iDreamPost
android-app
ios-app

Jr NTR: దేవర.. యంగ్ టైగర్ స్ట్రాటజీ వెనక రాజమౌళి?

  • Published Sep 10, 2024 | 9:31 AM Updated Updated Sep 10, 2024 | 9:31 AM

Jr NTR following SS Rajamouli strategy in Devara Promotions: దేవర ట్రైలర్ రిలీజ్ తో గ్రాండ్ గా ప్రమోషన్స్ ను ప్రారంభించనున్నారు తారక్ అండ్ కో. అయితే ఈ ప్రమోషనల్ స్ట్రాటజీ వెనక దర్శకధీరుడు జక్కన్న ఉన్నట్లు తెలుస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే..

Jr NTR following SS Rajamouli strategy in Devara Promotions: దేవర ట్రైలర్ రిలీజ్ తో గ్రాండ్ గా ప్రమోషన్స్ ను ప్రారంభించనున్నారు తారక్ అండ్ కో. అయితే ఈ ప్రమోషనల్ స్ట్రాటజీ వెనక దర్శకధీరుడు జక్కన్న ఉన్నట్లు తెలుస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే..

Jr NTR: దేవర.. యంగ్ టైగర్ స్ట్రాటజీ వెనక రాజమౌళి?

‘దేవర’.. ప్రస్తుతం ఇండియా మెుత్తం ఎక్కడ చూసినా ఈ సినిమా ఫీవరే కనిపిస్తోంది. ఇక నేడు(సెప్టెంబర్ 10)న ట్రైలర్ విడుదల కోసం మూవీ లవర్స్ ఎంతో క్యూరియాసిటీతో వేచి చూస్తున్నారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్-కొరటాల శివ కాంబినేషన్ లో రాబోతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఇప్పటికే విడుదలైన గ్లింప్స్, మూడు పాటలు చాట్ బస్టర్ గా నిలిచాయి. సోషల్ మీడియాలో ఈ సాంగ్స్ పెను సంచలనం సృష్టించాయి. ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కోసం ముందుగానే ముంబై చేరుకున్నాడు తారక్. అక్కడే ఈ వేడుక ఘనంగా జరగనుంది. ఈ నేపథ్యంలో ‘దేవర’ ప్రమోషన్స్ స్ట్రాటజీ వెనక దర్శకధీరుడు జక్కన్న ఉన్నట్లు తెలుస్తోంది. ఆయన సూచనలనే తారక్ కూడా ముందుకు తీసుకెళ్తున్నట్లు ఇండస్ట్రీ వర్గాల టాక్.

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన లేటెస్ట్ మూవీ ‘దేవర’. స్టార్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కించిన ఈ మూవీ సెప్టెంబర్ 27న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కాబోతోంది. ఈ క్రమంలో ముంబైలో నేడు(సెప్టెంబర్ 10) గ్రాండ్ గా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ను నిర్వహించనున్నారు. ఇక ఇందుకోసం ముందుగానే తారక్ అక్కడికి చేరుకున్నాడు. ప్రముఖ బాలీవుడ్ మీడియాలతో ఇంటరాక్ట్ కాబోతున్నాడు. కొన్ని రోజులు అక్కడే ఉండి వరుసగా ఇంటర్వ్యూలు ఇచ్చి.. ప్రమోషన్స్ ను పీక్స్ కు తీసుకెళ్లనున్నాడు. అందులో భాగంగానే కపిల్ శర్మ షోకు సంబంధించి షూటింగ్ కూడా కంప్లీట్ అయినట్లు తెలుస్తోంది. దాంతో పాటుగా సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగతో ఇంటర్వ్యూ కూడా పూర్తి చేసినట్లు టాక్.

NTR vs Rajamouli

కాగా.. నార్త్ బెల్ట్ లో ఆర్ఆర్ఆర్ తో వచ్చిన క్రేజ్ ను దేవర మూవీతో ఇంకాస్త పెంచుకోవాలని తారక్ భావిస్తున్నాడు. పైగా అది రాబోయే వార్ 2 మూవీకి కూడా ఉపయోగపడుతుంది. ఇందుకే ఎన్టీఆర్ హిందీ ప్రమోషన్స్ పై గట్టి ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. అయితే తారక్ దేవర ప్రమోషన్స్ స్ట్రాటజీ వెనక దిగ్గజ దర్శకుడు రాజమౌళి ఉన్నట్లు తెలుస్తోంది. జక్కన్న సూచనలతోనే తారక్ ఆపరేషన్ ముంబై ప్రారంభించినట్లు టాక్. అక్కడి మార్కెట్ లో గట్టిగా ప్రమోషన్స్ చేస్తే.. కలెక్షన్లను భారీగా రాబట్టొచ్చు.  గతంలో ఆర్ఆర్ఆర్ ప్రమోషన్స్ ను కూడా రాజమౌళి హిందీలో భారీగా చేపట్టిన విషయం తెలిసిందే. ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా అక్కడ వరుసగా ఇంటర్వ్యూలు ఇచ్చారు. ప్రమోషన్స్ సూపర్ సక్సెస్ కావడం, ఇక బ్లాక్ బస్టర్ హిట్ అయిన ఆ మూవీ ఏ రేంజ్ లో వసూళ్లు సాధించిందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు.

కాగా.. ఇప్పుడు దేవర విషయంలో కూడా జక్కన్న ఇదే స్ట్రాటజీని ఫాలో కావాలని తారక్ అండ్ టీమ్  కు సూచించినట్లు సమాచారం. పైగా సైఫ్ అలీ ఖాన్, జాన్వీ కపూర్ లాంటి స్టార్లు ఉండనే ఉన్నారు. వారి ఇమేజ్ ను వాడుకుని బాలీవుడ్ లో కలెక్షన్ల వర్షం కుపించాలన్నది తారక్ అండ్ కో ప్లాన్. ప్రస్తుతం అదే అమలు చేస్తున్నారు. కాగా.. 2 నిమిషాల 50 సెకన్ల ట్రైలర్ ను కట్ చేసినట్లు తెలుస్తోంది. తారక్ నుంచి ఫ్యాన్స్ కోరుకునే అన్ని ఎలిమెంట్స్ ఇందులో ఉండేలా చూసుకున్నారట. మరి దేవర ప్రమోషన్స్ వెనక రాజమౌళి స్ట్రాటజీ ఉందని మీరు భావిస్తున్నారా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.