iDreamPost
android-app
ios-app

ఈ బుగ్గలున్న చిన్నారి.. మోస్ట్ వాంటెడ్ హీరోయిన్

  • Published Mar 06, 2024 | 5:17 PM Updated Updated Mar 06, 2024 | 5:17 PM

ఈ ఫోటోలో ఇద్దరు చిన్నారులు కనిపిస్తున్నారు కదా.. వీరిద్దరూ సెలబ్రిటీల పిల్లలే. ఇందులో బూరెల్లాంటి బుగ్గలతో తదేకంగా చూస్తున్న ఈ అమ్మాయి అయితే.. ఇప్పుడు మోస్ట్ వాంటెండ్ హీరోయిన్.. ఎవరో చెప్పుకోండి చూద్దాం

ఈ ఫోటోలో ఇద్దరు చిన్నారులు కనిపిస్తున్నారు కదా.. వీరిద్దరూ సెలబ్రిటీల పిల్లలే. ఇందులో బూరెల్లాంటి బుగ్గలతో తదేకంగా చూస్తున్న ఈ అమ్మాయి అయితే.. ఇప్పుడు మోస్ట్ వాంటెండ్ హీరోయిన్.. ఎవరో చెప్పుకోండి చూద్దాం

  • Published Mar 06, 2024 | 5:17 PMUpdated Mar 06, 2024 | 5:17 PM
ఈ బుగ్గలున్న చిన్నారి.. మోస్ట్ వాంటెడ్ హీరోయిన్

కొత్త భామలు వస్తున్నారంటే.. రెడ్ కార్పెట్ పరిచేస్తుంది టాలీవుడ్ ఇండస్ట్రీ. బాలీవుడ్ టు మాలీవుడ్ వయా శాండిల్ వుడ్.. ఏ పరిశ్రమలో అయినా ముద్దుగుమ్మ క్లిక్ అయితే చాలు వెంటనే కాల్షీట్ల కోసం కాల్ చేసేస్తుంటారు దర్శక, నిర్మాతలు. అవసరమైతే అన్ని ఛార్జీలు పెట్టుకుని.. ఇక్కడకు తీసుకు వచ్చి సినిమాల్లో ఛాన్సులు ఇస్తుంటారు. ఆ బ్యూటీ అమ్మలు, అమ్మమ్మలకు అయ్యే ఖర్చులు కూడా బరాయిస్తుంటారు. అలాంటిది సెలబ్రిటీల కూతుర్లైతే వదిలేస్తుంటారా.. కచ్చితంగా టీటౌన్ తీసుకు వచ్చి లైఫ్ ఇచ్చేయరు. ఇదిగో ఈ ఫోటోలో ఇద్దరు చిన్నారులు కనిపిస్తున్నారు కదా.. వీరిద్దరూ కూడా సినీ సెలబ్రిటీల పిల్లలే. ఇప్పుడు వెండితెరపై వెలుగొందేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు.

ఈ ఇద్దరు చిన్నారులను చూశారు కదా.. ఎవరో గుర్తు పట్టారా.. వీళ్లే కాదూ.. వీళ్ల పేరెంట్స్ కూడా ఇండస్ట్రీకి చెందిన వాళ్లే.. వాళ్లలో లెఫ్ట్ సైడ్ కూర్చొని ఫోటోలకు ఫోజులిస్తున్న ఈ క్యూటీ అయితే.. మనకు చాలా దగ్గర మనిషి. ఆమె కుటుంబం మొత్తం ఎప్పటి నుండో ఇండస్ట్రీలో పాతుకు పోయింది. ఇక ఆమె అమ్మ అయితే.. టాలీవుడ్ లో ఓ వెలుగు వెలిగిన ధ్రువతార. ఈ పాప కూడా ఇప్పుడు పెద్దదై.. తల్లిలా పేరు తెచ్చుకునేందుకు తహతహలాడిపోతుంది. ఇక ఇందులో నిల్చుని ఎవరినో చూస్తున్న పాప తండ్రి కూడా ప్రముఖ హీరోనే. బాలీవుడ్ లోనే కాదూ.. బంగ్లాదేశ్ చిత్రాల్లో కూడా సత్తా చాటాడు. తెలుగు వారికి ప్రభాస్ మూవీతో సుపరిచితమయ్యాడు. ఇంతకు ఆ చిన్నారులు ఎవరంటే.. బోనీ కపూర్- అతిలోక సుందరి పెద్ద కూతురు జాన్వీ కపూర్. ఇక ఆ రెండో చిన్నది బాలీవుడ్ సీనియర్ హీరో.. చుంకీ పాండే తనయ అనన్య పాండే.  తెలుగు లైగర్ మూవీలో నటించింది.

ఈ రోజు జాన్వీ కపూర్ పుట్టిన రోజు సందర్భంగా ఈ పిక్ షేర్ చేసుకుంది అనన్య. వీరిద్దరు చిన్నప్పటి నుండే ఫ్రెండ్స్, అప్పట్లో తీయించుకున్న ఈ పిక్ సోషల్ మీడియాలో పంచుకున్న అనన్య.. ఆమెకు విష్ చేసింది. ఇక ఈ బూరి బుగ్గల సుందరి జాన్వీ నాజుగ్గా మారి.. టాలీవుడ్ ఏలేందుకు రెడీ అయిపోయింది. ధడక్ మూవీతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన జాన్వీ కపూర్.. గుంజన్ సక్సేనా, గుడ్ లక్ జెర్రీ, మిలి వంటి చిత్రాలతో అలరించింది. బాలీవుడ్ నుండి టాలీవుడ్ బాట పట్టింది. దేవరలో జూనియర్ ఎన్టీఆర్ సరసన ఆడిపాడనున్న ఈ అందం..తొలి సినిమా విడుదల కాకుండానే.. సెకండ్ ఛాన్స్ కొట్టేసింది. రామ్ చరణ్ సరసన..హీరోయిన్ గా ఫిక్స్ అయ్యింది. ఆర్‌సీ 16గా రాబోతున్న ఈ చిత్రానికి బుచ్చిబాబు దర్శకుడు. ఇవే కాకుండా.. హిందీ దోస్తానాలో కూడా నటిస్తోంది అమ్మడు.  వరుస ఆఫర్లతో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ అయిపోయింది ఈ  బ్యూటీ.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetHoliganbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetbetwoon girişgrandpashabetEscortes BelgiqueGrandpashabetCasibomGrandpashabet Giriş