iDreamPost
android-app
ios-app

ఓటిటిలో రిలీజైన జైలర్.. స్ట్రీమింగ్ ఎక్కడో తెలుసా..?

  • Author ajaykrishna Updated - 03:30 PM, Thu - 7 September 23
  • Author ajaykrishna Updated - 03:30 PM, Thu - 7 September 23
ఓటిటిలో రిలీజైన జైలర్.. స్ట్రీమింగ్ ఎక్కడో తెలుసా..?

కొన్ని సినిమాలు థియేటర్స్ లో రన్ అవుతుండగానే ఎప్పుడెప్పుడు ఓటిటిలోకి వస్తాయా అని ఎదురు చూస్తుంటారు జనాలు. అదేంటి అంతగా చూడాలని అనుకుంటే.. థియేటర్స్ కి వెళ్లి చూడొచ్చు కదా అనిపించవచ్చు. అదేం లేదు థియేటర్స్ లో చూసినా, ఆ ఇంపాక్ట్ అలా ఉంటుంది. అందులోనూ ఈ మధ్యకాలంలో జనాలు ఎక్కువగా ఓటిటిలకు అలవాటు పడిపోయారు. అందుకే ఏ సినిమాలైనా ఓటిటిలో ఎప్పుడు స్ట్రీమింగ్ అవుతుందని వెయిట్ చేస్తున్నారు. ఇన్ని రోజులు ఓ సినిమా కోసం అలాగే వెయిట్ చేశారు. సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన లేటెస్ట్ బ్లాక్ బస్టర్ ‘జైలర్’.

దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ తెరకెక్కించిన ఈ సినిమా.. ఆగష్టు 10న థియేటర్స్ లో విడుదలైంది. తెలుగు, తమిళం, హిందీ భాషలతో పాటు కన్నడ, మలయాళంలో కూడా రిలీజై పాన్ ఇండియాని షేక్ చేసేసింది. రోబో 2 తర్వాత రజినీ నుండి చెప్పుకోదగిన బ్లాక్ బస్టర్ రాలేదు. కానీ.. ఎలాంటి హడావిడి లేకుండా వచ్చిన జైలర్ మూవీ థియేటర్స్ లో కలెక్షన్స్ వర్షం కురిపించింది. సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ నిర్మించిన ఈ సినిమా.. ఊహించని విధంగా బాక్సాఫీస్ వద్ద రూ. 650 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టడం విశేషం. దీంతో సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయినందుకు నిర్మాత రజినీతో పాటు డైరెక్టర్, మ్యూజిక్ డైరెక్టర్స్ కి చెక్ లతో పాటు ఖరీదైన కార్లు కూడా అందించాడు.

ఇదిలా ఉండగా.. జైలర్ సినిమాని థియేటర్స్ లో చూడాలని ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ నిరీక్షణకు ఫుల్ స్టాప్ పడింది. జైలర్ విడుదలైన నెల రోజులలోపే ఓటిటికి వచ్చేసింది. సెప్టెంబర్ 7న అర్ధరాత్రి నుండి జైలర్ ఓటిటి స్ట్రీమింగ్ మొదలైంది. ఇంతకీ ఏ ఓటిటిలో తెలుసా.. అమెజాన్ ప్రైమ్ వేదికగా జైలర్ స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగు, తమిళంతో పాటు ఒకేసారి అన్ని భాషలలో అందుబాటులోకి తీసుకొచ్చారు మేకర్స్. ఈ సినిమాలో కన్నడ స్టార్ శివరాజ్ కుమార్, మలయాళం స్టార్ మోహన్ లాల్, తమన్నా కీలక పాత్రలు పోషించారు. ఇక జైలర్ ఓటిటి రిలీజ్ కోసం వెయిట్ చేసిన ఫ్యాన్స్ అంతా ఇప్పుడు ఫుల్ ఖుషి అవుతున్నారు. మరి జైలర్ సినిమా గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.

Jojobet Girişmeritbet girişcasibomcasino siteleriDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetCasibomCasibomGrandpashabetcasibomgrandpashabetmeritbet girişgrandpashabetjojobet girişcasibom girişgrandpashabetgrandpashabet girişgrandpashabetjojobet giriş