iDreamPost
android-app
ios-app

ఈ చిన్నారి అప్పుడేమో సైడ్ యాక్టర్‌గా .. నేడు హీరోయిన్‌గా రాబోతోంది

  • Published Jun 07, 2024 | 4:03 PM Updated Updated Jun 07, 2024 | 4:46 PM

ఈ ఫోటోలో స్టైలిష్ గా ఫోజులిస్తున్న చిన్నారి.. ఆ ఇండస్ట్రీని షేక్ చేసేసింది. తెలుగులో కూడా సినిమా చేసింది కానీ.. ఎందుకో వెనక్కు వెళ్లిపోయింది. అప్పుడేమో సైడ్ యాక్టర్‌గా చేయగా.. నేడు హీరోయిన్‌గా రాబోతోంది. ఇంతకు ఆ క్యూటీ ఎవరంటే..?

ఈ ఫోటోలో స్టైలిష్ గా ఫోజులిస్తున్న చిన్నారి.. ఆ ఇండస్ట్రీని షేక్ చేసేసింది. తెలుగులో కూడా సినిమా చేసింది కానీ.. ఎందుకో వెనక్కు వెళ్లిపోయింది. అప్పుడేమో సైడ్ యాక్టర్‌గా చేయగా.. నేడు హీరోయిన్‌గా రాబోతోంది. ఇంతకు ఆ క్యూటీ ఎవరంటే..?

  • Published Jun 07, 2024 | 4:03 PMUpdated Jun 07, 2024 | 4:46 PM
ఈ చిన్నారి అప్పుడేమో సైడ్ యాక్టర్‌గా .. నేడు హీరోయిన్‌గా రాబోతోంది

తెలుగు వాళ్లకు సినిమాలపై కూసంత ఇంట్రస్ట్ ఎక్కువ. ఇప్పటి నుంచే కాదు.. సినిమా రంగం ప్రారంభమైన నాటి నుండే ఈ పిచ్చి కొనసాగుతూనే ఉంది. తెలుగు సినిమాలు చూస్తూనే.. పరాయి భాష చిత్రాలను కూడా చూసి ఎంజాయ్ చేస్తుంటారు. అక్కడ టేకింగ్ స్టైల్, టెక్నీషియన్స్, డైరెక్టర్స్, హీరో, హీరోయిన్లకు ఫ్యాన్స్ అయిపోతుంటారు. అలాగే ఇతర ఇండస్ట్రీలో కాస్త నేమ్, ఫేమ్ వస్తే చాలు ఇక్కడ ల్యాండ్ చేస్తున్నారు టాలీవుడ్ దర్శక నిర్మాతలు. కేవలం ముంబయి భామలనే కాదు.. ఇటు మాలీవుడ్ ఇండస్ట్రీ ముద్దుగుమ్మలకు రెడ్ కార్పెట్ పరుస్తూనే ఉంటారు. ఇదిగో ఈ ఫోటోలోని చిన్నారి కూడా హీరోయిన్‌గా త్వరలో టీటౌన్‌లోకి ఎంటర్ అవ్వబోతుంది. ఎప్పుడో తెలుగు ప్రేక్షకులను పలకరించి.. వెనుదిగింది.

దాదాపు దశాబ్ద కాలం తర్వాత టాలీవుడ్ ఇండస్ట్రీలో తన అదృష్టాన్ని పరిక్షీంచుకునేందుకు వస్తుంది ఈ మలయాళ కుట్టీ. తన డబ్బింగ్ సినిమాలతో ఇటీవల తెలుగు ప్రేక్షకుల పలకరించిన ఈ అమ్మడు.. ఇప్పుడు నేరుగా అలరించేందుకు సిద్ధమైంది. ఇంతకు ఈ స్టైలిష్ ఫోజులు కొడుతున్న ఈ చిన్నారి.. ఇప్పుడు మాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్. ఉమెన్ సెంట్రిక్ మూవీస్ కేరాఫ్ అడ్రస్ అయ్యింది. ఇంతకు ఆమె ఎవరంటే.. దర్శన రాజేంద్రన్. 2014లో మలయాళ మూవీతో నటన రంగంలోకి అడుగుపెట్టిన చిన్నది.. 2015లో బైలింగ్వల్ మూవీ మూడు ముక్కల్లో చెప్పాలంటే.. మూవీతో ఇక్కడ తెరంగేట్రం చేసింది. అందులో సపోర్టింగ్ పాత్రలో మెరిసింది. ఆ మూవీ అంతగా ఆకట్టుకోకపోవడంతో తిరిగి మలయాళ ఇండస్ట్రీకి వెళ్లిపోయింది. తమిళ్, మలయాళ సినిమాలు చేస్తూ.. బిజీగా మారిపోయింది.

సపోర్టింగ్ రోల్స్ చేస్తూ మెయిన్ లీడ్ అయ్యింది. ఆమెను తెలుగు ప్రేక్షకులకు చేరవేసిన మూవీ హృదయం. మలయాళంలో ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన సంగతి విదితమే. ఈ సినిమా తెలుగు ప్రేక్షకులు ఓటీటీలో చూసి విపరీతంగా ఆదరించారు. ఇందులో దర్శన సాంగ్‌కు ఫిదా కానీ వారుండరు. ఆ పాటతోనే పాపులారిటీ తెచ్చుకుంది. ఆ తర్వాత జయ జయ జయ జయ హే అనే డబ్బింగ్ చిత్రంలో కూడా మెప్పించింది. చేయి చేసుకునే భర్తపై రివేంజ్ తీర్చుకునే భార్యగా ఆకట్టుకుంది. అలాగే పురుష ప్రేతమ్ వంటి చిత్రాల్లో నటించింది. ప్యారడైజ్ అనే మూవీ చేసింది. ఇప్పుడు సుమారు దశాబ్ద కాలం తర్వాత మరోసారి తెలుగు ప్రేక్షకులను పలకరించబోతుంది. అనుపమ పరమేశ్వరన్, దర్శన, సంగీత ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న మూవీ పరదా. ఇటీవల దీని మోషన్ పోస్టర్ రిలీజ్ చేసిన సంగతి విదితమే. ఈ మూవీకి ప్రవీణ్ కండ్రేగుల దర్శకుడు. విజయ్ దేవరకొండ ఈ మూవీ నిర్మాతల్లో ఒకరు. ఇకపై అయినా తెలుగు ఇండస్ట్రీలో కొనసాగుతుందేమో చూడాలి.

Jojobet Girişen çok kazandiran casino sitelerigrandpashabet linkHoliganbetHoliganbetHoliganbetHoliganbetjojobetjojobetJojobetJojobetMadridbetMadridbetjojobetJojobetjojobetgoldenbahiscasibomcasibomberlinbetcasibomcasibomcasibom girişholiganbetjojobetjojobetcasibomJojobetbetciojojobetjojobet girişjojobet girişcasibomcasibombetistbetcio