iDreamPost
android-app
ios-app

దేవర, పుష్ప-2, గేమ్ ఛేంజర్, OG, రిలీజ్ డేట్స్ కి సిద్ధం అవుతాయా?

  • Published Jul 19, 2024 | 3:16 PM Updated Updated Jul 19, 2024 | 5:08 PM

Upcoming Movies in 2024 Second Half: 2024 సెకండ్ హాఫ్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ కల్కి సినిమాతో ఊపందుకున్నాయి. ఇక ఇప్పుడు ఆ రికార్డ్స్ ను కొల్లగొట్టడానికి రెడీ గా ఉన్న సినిమాలు పుష్ప2 , గేమ్ ఛేంజర్ ,దేవర,ఓజి . ఈ సినిమాలను ఎప్పుడెప్పుడు చూద్దామా అని ప్రేక్షకులు ఎంతగా ఎదురుచూస్తున్నారో.. మేకర్స్ ఈ సినిమాలను రిలీజ్ చేసే విషయంలో అంత వెనుక అడుగు వేస్తున్నారు. అసలు ఏ ఏ సినిమాలు ఎంత వరకు వచ్చాయో .. ఎప్పుడు రిలీజ్ కానున్నాయి తెలుసుకుందాం.

Upcoming Movies in 2024 Second Half: 2024 సెకండ్ హాఫ్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ కల్కి సినిమాతో ఊపందుకున్నాయి. ఇక ఇప్పుడు ఆ రికార్డ్స్ ను కొల్లగొట్టడానికి రెడీ గా ఉన్న సినిమాలు పుష్ప2 , గేమ్ ఛేంజర్ ,దేవర,ఓజి . ఈ సినిమాలను ఎప్పుడెప్పుడు చూద్దామా అని ప్రేక్షకులు ఎంతగా ఎదురుచూస్తున్నారో.. మేకర్స్ ఈ సినిమాలను రిలీజ్ చేసే విషయంలో అంత వెనుక అడుగు వేస్తున్నారు. అసలు ఏ ఏ సినిమాలు ఎంత వరకు వచ్చాయో .. ఎప్పుడు రిలీజ్ కానున్నాయి తెలుసుకుందాం.

  • Published Jul 19, 2024 | 3:16 PMUpdated Jul 19, 2024 | 5:08 PM
దేవర, పుష్ప-2, గేమ్ ఛేంజర్, OG, రిలీజ్ డేట్స్ కి సిద్ధం అవుతాయా?

ఏప్రిల్ నుంచి జూన్ వరకు సినిమాలు లేక థియేటర్స్ అన్ని సైలెంట్ అయిపోయాయి. ఇక జూన్ లో కల్కి రిలీజ్ తో మళ్ళీ థియేటర్స్ లో సందడి మొదలైంది. ప్రస్తుతం థియేటర్స్ లో చాలానే సినిమాలు రిలీజ్ అవుతున్నా కానీ.. దాదాపు అందరు ఎదురుచూసేది.. బడా హీరోల భారీ బడ్జెట్ చిత్రాల కోసమే.. ఈ క్రమంలో ఇప్పటికీ కూడా బాక్స్ ఆఫీస్ వద్ద ప్రభంజనం సృష్టిస్తున్న సినిమా కల్కి. ఈ సినిమా కలెక్షన్స్ గురించి , టాక్ గురించి ఇప్పటికే వినేసి ఉంటారు. ఇక ఆ తర్వాత భారీ బడ్జెట్ మూవీ అంటూ శంకర్ రూపొందించిన భారతీయుడు 2 మూవీ రిలీజ్ అయింది. కానీ ఈ సినిమా మాత్రం అనుకున్న రేంజ్ లో ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. దీనితో ఇప్పుడు మూవీ లవర్స్ అంతా రాబోయే బడా హీరోల చిత్రాలే మీదే ఆశలు పెట్టుకున్నారు. కానీ మూవీ మేకర్స్ మాత్రం ప్రేక్షకులకు నిరాశ మిగిల్చేలా ఉన్నారు.

2024 సెకండ్ హాఫ్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ కల్కి సినిమాతో ఊపందుకున్నాయి. ఇక ఇప్పుడు ఆ రికార్డ్స్ ను కొల్లగొట్టడానికి రెడీ గా ఉన్న సినిమాలు.. అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప2 , రామ్ చరణ్.. గేమ్ ఛేంజర్ , ఎన్టీఆర్.. దేవర, పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఓజి , హరి హర వీరమల్లు ఈ సినిమాల గురించి అనౌన్స్ చేసిన దగ్గర నుంచి.. ఇప్పటివరకు వచ్చిన ప్రతి అప్ డేట్ కూడా ప్రేక్షకులకు ఆ సినిమాలపై భారీ అంచనాలు పెంచేశాయి. దీనితో ఈ సినిమాలను ఎప్పుడెప్పుడు చూద్దామా అని ప్రేక్షకులు ఎంతగా ఎదురుచూస్తున్నారో.. మేకర్స్ ఈ సినిమాలను రిలీజ్ చేసే విషయంలో అంత వెనుక అడుగు వేస్తున్నారు. అసలు ఏ ఏ సినిమాలు ఎంత వరకు వచ్చాయో .. ఎప్పుడు రిలీజ్ కానున్నాయి తెలుసుకుందాం.

దేవర:

తారక్ సింగల్ స్టారర్ మూవీ తీసి దాదాపు ఆరేళ్ళు అయిందని చెప్పి తీరాలి.. అందులోను ఆర్ఆర్ఆర్ తర్వాత వెండి తెరపై తారక్ మళ్ళీ కనిపించలేదు. ఇక ఇప్పుడు కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న దేవర మూవీతో.. బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ ను బద్దలకొట్టడానికి వచ్చేస్తున్నాడు. ఈ సినిమా సెప్టెంబర్ 27న రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు మేకర్స్. కానీ ఇప్పటివరకు సినిమా రిలీజ్ కు సంబంధించిన హడావిడి మాత్రం ఎక్కడా కనిపించడంలేదు. మరి ఈ మూవీ చెప్పిన టైమ్ కు వస్తుందో లేదో వేచి చూడాలి.

Devara

పుష్ప 2:

ఈ సినిమా గురించి ఇప్పటికే చాలా అప్ డేట్స్ వచ్చాయి. వచ్చిన ప్రతి అప్ డేట్ కూడా ఒక దానికి మించి మరొకటి.. సినిమాపై అంచనాలను పెంచేశాయి.. మొదట ఈ సినిమాను ఆగష్టు లో రిలీజ్ చేస్తామని చెప్పడంతో.. ఫ్యాన్స్ అంతా చాలా హోప్స్ పెంచేసుకున్నారు. ఇప్పుడున్న హైప్ లోనే సినిమా రిలీజ్ చేస్తే మాత్రం అనుకున్నట్లుగానే భారీ హిట్ అందుకునేది. కానీ మేకర్స్ మాత్రం ఈ మూవీ రిలీజ్ ను డిసెంబర్ 6 కు పోస్ట్ పోన్ చేశారు. మరి ఈసారైనా అనుకున్న టైమ్ కు ఈ పాన్ ఇండియా మూవీని రిలీజ్ చేస్తారో లేదో చూడాలి.

pushpa2

హరి హర వీరమల్లు , ఓజి :

పవన్ కళ్యాణ్, డైరెక్టర్ క్రిష్ కాంబినేషన్ లో అనౌన్స్ చేసిన మూవీ.. హరి హర వీరమల్లు.. ఈ సినిమా ఎప్పుడో 2021 లో స్టార్ట్ అయింది. కానీ ఇంకా షూటింగ్ కూడా పూర్తవ్వలేదు. అసలు మేకర్స్ నుంచి ఈ సినిమా గురించి ఏ అప్ డేట్ లేదు. దీనితో విడుదల చేసిన చిన్న గ్లిమ్స్ తోనే సరిపెట్టుకున్నారు అభిమానులు. అయితే ఇప్పటికి 70 శాతం షూటింగ్ పూర్తయిందని సమాచారం. అలాగే పవన్ కళ్యాణ్ , సుజీత్ కాంబినేషన్ లో వస్తున్న మూవీ ఓజి. సెప్టెంబర్ లో ఈ మూవీ రిలీజ్ అవుతుందని ఎదురుచూసిన అభిమానుల ఆశలు అడియాశలు అయ్యాయి. ఎందుకంటే ఈ మూవీ రిలీజ్ ను ఏకంగా 2025 కు పోస్ట్ పోన్ చేశారు. మరి ఈ రెండు సినిమాల అప్ డేట్స్ కోసం వెయిట్ చేయాల్సిందే.

OG

గేమ్ ఛేంజర్:

ఇప్పటివరకు చెప్పుకున్న సినిమాలన్నీ ఒక లెక్క అయితే.. ఈ సినిమా ఒక లెక్క ఎందుకంటే.. ఆర్ఆర్ఆర్ తర్వాత రామ్ చరణ్ పైన అందరు భారీగా ఎక్స్పెక్టేషన్స్ పెంచుకున్నారు. కానీ శంకర్ కాంబినేషన్ వస్తున్న ఈ సినిమాకు లీస్ట్ హైప్ క్రియేట్ అవుతుంది. అందులోను రీసెంట్ గా వచ్చిన భారతీయుడు 2 అనుకున్న రేంజ్ లో లేకపోవడంతో.. గేమ్ ఛేంజర్ పై అందరికి టెన్షన్ మొదలైంది. ఈ సినిమా అనౌన్స్ చేసి రెండేళ్లు అయింది.. ఇంకా షూటింగ్ పెండింగ్ ఉందని సమాచారం.. జూలై , ఆగష్టు లో షూటింగ్ కంప్లీట్ చేసి.. నవంబర్ , డిసెంబర్ లో మూవీ రిలీజ్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారు మేకర్స్.

Game changer

ఇక ఈ సినిమాలే కాకుండా.. న్యాచురల్ స్టార్ నాని.. సరిపోదా శనివారం ఆగష్టు 29న , రామ్ పోతినేని డబుల్ ఇస్మార్ట్ ఆగష్టు 15న , నాగ చైతన్య తండేల్ అక్టోబర్ 11 న థియేటర్ రిలీజ్ కు సిద్ధంగా ఉన్నాయి. ప్రస్తుతం ఈ మీడియం బడ్జెట్ సినిమాలకు కూడా డీసెంట్ హైప్ నడుస్తుంది. ఇక వీటిలో ఏ మూవీ బాక్స్ ఆఫీస్ బరిలో విజేతగా నిలుస్తుందో వేచి చూడాలి. మరి ఈ మూవీ అప్ డేట్స్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişmeritbetmeritbetmeritkingPradabet güncel girişcasibomJojobet GirişjojobetjojobetjojobetcasibommeritkingMadridbetPokerklasJojobet GirişjojobetHoliganbet GirişOnwin Girişdeneme bonusu veren siteler