Jr.NTR ఫ్యాన్ శ్యామ్ సెల్ఫీ వీడియో.. అమ్మానాన్న క్షమించండి అంటూ..!

Jr.NTR ఫ్యాన్ శ్యామ్ సెల్ఫీ వీడియో.. అమ్మానాన్న క్షమించండి అంటూ..!

Jr.NTR ఫ్యాన్ శ్యామ్ సెల్ఫీ వీడియో.. అమ్మానాన్న క్షమించండి అంటూ..!

రెండు తెలుగు రాష్ట్రాల్లో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్ శ్యామ్ మృతి కలకలం రేపిన విషయం తెలిసిందే. అతనిది ఆత్మహత్య కాదని చాలా మంది ఆరోపణలు చేశారు. ఒంటిపై గాయాలు ఉన్నాయని, అతనిది అనుమానాస్పద మృతి అంటూ చెప్పుకొచ్చారు. అయితే ఈ ఘటలో ఇప్పుడు ఒక క్లారిటీ వచ్చింది. ఆత్మహత్య చేసుకోవడానికి ముందు శ్యామ్ రికార్డ్ చేసిన సెల్ఫీ వీడియో బయటకు వచ్చింది. శ్యామ్ సెల్ఫీ వీడియోలను వైఎస్సార్ సీపీ తమ అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ పోస్ట్ చేసింది. శ్యామ్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

తారక్ వీరాభిమాని శ్యామ్ మృతి ఘటన ఒక కొలిక్కి వచ్చింది. సూసైడ్ చేసుకోవడానికి ముందు శ్యామ్ తీసుకున్న సెల్ఫీ వీడియో బయటకు వచ్చింది. ఆ వీడియోలో “అమ్మానాన్న నన్ను క్షమించండి. నేను లేకపోయినా మీరు ఆనందంగా ఉండండి. నన్ను ఇన్ని రోజులు పెంచినందుకు అమ్మానాన్న థాంక్స్. నేను అందరి దృష్టిలో వేస్ట్.. నేను ఉన్నా కూడా మీకు లాభం లేదు. ఐ లవ్ యూ ఫరెవర్, మళ్లీ జన్మంటూ ఉంటే మీకే పుట్టాలి. నాకు జాబ్ చేయడం ఇష్టం లేదు. నేను జాబ్ చేయలేను.

అందుకే నిర్ణయం తీసుకున్నా. మిస్ యూ మమ్మీ డాడీ. సాయి శ్రీనన్న, మిస్ యూ అన్నా- లవ్ యూ అన్నా. మళ్లీ జన్మంటూ ఉంటే నీకు శిష్యుడిగా పుట్టాలి” అంటూ శ్యామ్ తన వీడియోలో చెప్పుకొచ్చాడు. ఈ వీడియోలను వైసీపీ అధికారిక ట్విట్టర్ పోస్ట్ చేశారు. “శ్యామ్ ఆత్మకి శాంతి చేకూరాలి, ఈ విషాధ సమయంలో శ్యామ్ కుటుంబ సభ్యులకి, స్నేహితులకి, శ్యామ్ తోటి ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ అందరికి మా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం” అంటూ ట్వీట్ చేశారు.

Show comments