iDreamPost

బూతులు తిట్టడానికి మమ్మల్ని వాడుకోకండి.. ఇంద్రజ ఎమోషనల్ మెసేజ్!

మార్చి 8న మహిళ దినోత్సవం సందర్భంగా శ్రీదేవి డ్రామా కంపెనీ స్పెషల్ ఈవెంట్ నిర్వహిస్తోంది. తాజాగా దీనికి సంబంధించిన ప్రోమోను విడుదల చేసింది. ఇందులో కాస్త ఎమోషనల్ అయ్యారు ఇంద్రజ

మార్చి 8న మహిళ దినోత్సవం సందర్భంగా శ్రీదేవి డ్రామా కంపెనీ స్పెషల్ ఈవెంట్ నిర్వహిస్తోంది. తాజాగా దీనికి సంబంధించిన ప్రోమోను విడుదల చేసింది. ఇందులో కాస్త ఎమోషనల్ అయ్యారు ఇంద్రజ

బూతులు తిట్టడానికి మమ్మల్ని వాడుకోకండి.. ఇంద్రజ ఎమోషనల్ మెసేజ్!

బుల్లితెరపై ఎంటర్ టైన్ మెంట్‌కు కొదవ లేదు. సీరియల్స్, సినిమాలు, ప్రత్యేక కార్యక్రమాలతో ఫుల్ ఫన్ అందిస్తున్నాయి టెలివిజన్ ఛానల్స్. అందులో ఒకటి ప్రముఖ ఛానల్స్‌లో వస్తున్న శ్రీదేవి డ్రామా కంపెనీ. జబర్దస్త్, ఎక్ ట్రా జబర్దస్త్ నటీనటులంతా ఈ వేదికపై సందడి చేస్తుంటారు. ప్రతి వారం ఏదో ఒక కాన్సెప్ట్ తీసుకు వచ్చి.. ఎంటర్ టైన్ చేస్తుంటారు. అలాగే సినీ సెలబ్రిటీలు కూడా వచ్చి హంగామా సృష్టిస్తుంటారు. కొన్ని సార్లు ఫన్ కాస్త హద్దులు దాటినా.. మొత్తాన్ని సక్సెస్ ఫులో షోగా దూసుకెళ్లిపోతుంది. శ్రీదేవి డ్రామా కంపెనీకి జడ్జిగా వ్యవహరిస్తున్నారు ఒకప్పటి అందాల తార ఇంద్రజ. ప్రస్తుతం ఆమె జబర్దస్త్ షోలో జడ్జిగా వ్యవహరిస్తున్న సంగతి విదితమే.

మార్చి 8న మహిళా దినోత్సవ సందర్భంగా ఓ స్పెషల్ ఈవెంట్ చేపడుతోంది శ్రీదేవి డ్రామా కంపెనీ. దీనికి సంబంధించిన ప్రోమోను విడుదల చేశారు. ఈ షోకు ముఖ్య అతిధిగా వచ్చారు శ్రీరామ్. వళరి అనే మూవీ ప్రమోషన్లలో భాగంగా వచ్చి ఈ ధారావాహికకు స్పెషల్ ఎట్రాక్షన్ అయ్యారు. మానస్ డ్యాన్స్ తన దైన స్టైల్లో డ్యాన్స్ ఇరగ దీశాడు. అలాగే బిగ్ బాస్ ఫేమ్ జెస్సీ ఈ వేదికగా ఓ అమ్మాయికి లవ్ ప్రపోజ్ చేశాడు. అలాగే రోషిణీ, శిల్పా చక్రవర్తి, మరో ఇద్దరు అమ్మాయిలు కలిసి వీర నారీమణుల గాధలతో కూడిన ఫెర్మామెన్స్‌కు ఫిదా అయిన ఇంద్రజ..‘ఆడదానికి ప్రాణం పోయడమే కాదు.. కావాల్సి వస్తే ప్రాణం తీయడం తెలుసు అని ఇలాంటి మహిళలు నిరూపించారు’ అంటూ కామెంట్స్ చేశారు. ఈ సందర్భంలో ఓ ఎమోషనల్ మెసేజ్ అందించారు.

‘దయచేసి బూతులు తిట్టుకోవడానికి మమ్మల్ని వాడుకోకండి. మగాళ్లు.. మగాళ్లు కొట్టుకుంటున్నారా మీ పేర్లతోనే తిట్టుకోండి’ అంటూ కాస్త ఎమోషనల్ అయ్యారు. ఏ సందర్భంలో ఈ వ్యాఖ్యలు వచ్చాయో.. మొత్తం వీడియో విడుదలయ్యాక తెలుస్తుంది. ఆమె అలా అన్నది అని కాదు కానీ.. వాస్తవంగా బయట.. ఎవరైనా కోపంలో తిట్టుకుంటుంటే.. ముందుగా మహిళల పేర్లతో బండ బూతులు తిడుతుంటారు. ముఖ్యంగా పురుషులు.. నలుగురు మాట్లాడుకున్న చోట్ల. .ఇటువంటి బూతు పదాలు ఎక్కువ వినిపిస్తుంటాయి. తమ ఇంట్లో ఆడ పిల్లలు ఉన్నారని, తమను కన్నది ఓ అమ్మే అని మర్చిపోయి, ఇలాంటి వ్యాఖ్యలు చేస్తుంటారు. బహుశా దీన్ని ఉద్దేశించి.. ఇంద్రజ ఇలాంటి మాటలు అన్నారేమో..ఈ ఆదివారం వరకు వెయిట్ చేయాల్సిందే. ఈ కార్యక్రమం మార్చి 10న ప్రసారం అవుతుంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి