P Venkatesh
జీవితరాజశేఖర్ కొన్ని కొన్ని విషయాల్లో చాలా సూటిగా ఉంటారు. తన అభిప్రాయాలను సూటిగా చెప్పడం ఆమెకి అలవాటు. తాజాగా ఆడపిల్లల మందు అలవాటుపై జీవితరాజశేఖర్ సంచలన కామెంట్స్ చేసింది.
జీవితరాజశేఖర్ కొన్ని కొన్ని విషయాల్లో చాలా సూటిగా ఉంటారు. తన అభిప్రాయాలను సూటిగా చెప్పడం ఆమెకి అలవాటు. తాజాగా ఆడపిల్లల మందు అలవాటుపై జీవితరాజశేఖర్ సంచలన కామెంట్స్ చేసింది.
P Venkatesh
జీవిత.. ఈ మాటని ఒక్కటిగా చెప్పడం మానేసి దశాబ్దాలు దాటింది. ఆమె ఇప్పుడు జీవితరాజశేఖర్. ఒక్క పేరులో మాత్రమే కాదు.., భర్త కష్ట సుఖాల్లో కూడా ఆమె అంతే బాధ్యత తీసుకుంటూ వచ్చారు. స్టార్ హీరోయిన్ అయ్యుండి, అంతటి సెలబ్రటీ స్టేటస్ అనుభవిస్తూ కూడా ఆదర్శ గృహిణి అనే మాటకి పర్యాయపదంగా నిలిచారు. భోళాశంకరుడైన రాజశేఖర్ ఎమోషన్స్ కంట్రోల్ చేస్తూ, కెరీర్ కొనసాగిస్తూ, పిల్లల జీవితాలను ప్లాన్ చేస్తూ జీవితరాజశేఖర్ సాగించిన, సాగిస్తున్న ప్రయాణం ప్రతి స్త్రీకి ఓ పాఠ్యపుస్తకం లాంటిది అని చెప్పడంలో అస్సలు అతిశయోక్తి లేదు.
గృహిణిగా ఇంత సాధించింది కాబట్టి ఆమెది సైలెంట్ గా ఉండే మనస్తత్వం అనుకుంటే పప్పులో కాలేసినట్టే. అన్యాయాన్ని నిక్కచ్చిగా ప్రశ్నించడంలో ముందుటుంది. స్త్రీ బాధ్యతలు గురించి తెలిసిన మహిళ కాబట్టి.. వారి హక్కుల గురించి కూడా అంతే గట్టిగా నిలదీస్తుంది. ఇందుకే అంతమంది సీనియర్ హీరోయిన్స్ ఉన్నా.., అందరిలో జీవితరాజశేఖర్ స్థానం మాత్రం ప్రత్యేకం. కాగా.. తాజాగా జీవిత చేసిన ఓ కామెంట్ మొత్తం సోషల్ మీడియాని షేక్ చేస్తోంది.
తాజాగా జీవిత ఓ ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యారు. ఇందులో తన ఇష్టాఇష్టాలు ఏంటి? టైమ్ ప్లాన్ ఏంటి ఇలాంటి అన్నీ విషయాలు గురించి మాట్లాడారు. నాకు.. మా వారిని, ఇంటిని, ఇద్దరు కూతుళ్ళని జాగ్రత్తగా చూసుకోవడమే ముఖ్యం. ఎక్కువ సంతోషం కూడా అదే. అదే నా మొదటి ప్రయారిటీ. నా కుటుంబ సభ్యుల అవసరాలు, పనులు ఇంకెవరో చేస్తే నాకు నచ్చదు. వాళ్లకు కావాల్సినవన్నీ అమర్చి పెట్టడమే ఇష్టం. ఆ పనులన్నీ అయ్యాకే నా వ్యాపకాలు అయినా, వ్యాపారాలు అయినా! ఇక నేను బయటకి వెళ్ళేది తక్కువ కాబట్టి.. నాకంటూ ఫ్రెండ్స్ గ్రూప్ లేరు. స్కూల్ ఫ్రెండ్స్ మాత్రం ఇప్పటికీ టచ్ లో ఉన్నారు. వారిలో డైరెక్టర్ తేజ, కొరియోగ్రాఫర్ బృంద, సుచిత్ర చంద్రబోస్ వంటి కొందరు సినిమా వాళ్ళు కూడా ఉన్నారు.
కరోనా సంశయంలో మా క్లాస్ మేట్స్ ఫోన్ నెంబర్స్ అన్నీ సంపాదించి.., వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేశాను. ఇప్పుడు కూడా అందులో చాట్ చేస్తుంటాను. అంతకుమించి స్నేహితులు లేరు. ఇక ఎలాంటి సమయాల్లో అయినా తాగడం అనేది అస్సలు అలవాటు లేదు. ఆలా అని ఆడపిల్లని కాబట్టి తాగను అని కాదు. నాకు ఇష్టం లేదు అంతే. ఒకవేళ ఎవరైనా వచ్చి ఆడపిల్ల తాగడం ఏంటి అంటే మాత్రం అస్సలు ఒప్పుకోను నేను ముందు వెళ్లి ఎందుకు తాగకూడదు అని నిలదీస్తా.
మందు తాగడానికి ఆడ మగ అనే తేడా ఎందుకు? లైన్ క్రాస్ చేసి, మర్యాద పోగొట్టుకొనే వరకు ఎవరి సరదాలు వారివే. దాన్ని జెండర్ బట్టి జెస్టిఫై చేయడం కరెక్ట్ కాదని జీవితరాజశేఖర్ కామెంట్స్ చేయడం విశేషం. ఇక్కడ జీవిత ఉద్దేశం ఆడపిల్లలని తాగమని చెప్పడం కాదు, ప్రోత్సహించడం అంతకన్నా కాదు. ఆడపిల్ల కాబట్టి తాగకూడదని చెప్పడం. మరి జీవిత కామెంట్స్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.