iDreamPost
android-app
ios-app

జవాన్ కలెక్షన్స్! రికార్డు స్థాయిలో ఫస్ట్ డే ఓపెనింగ్స్!

  • Author ajaykrishna Updated - 11:47 AM, Fri - 8 September 23
  • Author ajaykrishna Updated - 11:47 AM, Fri - 8 September 23
జవాన్ కలెక్షన్స్! రికార్డు స్థాయిలో ఫస్ట్ డే ఓపెనింగ్స్!

బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్.. పఠాన్ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత జవాన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. తమిళ దర్శకుడు అట్లీ తెరకెక్కించిన ఈ యాక్షన్ మూవీని.. షారుఖ్ భార్య గౌరీ ఖాన్ భారీ బడ్జెట్ తో నిర్మించారు. భారీ అంచనాల మధ్య జవాన్.. సెప్టెంబర్ 7న పాన్ ఇండియా మూవీగా వరల్డ్ వైడ్ రిలీజ్ అయ్యింది. మార్నింగ్ షోస్ నుండే పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్న జవాన్.. మరో బ్లాక్ బస్టర్ వైపు పరుగులు పెడతోంది. ఓవైపు పఠాన్ లాంటి సాలిడ్ హిట్ వల్ల.. జవాన్ పై ఫ్యాన్స్ లో అంచనాలు పీక్స్ కి చేరుకున్నాయి. అదిగాక జవాన్ సాంగ్స్, ట్రైలర్ అన్నికూడా సినిమాపై అంచనాలు పెంచుతూ వచ్చాయి.

ఒకే ఏడాదిలో షారుఖ్ ఇండస్ట్రీలోని రికార్డులను కొల్లగొడుతూ తనవైపు దృష్టి మళ్ళించాడని చెప్పవచ్చు. జవాన్ లో నయనతార, దీపికా పదుకొనే, విజయ్ సేతుపతి కీలకపాత్రలతో పాటు షారుఖ్ డ్యూయెల్ రోల్ లో నటించడం విశేషం. కాగా.. మొదటి రోజు కలెక్షన్స్ ఆదరగొడుతుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేయగా.. ఇప్పుడు ఫస్ట్ డే ఓపెనింగ్స్ కి సంబంధించి కలెక్షన్స్ నెంబర్స్ సాలిడ్ గా వినిపిస్తున్నాయి. ఇప్పటిదాకా ఏ బాలీవుడ్ సినిమా సాధించని రికార్డును జవాన్ ఖాతాలో వేసుకుంది. మొదటి రోజు ఏకంగా రూ. 120 కోట్లకు పైగా వరల్డ్ వైడ్ గ్రాస్.. రూ. 70 కోట్ల నెట్ వసూల్ చేసినట్లు సమాచారం.

ఈ లెక్కన ఇప్పటివరకు ఏ బాలీవుడ్ సినిమా రూ. 70 కోట్ల నెట్ అందుకోలేకపోయాయి. ఈ ఏడాది పఠాన్ రూ. 57 కోట్లతో పాటు అంతకుముందు కేజీఎఫ్ 2 రూ. 53.95 కోట్లు, వార్ రూ. 53.35 కోట్లు.. థగ్స్ ఆఫ్ హిందూస్తాన్ రూ. 52.25 కోట్లు.. బాహుబలి 2 రూ. 41 కోట్లు నెట్ ఓపెనింగ్స్ గా నమోదు చేశాయి. మరి షారుఖ్ ఖాన్.. పాత రికార్డులన్నీ చెరిపేస్తూ తన సినిమాలతో కొత్త రికార్డులు నమోదు చేస్తున్నాడు. పఠాన్ తో ఈ ఏడాది రూ. 1000 కోట్ల క్లబ్ లో చేరిన షారుఖ్.. ఇప్పుడు జవాన్ తో కూడా ఆ రికార్డు ఈజీగా క్రాస్ చేస్తాడని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. జవాన్ కి అట్లీ కథా కథనాలతో పాటు అనిరుధ్ సంగీతం ప్లసు అయ్యిందని అంటున్నారు. సో.. జవాన్ హవా మున్ముందు ఎలా సాగనుందో చూడాలి. జవాన్ గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişjojobet girişCasibombetciograndpashabet