Venkateswarlu
ఈ సినిమా పోయిన సంవత్సరం నవంబర్ 4వ తేదీన థియేటర్లలో రిలీజైంది. దాదాపు సంవత్సరం తర్వాత ఇప్పుడు ఓటీటీలోకి వచ్చింది. ప్రముఖ ఓటీటీ వేదికలో స్ట్రీమింగ్ అవుతోంది.
ఈ సినిమా పోయిన సంవత్సరం నవంబర్ 4వ తేదీన థియేటర్లలో రిలీజైంది. దాదాపు సంవత్సరం తర్వాత ఇప్పుడు ఓటీటీలోకి వచ్చింది. ప్రముఖ ఓటీటీ వేదికలో స్ట్రీమింగ్ అవుతోంది.
Venkateswarlu
సాధారణంగా ఏ సినిమా అయినా థియేటర్లలో రిలీజైన కొన్ని వారాలకే ఓటీటీలోకి రావటం పరిపాటి. అయితే, సినిమా థియేటర్లలో మంచి వసూళ్లను రాబడుతుంటే ఓటీటీలోకి రావటానికి కొంత ఎక్కువ టైం పట్టొచ్చు. అదే సినిమా బాగోలేకపోతే.. ప్లాప్ టాక్ వస్తే.. అనుకున్న దానికంటే ముందే థియేటర్లలోకి వస్తుంటుంది. కానీ, జెట్టి సినిమా మాత్రం థియేటర్లలో రిలీజైన సంవత్సరం తర్వాత ఓటీటీలోకి వస్తోంది. మరీ, ఇంత గ్యాప్ తీసుకుని ఓటీటీలోకి రావటానికి కారణం అయితే తెలీదు.
నందిత శ్వేత హీరోయిన్‌గా నటించిన ‘ జెట్టి’ సినిమా ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్ ఫాం ‘ ఆహ’లో స్ట్రీమింగ్ అవుతోంది. నిన్న (నవంబర్ 17)నుంచి ఓటీటీ ప్రేక్షకులకు అందుబాటులోకి వచ్చింది. ఇక, ఈ సినిమాలో నందిత శ్వేత, మాన్యం క్రిష్ణ జంటగా నటించారు. కన్నడ కిశోర్, గోపీ, శివాజీ రాజా, జీవా, ఎంఎస్ చౌదరి, సుమన్ శెట్టి తదితరులు కీలక పాత్రలు చేశారు. పిచ్చుక సుబ్రమణ్యం దర్శకత్వం వహించారు. వర్థిన్ ప్రొడక్షన్ పతాకంపై కే వేణు మాధవ్ సినిమాను నిర్మించారు. పోయిన ఏడాది నవంబర్ 4వ తేదీన సినిమా థియేటర్లలో రిలీజైంది. అయితే, సినిమా ప్రేక్షకులను మెప్పించటంలో విఫలం అయింది.
కటారిపాలెం అనే ఓ గ్రామం ఉంటుంది. ఆ గ్రామంలోని ప్రజలు కట్టుబాట్లను ఎక్కువగా ఫాలో అవుతూ ఉంటారు. ఊరి పెద్ద జాలయ్య(ఎంఎస్ చౌదరి) ఆ కట్టుబాట్లను పరిరక్షిస్తూ ఉంటారు. ఇక, ఆ గ్రామానికి చెందిన మత్స్యకారుల బోట్లు తుఫానుల తాకిడికి కొట్టుకుపోయి నష్టాలు వస్తూ ఉంటాయి. ఇలా జరగకుండా ఉండాలని ప్రజలందరూ కలిసి ఎమ్మెల్యే దశరథ రామయ్య(శివాజీ రాజా)ను కలుస్తారు. తమ సమస్యను మొరపెట్టుకుంటారు. ప్రతిపక్ష పార్టీ నేత కావటంతో చేతులు ఎత్తేస్తాడు.
దీనికి తోడు జెట్టి కట్టకుండా విలన్(మైమ్ గోపీ) అడ్డుతగులుతూ ఉంటాడు. ఆ ప్రాంతానికి టీచర్‌గా వచ్చిన ‘కృష్ణ మాన్యం’ గ్రామ అభివృద్ధి కోసం తన వంతు కృషి చేస్తూ ఉంటాడు. ఈ నేపథ్యంలో ఊరి పెద్ద కూతురు మీనాక్షి( నందిత శ్వేత)తో ప్రేమలో పడతాడు. ఓ రోజు వీరిద్దరూ గ్రామం వదిలి వెళ్లిపోతారు. దీంతో జాలయ్య అవమానం ఫీలవుతాడు. ఓ వైపు కూతురు.. మరో వైపు జెట్టి.. జాలయ్య ఏం చేశాడు అన్నదే మిగితా కథ. సినిమా కథ పరంగా ఓకే అనిపించినా.. తెర కెక్కించిన విధానం అంతగా ఆకట్టుకోలేకపోయింది. మరి, జెట్టి సినిమా దాదాపు సంవత్సరం తర్వాత ఓటీటీలోకి రావటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.