iDreamPost
android-app
ios-app

జవాన్ కలెక్షన్స్! రెండు రోజులకు ఎంత వసూల్ చేసిందంటే..

  • Author ajaykrishna Published - 12:40 PM, Sat - 9 September 23
  • Author ajaykrishna Published - 12:40 PM, Sat - 9 September 23
జవాన్ కలెక్షన్స్! రెండు రోజులకు ఎంత వసూల్ చేసిందంటే..

ఇండియన్ సూపర్ స్టార్స్ లో ఒకరైన షారుఖ్ ఖాన్.. ఈ ఏడాది పఠాన్ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత జవాన్ తో ప్రేక్షకుల ముందుకొచ్చేశాడు. డైరెక్టర్ అట్లీ తెరకెక్కించిన ఈ సినిమా.. పాన్ ఇండియా మూవీగా సెప్టెంబర్ 7న థియేటర్స్ లో రిలీజ్ అయ్యింది. పఠాన్ లాంటి రూ. 1000 కోట్ల గ్రాస్ వసూల్ చేసిన సినిమా తర్వాత.. షారుఖ్ నుండి వచ్చేసరికి.. జవాన్ పై ఫ్యాన్స్ లో అంచనాలు పీక్స్ కి చేరుకున్నాయి. సాంగ్స్, ప్రమోషన్స్ తో నెక్స్ట్ లెవెల్ హైప్ క్రియేట్ చేసిన జవాన్.. థియేటర్స్ లో ఆ హైప్, అంచనాలను రీచ్ అయ్యిందని బ్లాక్ బస్టర్ రిపోర్ట్స్ చూస్తుంటే అర్ధమవుతుంది. జవాన్.. ఫస్ట్ డే ఏకంగా రూ. 129 కోట్లు కొల్లగొట్టింది.

జవాన్ షారుఖ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ ఓపెనర్ గా అవతరించింది. పఠాన్ రూ. 107 కోట్ల ఓపెనింగ్స్ ని మించి జవాన్.. బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది. దాదాపు 9 ఏళ్లుగా షారుఖ్ నుండి సాలిడ్ కంబ్యాక్ హిట్ కోసం వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. అలాంటిది ఒక్కసారిగా వెయ్యి కోట్లు కొట్టే సినిమా తీస్తే ఏమైనా ఉందా.. తదుపరి సినిమాలపై ఆటోమేటిక్ గా అంచనాలు అదే రేంజ్ లో ఉంటాయి. సో.. ఇప్పుడు జవాన్ పై కూడా అలాంటి హైప్ నెలకొంది. ఈజీగా పఠాన్ రికార్డులు తిరగేస్తుందని చెబుతున్నారు. భారీ అంచనాల మధ్య విడుదలైన జవాన్.. ప్రేక్షకుల నుండి అదే రేంజ్ రెస్పాన్స్ దక్కించుకొని రెండు రోజుల్లో అద్భుతమైన కలెక్షన్స్ రాబట్టిందని సమాచారం.

ట్రేడ్ వర్గాల లేటెస్ట్ సమాచారం ప్రకారం.. జవాన్ రెండో రోజు కూడా వంద కోట్లకు పైగా వసూల్ చేసినట్లు తెలుస్తోంది. కొన్ని సోర్స్ లను బట్టి.. జవాన్ రెండో రోజు రూ. 107 కోట్ల వరకు ఖాతాలో వేసుకుందని టాక్. దీనిపై మేకర్స్ నుండి అధికారిక పోస్టర్ రిలీజ్ కావాల్సి ఉంది. కాగా.. ఈ మూవీని రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌ పై గౌరీ ఖాన్ నిర్మించారు. నయనతార, దీపికా పదుకొనే, విజయ్ సేతుపతి, ప్రియమణి లాంటి స్టార్స్ ఇందులో కీలకపాత్రలలో నటించారు. ఈ యాక్షన్ మూవీకి దాదాపు రూ. 300 కోట్ల రేంజ్ లో ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది. మరి జవాన్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎన్ని డేస్ లో కంప్లీట్ చేస్తుందో చూడాలి. జవాన్ గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetMadridbetJojobetHoliganbetMadridbetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişjojobet girişCasibombetciograndpashabet