేమ్ లో నందమూరి బ్రదర్స్! ఫ్యాన్స్ కి కిక్కిస్తున్న ఫోటోలు!

నందమూరి ఫ్యాన్స్ అంతా ఎంతో హ్యాపీ అయ్యే మూమెంట్ చోటుచేసుకుంది. ఇలాంటి మూమెంట్ కోసం చాలా రోజులుగా వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. ఎట్టకేలకు ఓ పెళ్లి వేడుకతో ఆ కోరిక నెరవేరిందని అంటున్నారు. తాజాగా నందమూరి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఒకచోట కనిపించారు. నందమూరి సుహాసిని తనయుడు హర్ష పెళ్లి జరిగింది. ఈ పెళ్లిలో నందమూరి ఫ్యామిలీ అంతా సందడి చేసింది. బాలయ్యతో జూనియర్ ఎన్టీఆర్.. కళ్యాణ్ రామ్.. బాలయ్య తనయుడు మోక్షజ్ఞ.. ఇలా అందరూ ఒకే చోట కలిసి ఎంతో సంతోషంగా కనిపించారు. వీరందరిని చూసి ఫ్యాన్స్ చాలా హ్యాపీ అవుతున్నారు. కానీ.. ఒకే ఒక లోటు మాత్రం క్లియర్ గా కనిపిస్తుంది.

అదేంటంటే.. ఇంతటి హ్యాపీ మూమెంట్ లో నందమూరి తారకరత్న లేకుండా పోయాడు. ఈ ఏడాది తారకరత్న యువగళం పాదయాత్రలో పాల్గొని.. అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చేరడం.. ఆ తర్వాత కొద్దిరోజులకు కన్ను మూయడం అందరిని విషాదంలోకి నెట్టేసింది. ఇప్పుడిప్పుడే నందమూరి ఫ్యామిలీ అంతా ఆ బాధలో నుండి కోలుకుంటుంది. ఈ క్రమంలో చాలా రోజుల తర్వాత బాలయ్య, ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్.. మోక్షజ్ఞ ఇంకా ఫ్యామిలీ అంతా ఇలా పెళ్లి వేడుకలో కనిపించడం అందరికీ ఆనందం కలిగిస్తున్న విషయం. ముఖ్యంగా నందమూరి బ్రదర్స్ అందరూ ఒకే ఫ్రేమ్ లో ఉన్నారు. జూనియర్ ఎన్టీఆర్ తో పాటు కళ్యాణ్ రామ్, మోక్షజ్ఞ కలిసి దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో ప్రస్తుతం ట్రెండ్ అవుతున్నాయి.

ఇదిలా ఉండగా.. ఒకే ఫోటోలో ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్, మోక్షజ్ఞ కనిపించేసరికి.. ఇదే కాంబినేషన్ లో ఓ సినిమా పడితే మామూలుగా ఉండదు అంటున్నారు అభిమానులు. అయితే.. ఈ పెళ్లి వేడుకలో ఎన్టీఆర్ కనిపించాడు కానీ.. ఆయన భార్య, పిల్లలు కనిపించలేదు. అంటే.. ఫోటోలో లేరా లేక పెళ్లికి వెళ్లలేదా? అనేది తెలియాల్సి ఉంది. ఇక ఎన్టీఆర్.. కళ్యాణ్ రామ్ ప్రెజెంట్ వారి కెరీర్ లో సినిమాలతో బిజీగా ఉన్నారు. మరోవైపు బాలయ్య వారసుడుగా మోక్షజ్ఞ ఎంట్రీ కోసం ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. ఆ మధ్య ఆదిత్య 999లో మోక్షజ్ఞ ఎంట్రీ ఫిక్స్ అని వార్తలొచ్చాయి. ఆ తర్వాత వేరే డైరెక్టర్స్ తో డెబ్యూ చేస్తాడని టాక్ నడిచింది. ఇక మోక్షజ్ఞ ఎంట్రీ గురించి బాలయ్యే క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. మరి ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్, మోక్షజ్ఞల ఫోటో గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetHoliganbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetbetwoon girişgrandpashabetEscortes BelgiqueGrandpashabetCasibomGrandpashabet Giriş