iDreamPost
android-app
ios-app

నాన్న ఎఫెక్ట్‌ ‘ఫ్యామిలీ స్టార్‌’ పై గట్టిగా ఉండబోతుందా?

  • Published Dec 12, 2023 | 2:52 PM Updated Updated Dec 12, 2023 | 2:52 PM

సీతారామం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు హీరోయిన్ గా పరిచయం అయిన ముద్దుగుమ్మ మృణాల్ ఠాకూర్‌. మొదటి సినిమాతోనే విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్న మృణాల్‌ తాజాగా హాయ్ నాన్న సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకోవడంతో ఆమె తాజా చిత్రం 'ఫ్యామిలీ స్టార్' పై అంచనాలు పెరిగాయి. 

సీతారామం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు హీరోయిన్ గా పరిచయం అయిన ముద్దుగుమ్మ మృణాల్ ఠాకూర్‌. మొదటి సినిమాతోనే విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్న మృణాల్‌ తాజాగా హాయ్ నాన్న సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకోవడంతో ఆమె తాజా చిత్రం 'ఫ్యామిలీ స్టార్' పై అంచనాలు పెరిగాయి. 

  • Published Dec 12, 2023 | 2:52 PMUpdated Dec 12, 2023 | 2:52 PM
నాన్న ఎఫెక్ట్‌ ‘ఫ్యామిలీ స్టార్‌’ పై గట్టిగా ఉండబోతుందా?

నాని హీరోగా నటించిన ‘హాయ్‌ నాన్న’ చిత్రం తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటి నాలుగు రోజుల్లో భారీ వసూళ్లు నమోదు అయినట్లుగా చిత్ర యూనిట్‌ సభ్యులు తెలియజేశారు. మొదటి రోజుతో పోల్చితే నాల్గవ రోజు వసూళ్లు భారీ ఎత్తున నమోదు అయినట్లు కూడా వారు పేర్కొన్నారు. ఫ్యామిలీ ఆడియన్స్ కి బాగా కనెక్ట్‌ అయిన హాయ్ నాన్న సినిమా కమర్షియల్ గా భారీ హిట్ దిశగా దూసుకు పోతుంది. ఈ సమయంలో సినిమాలో నటించిన మృణాల్‌ ఠాకూర్ క్రేజ్ అంతకంతకు పెరిగిందంటూ కామెంట్స్ వస్తున్నాయి. సీతారామం సినిమాతో ఇండస్ట్రీలో అడుగు పెట్టిన ముద్దుగుమ్మ మృణాల్‌ ఠాకూర్‌ హాయ్ నాన్న సినిమాతో ద్వితీయ విఘ్నంను దాటింది. బాలీవుడ్‌ లో చాలా కాలం నుంచి సినిమాలు చేస్తున్నా ఇప్పటి వరకు అక్కడ భారీ కమర్షియల్‌ హిట్స్‌ లభించలేదు. కానీ టాలీవుడ్‌ లో చేసిన రెండు సినిమాలు కూడా బ్యాక్ టు బ్యాక్‌ మంచి విజయాలను సొంతం చేసుకోవడంతో ఆమె క్రేజ్ తో పాటు పారితోషికం భారీ ఎత్తున పెరిగినట్లు సమాచారం అందుతోంది.

హాయ్ నాన్న సినిమా తర్వాత విజయ్ దేవరకొండతో కలిసి ఫ్యామిలీ స్టార్‌ సినిమాను చేసేందుకు మృణాల్ ఠాకూర్ గ్రీన్ సిగ్నల్‌ ఇచ్చింది. ఇప్పటికే అందుకు సంబంధించిన షూటింగ్ ముగింపు దశకు వచ్చింది. సంక్రాంతికి ఫ్యామిలీ స్టార్‌ సినిమా రావాల్సి ఉన్నా కూడా కొంత షూటింగ్‌ బ్యాలన్స్ ఉండటం వల్ల మార్చికి వాయిదా వేశారు అంటూ ప్రచారం జరుగుతోంది. ఆ విషయమై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. అయితే ఖుషి సినిమాతో విజయ్‌ దేవరకొండ, హాయ్‌ నాన్న సినిమాతో మృణాల్‌ ఠాకూర్ హిట్ జోష్ తో ఉండటంతో కచ్చితంగా ఫ్యామిలీ స్టార్‌ కి మంచి బజ్‌ క్రియేట్‌ అవ్వడం ఖాయం. మృణాల్‌ ఠాకూర్‌ కి హాయ్‌ నాన్న మళ్లీ మంచి పేరును తెచ్చి పెట్టింది. అందుకే ఫ్యామిలీ స్టార్‌ సినిమా ప్రీ రిలీజ్ బజ్ పెరగడంతో ఆమె పాత్ర గట్టిగా ఉంటుందని సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

మృణాల్‌ ఠాకూర్ కోసం సినిమాకు వెళ్లాలి అనుకునే వారి సంఖ్య హాయ్ నాన్న సినిమా తర్వాత పెరిగింది అనడంలో సందేహం లేదు. అందుకే ఫ్యామిలీ స్టార్‌ ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అంటూ ఎదురు చూస్తున్న వారి సంఖ్య మరింత పెరిగిందని చెప్పాలి. హీరోయిన్ గా టాలీవుడ్‌ లో ఫ్యామిలీ స్టార్‌ తో మృణాల్‌ హ్యాట్రిక్ కొట్టడం ఖాయం అంటూ ఆమె అభిమానులతో పాటు ప్రేక్షకులు నమ్మకంగా ఉన్నారు. మృణాల్‌ మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంటే కచ్చితంగా బాలీవుడ్‌ కంటే సౌత్‌ సినీ ఇండస్ట్రీలోనే తన కెరీర్‌ ను కొనసాగించేందుకు ఆసక్తి చూపించే అవకాశాలు ఉన్నట్లుగా సినీ వర్గాల వారు మరియు మీడియా సర్కిల్స్ వారు మాట్లాడుకుంటున్నారు. మరి ఫ్యామిలీ స్టార్‌ కి మృణాల్‌ సక్సెస్ ఇమేజ్ ఎంత వరకు ఉంటుందని మీరు భావిస్తున్నారు? మృణాల్‌ హిట్స్ హ్యాట్రిక్‌ దక్కించుకునేనా?

Jojobet GirişHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişCasibomgrandpashabet