iDreamPost
android-app
ios-app

Jr NTR: అది తెలిసి షాక్‌ అయ్యా..! మీ ధైర్యానికి కృతజ్ఞతలు: NTR

  • Published Jan 02, 2024 | 9:32 AM Updated Updated Jan 02, 2024 | 10:16 AM

స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ ఒక విషయం తెలిసి షాక్ అయ్యానని అన్నారు. అయితే వాళ్లు చూపించిన ధైర్యానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. తారక్ ఎవరి గురించి చెప్పారో ఇప్పుడు తెలుసుకుందాం..

స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ ఒక విషయం తెలిసి షాక్ అయ్యానని అన్నారు. అయితే వాళ్లు చూపించిన ధైర్యానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. తారక్ ఎవరి గురించి చెప్పారో ఇప్పుడు తెలుసుకుందాం..

  • Published Jan 02, 2024 | 9:32 AMUpdated Jan 02, 2024 | 10:16 AM
Jr NTR: అది తెలిసి షాక్‌ అయ్యా..! మీ ధైర్యానికి కృతజ్ఞతలు: NTR

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఒక్కో సినిమాతో తన క్రేజ్, పాపులారిటీ మరింత పెంచుకుంటున్నారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్​తో కలసి ఆయన నటించిన ‘ఆర్ఆర్ఆర్’ ఎంత పెద్ద హిట్టయిందో స్పెషల్​గా చెప్పనక్కర్లేదు. ఈ మూవీతో పాన్ ఇండియా ఇమేజ్ సొంతం చేసుకున్నారు తారక్. కొమురం భీమ్ పాత్రలో ఆయన యాక్టింగ్​కు ఇండియాతో పాటు యూఎస్, యూకే, జపాన్ దేశాల్లోని మూవీ ఆడియెన్స్ కూడా ఫిదా అయ్యారు. అమెరికా సంగతి పక్కనపెడితే ఎన్టీఆర్​కు జపాన్​తో ఎప్పటి నుంచో మంచి అనుబంధం ఉంది. ఆయనకు ఆ దేశంలో హ్యూజ్ ఫ్యాన్​బేస్ ఉంది. తారక్ డ్యాన్సులను, సినిమాలను వాళ్లు బాగా ఇష్టపడతారు. ‘ఆర్ఆర్ఆర్’ ప్రమోషన్స్ టైమ్​లో జపాన్​లో ఎన్టీఆర్ సందడి చేశారు. అక్కడి భాషలో మాట్లాడుతూ ఫ్యాన్స్​ను అలరించారు. అయితే జపాన్​లో భూకంపం వార్త విని ఆయన తీవ్ర దిగ్ర్భాంతికి గురయ్యారు.

గత వారం రోజులుగా తాను జపాన్​లోనే ఉన్నానని ఎన్టీఆర్ తెలిపారు. ఈ విపత్తు వల్ల ప్రభావితమైన వాళ్లందరూ త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నానని ఎక్స్​లో ట్వీట్ చేశారు. ప్రతి ఒక్కరూ క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నట్లు ఆ ట్వీట్​లో రాసుకొచ్చారు. జపాన్​ ప్రజల ధైర్యానికి కృతజ్ఞతలు చెప్పారు ఎన్టీఆర్. ‘జపాన్ నుంచి ఇవాళే ఇంటికి తిరిగి వచ్చా. అక్కడ భూకంపం వచ్చిందని తెలిసి తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యా. వారం రోజులుగా నేను అక్కడే ఉన్నా. జపాన్​లోని ప్రతి ఒక్కరి క్షేమాన్ని కోరుకుంటున్నా. ఈ కష్టసమయంలో అక్కడి ప్రజలు చూపిస్తున్న ధైర్యానికి కృతజ్ఞతలు. ఈ విపత్తు నుంచి వాళ్లు త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నా’ అని పోస్ట్ చేశారు తారక్. జపాన్ భూకంపం గురించి ఎన్టీఆర్ చేసిన ట్వీట్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.

ntr sad moment

భూకంపం నుంచి జపాన్ ప్రజలు త్వరగా కోలుకోవాలని ఎన్టీఆర్ అభిమానులు కోరుకుంటున్నారు. కాగా, తారక్ ప్రస్తుతం స్టార్ డైరెక్టర్ కొరటాల శివ డైరెక్షన్​లో రూపొందుతున్న ‘దేవర’ మూవీలో యాక్ట్ చేస్తున్నారు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం నుంచి కొత్త ఏడాది సందర్భంగా ఒక ఫొటోను రిలీజ్ చేశారు మేకర్స్. ఇందులో పడవ మీద నిల్చొని కనిపించారు ఎన్టీఆర్. ఆయన గెటప్, లుక్, కళ్లలోని ఇంటెన్స్ ఆకట్టుకున్నాయి. సంక్రాంతి పండక్కి ‘దేవర’ గ్లింప్స్​ను విడుదల చేయనున్నారు. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ‘దేవర’లో ఎన్టీఆర్ సరసన జాన్వీ కపూర్ నటిస్తున్నారు. ఆమెకు ఇదే ఫస్ట్ టాలీవుడ్ ఫిల్మ్. విలన్​ రోల్​లో ప్రముఖ బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ యాక్ట్ చేస్తున్నారు.

marsbahis giriş