iDreamPost
android-app
ios-app

బ్రేకింగ్: ప్రమాదానికి గురైన ఉపాసన తాతయ్య ప్రయాణిస్తున్న కారు.. ఆందోళనలో మెగా కోడలు

  • Published Jun 06, 2024 | 2:15 PM Updated Updated Jun 06, 2024 | 2:32 PM

Upasana Grandfather Met An Accident: ఉపాసన తాతయ్య ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. చెన్నైలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఒక వ్యాన్ కారు మీదకి దూసుకురావడంతో ప్రమాదం చోటు చేసుకుంది. ఈ విషయం తెలియడంతో ఉపాసన సహా కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు.

  • Published Jun 06, 2024 | 2:15 PMUpdated Jun 06, 2024 | 2:32 PM
బ్రేకింగ్: ప్రమాదానికి గురైన ఉపాసన తాతయ్య ప్రయాణిస్తున్న కారు.. ఆందోళనలో మెగా కోడలు

మెగా కోడలు, రామ్ చరణ్ సతీమణి ఉపాసన తాతయ్య, అపోలో హాస్పిటల్స్ ఛైర్మన్ ప్రతాప్ రెడ్డి ప్రయాణిస్తున్న కారుకి ప్రమాదం జరిగింది. చెన్నైలో ప్రతాప్ రెడ్డి కారులో వెళ్తుండగా ఒక వ్యాన్ ఆయన కారుపైకి దూసుకొచ్చింది. అయితే అదృష్టవశాత్తు ఎవరికీ ఏమీ కాలేదు. దీంతో కామినేని కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. కాగా ఈ ఘటనపై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఉపాసన రామ్ చరణ్ సతీమణిగా, మెగా కోడలిగా ఉంటూనే అపోలో గ్రూప్ వైస్ ప్రెసిడెంట్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.

కాగా గతేడాది ఉపాసన, రామ్ చరణ్ దంపతులకు క్లీంకారా అనే పాప పుట్టింది. ఒక పక్క పాపను చూసుకుంటూనే మరోపక్క అపోలో హాస్పిటల్ కి సంబందించిన హెల్త్ మ్యాగజైన్ కోసం ఇంటర్వ్యూలు చేస్తున్నారు. ఇక రామ్ చరణ్ విషయానికొస్తే.. ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో గేమ్ ఛేంజర్ మూవీలో నటిస్తున్నారు. ఈ సినిమాని అక్టోబర్ లేదా నవంబర్ నెలలో విడుదల చేసే యోచనలో ఉన్నారు మేకర్స్. ఇక బుచ్చిబాబు సన దర్శకత్వంలో మరొక మూవీ చేస్తున్నారు. ఈ మూవీలో జాన్వీకపూర్ హీరోయిన్ గా నటిస్తున్నారు.

Jojobet GirişJojobetJokerbetJokerbetJokerbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomCasibomgrandpashabetJojobet Girişbetpark girişgrandpashabetEscortes BelgiqueCasibomCasibom