iDreamPost
android-app
ios-app

కొత్త మూవీతో వచ్చేస్తున్న హనీరోజ్.. ఈసారి మరింత బోల్డ్​గా..!

  • Author singhj Published - 10:04 PM, Fri - 14 July 23
  • Author singhj Published - 10:04 PM, Fri - 14 July 23
కొత్త మూవీతో వచ్చేస్తున్న హనీరోజ్.. ఈసారి మరింత బోల్డ్​గా..!

తెలుగు ప్రేక్షకులు కొత్త టాలెంట్​ను ఆదరించడంలో ఎప్పుడూ ముందుంటారు. ప్రతిభ కలిగిన వాళ్లు ఏ భాషకు చెందినవారనేది అంతగా పట్టించుకోరు. అందుకే పరభాషా నటులు, టెక్నీషియన్స్ ఇక్కడి సినిమాల్లో పనిచేసేందుకు ఎంతో ఆసక్తి చూపిస్తుంటారు. ఇక్కడి ప్రేక్షకులు చూపించే ఆదరణ, భారీ రెమ్యూనరేషన్స్ లాంటివి కూడా దీనికి కారణాలుగా చెప్పొచ్చు. అలా వచ్చిన వారిలో అద్భుతమైన టాలెంట్​తో ప్రేక్షకుల మనసుల్లో చెరగని స్థానం సంపాదించిన వాళ్లూ ఉన్నారు. సౌత్​తో పాటు నార్త్​కు చెందిన ఎందరో యాక్టర్స్, టెక్నీషియన్స్ ఇక్కడి సినిమాల్లో పనిచేసేందుకు ఆసక్తి చూపిస్తుంటారు.

ఇటీవల కాలంలో చూసుకుంటే.. మలయాళ చిత్ర పరిశ్రమకు చెందిన చాలా మంది హీరోయిన్లు, హీరోలు తెలుగులో నటించేందుకు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అలా వచ్చిన వారిలో హీరోయిన్ హనీరోజ్ ఒకరు. నందమూరి నటసింహం బాలకృష్ణ సరసన నటించిన ‘వీరసింహారెడ్డి’ మూవీతో హనీరోజ్ పేరు తెలుగునాట మార్మోగిపోయింది. యాక్టింగ్​తో పాటు తన గ్లామర్​తోనూ యూత్ ఆడియెన్స్​ హృదయాలను ఆమె గెలుచుకున్నారు. సోషల్ మీడియాలో హనీరోజ్​ పేరు చాలా వైరల్ అయింది. అయితే టాలెంట్, అందం ఉన్నా.. ‘వీరసింహారెడ్డి’ రూపంలో సక్సెస్ ఉన్నా ఆమెకు పెద్దగా అవకాశాలు రాలేదు.

హనీరోజ్ తర్వాతి సినిమా ఏంటనేది అందరిలోనూ ఆసక్తిని కలిగించింది. కానీ ఆమె మాత్రం షాపింగ్ మాల్స్ ప్రారంభోత్సవాల్లో తప్ప ఎక్కడా కనిపించేవారు కాదు. నెక్స్ట్ మూవీపై ఏ అప్​డేట్ కూడా ఇవ్వలేదు. దీంతో ఆమె పనైపోయిందని అంతా భావించారు. కానీ హనీరోజ్ తన ఫ్యాన్స్​కు సాలిడ్ అప్​డేట్ ఇచ్చారు. ‘రాచెల్’ అనే మూవీలో ఒక ప్రధాన పాత్రను పోషిస్తున్నట్లు ఆమె తెలిపారు. పాన్ ఇండియా రేంజ్​లో భారీగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో హనీ లుక్​ను తాజాగా రిలీజ్ చేశారు. ఇందులో ఆమె కత్తి పట్టుకొని భయపెడుతున్నారు. ఈ మూవీతో ఆనందిని బాల డైరెక్టర్​గా పరిచయం అవుతున్నారు. ఫస్ట్ లుక్​తోనే ఈ చిత్రంపై అంచనాలు పెరిగిపోతున్నాయి. సినిమా ఎలా ఉంటుందో చూడాలి. మరి.. ‘రాచెల్​’లో హనీరోజ్ లుక్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by Honey Rose (@honeyroseinsta)

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetCasinolevantHoliganbetHoliganbetHoliganbetjojobetnakitbahisbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Girişbigboss