iDreamPost
android-app
ios-app

Jr NTR, Kantara 2: కాంతార 2లో తారక్ కన్ఫర్మ్….ష్యూర్

  • Published Mar 12, 2024 | 5:26 PM Updated Updated Mar 12, 2024 | 5:35 PM

Jr NTR Kantara 2: కాంతార సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చిన్న సినిమాగా వచ్చి థియేటర్లలో బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకుంది. ఈ సినిమాకు సీక్వెల్ గా కాంతార 2 తెరకెక్కుతుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమాకు సంబంధించిన విషయం బయటకు వచ్చింది.

Jr NTR Kantara 2: కాంతార సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చిన్న సినిమాగా వచ్చి థియేటర్లలో బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకుంది. ఈ సినిమాకు సీక్వెల్ గా కాంతార 2 తెరకెక్కుతుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమాకు సంబంధించిన విషయం బయటకు వచ్చింది.

  • Published Mar 12, 2024 | 5:26 PMUpdated Mar 12, 2024 | 5:35 PM
Jr NTR, Kantara 2: కాంతార 2లో తారక్ కన్ఫర్మ్….ష్యూర్

త్రిబుల్ ఆర్ సినిమాతో వచ్చిన వరల్డ్ రికగ్నిషన్ గానీ, పానిండియా ఇమేజ్ గానీ….ఏదీ జూనియర్ ఎన్టీ ఆర్ అడ్వాంటేజ్ తీసుకోవడం లేదని బాధపడే వాళ్ళు చాలామంది తన అభిమానులే కాదు, మంచి పెరఫార్మర్ గా తనని మెచ్చుకునేవాళ్ళు కూడా అంటుంటారు. త్రిబుల్ ఆర్ వచ్చి అప్పుడే దాదాపు రెండేళ్ళయి పోతోంది. కానీ ఇప్పటి వరకూ ఏ సంచలనాత్మకమైన వార్త జూనియర్ కి సంబంధించి వెలువడలేదు.

ఇదిగో ఈ వార్త ఇప్పడు కన్నడ ఇండస్ట్రీలో ఓ సెన్సేషన్ అయింది. అదే….కాంతార 2లో జూనియర్ కన్ఫర్మ్ అయ్యాడని కన్నడ మీడియా కోడై కూస్తోంది. అయితే ఇది సీక్వెల్ గా కాదు, ప్రీక్వెల్ గా రాబోతోంది. కాంతార క్రియేట్ చేసిన హిస్టరీ మామ్మూలు కాదు. అతి చిన్న బడ్జెట్ లో రూపొంది, దేశవ్యాప్తంగా దుమ్ము లేపేసింది. త్రిబుల్ ఆర్, పుష్ఫ, అంతకు ముందు బాహుబలి సినిమాలు ఏ రేంజ్ ని అందుకున్నాయో కాంతార కూడా అంతే రిసౌండ్ చేసింది.

ఎవ్వరికీ అర్ధం కాలేదు. అసలు కాంతార ఏంటి….అంత బజ్ ఎలా క్రియేట్ చేసింది ఇవేవీ ఊహకే అందలేదు. కానీ సినిమా ఒక వండర్….ఒక థ్రిల్లర్….కాంతార ఒక హిస్టరీ. ఒక మైలురాయి. కన్నడ భాషలో తీసిందే కావచ్చు. కానీ దాదాపు ఇండియా మొత్తం దద్దరిల్లిపోయింది. ముఖ్యంగా దాని బడ్జెట్. ఓ మోస్తరు ఖర్చుతో కాంతార సాధించిన ఎత్తైన రికార్డులు, రివార్డులు అన్ని లాంగ్వేజ్ ఇండస్ట్రీస్ ని షేక్ చేసేశాయి. ఇప్పుడా బడ్జెట్ వ్యవహారం కుదరనే కుదరదు. కాంతార రేంజ్ వేరే స్టాండర్డ్ లోకి వెళ్ళిపోయింది. కాంతార అంటే ఆరోజున ఒక అనామిక. ఇప్పుడు కాదు. లక్షమంది కోట్లు పెట్టడానికి సంచులు రెడీ చేసుకుని రిషబ్ షెట్టి కాల్ కోసం కాలు గాలిన పిల్లుల్లా తిరుగుతున్నారు.

Jr NTR confirm in kantaara 2

ఒక్క కన్నడ పరిశ్రమలోనే కాదు. టోటల్ బాలీవుడ్ నుంచి రిషబ్ కి ఫోన్లు తెగ మోతెక్కిపోతున్నాయి. పులి మీద పుట్రలా ఇప్పుడు జూనియర్ ఎన్టీ ఆర్ ఎడిషన్. త్రిబుల్ ఆర్ తర్వాత జూనియర్ ఇమేజ్ కి తగ్గ క్యారెక్టర్ రాసుకున్నాడట రిషబ్ శెట్టి. మంచి పెరఫార్మర్. పానిండియా ఇమేజ్. కన్నడ అనుబంధాలు. ఇవన్నీ కాంతార ప్రీక్వెల్ ని ఎక్కడికో తీసుకుపోతున్నాయి. ఈ మధ్యనే జూనియర్ కూడా బెంగుళూరులో రిషబ్ శెట్టిని, పనిలో పనిగా ప్రశాంత్ నీల్ ని కలుసుకుని, డిస్కషన్స్ లోకి వెళ్ళాడని వార్తలు కన్నడ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఏది ఏమైనా, ఒక్క తెలుగే అనుకుని కూర్చుండిపోకుండా, జూనియర్ సీనియలర్ లా ఆలోచించి అడుగులు వేస్తున్న సంకేతాలైతే అందుతున్నాయి. మంచిదే మన హీరోలు ముందడుగు వేస్తుంటే….తెలుగు ఇండస్ట్రీ వైశాల్యం మరింత పెరుగుతుంది. అది పరోక్షంగా తెలుగు సినిమా ఎదుగుదలకే దోహదపడుతుంది.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetHoliganbetjojobet güncel girişgrandpashabetcasibomiptv satın alCasibomjojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişjojobet giriş