iDreamPost
android-app
ios-app

‘హాయ్ నాన్న’ ఓడియమ్మ మేకింగ్ వీడియో.. విక్రమ్ కుమారుడు అదరగొట్టేశాడుగా..!

ఈ డిసెంబర్ లో సందడి చేయబోతున్న మోస్ట్ లవబుల్ మూవీ హాయ్ నాన్న. ఫాదర్ అండ్ డాటర్ రిలేషన్ నేపథ్యంలో తెరకెక్కింది. ఇది నానికి 30వ సినిమా. ఈ చిత్ర ట్రైలర్ విడుదలై మంచి మార్కులు కొట్టేసింది. ఇప్పుడు ఓ మేకింగ్ వీడియోను విడుదల చేసింది చిత్ర బృందం..

ఈ డిసెంబర్ లో సందడి చేయబోతున్న మోస్ట్ లవబుల్ మూవీ హాయ్ నాన్న. ఫాదర్ అండ్ డాటర్ రిలేషన్ నేపథ్యంలో తెరకెక్కింది. ఇది నానికి 30వ సినిమా. ఈ చిత్ర ట్రైలర్ విడుదలై మంచి మార్కులు కొట్టేసింది. ఇప్పుడు ఓ మేకింగ్ వీడియోను విడుదల చేసింది చిత్ర బృందం..

‘హాయ్ నాన్న’ ఓడియమ్మ మేకింగ్ వీడియో.. విక్రమ్ కుమారుడు అదరగొట్టేశాడుగా..!

నాచురల్ స్టార్ నాని నటిస్తున్న చిత్రం హాయ్ నాన్న. సరికొత్త కథాంశంతో తెరకెక్కుతున్న ఈ మూవీలో నాని చాలా స్టైలిష్‌గా కనిపిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ ట్రైలర్ మెప్పించింది. లవ్, ఫ్యామిలీ సెంటిమెంట్ ముఖ్యంగా తండ్రి, కూతుర్ల మధ్య బాండింగ్ ఎక్ట్రార్డినరీ. డిసెంబర్ 7న ఈ మూవీ విడుదల కాబోతుంది. కొత్త డైరెక్టర్ శౌర్యువ్ హ్యాండిల్ చేస్తున్నాడు. సీతారామంతో తెలుగు హృదయాలను కొల్లగొట్టిన సీత అలియాస్ మృణాల్ ఠాకూర్ హీరోయిన్ నటిస్తోంది. శృతిహాసన్ కీ రోల్ ప్లే చేస్తున్నట్లు ట్రైలర్‌ను బట్టి తెలుస్తోంది. బేబీ కైరా నాని కూతురిగా నటిస్తోంది. వైరా ఎంటర్ టైన్ మెంట్‌పై మోహన్ చెరుకూరి, డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల నిర్మిస్తున్నారు. ఇది నానికి 30వ చిత్రం. ఈ చిత్రం విడుదల సందర్భంగా నాని ఫుల్ ప్రమోషన్లలో పాల్గొంటున్నారు.

ఇప్పటికే ఈ మూవీలోని సమయమా సాంగ్ ఎంతో ఫేమస్ అయ్యింది. ఖుషీతో మనస్సుకు హత్తుకునే పాటలు ఇచ్చిన మలయాళ మ్యూజిక్ డైరెక్టర్ హేషమ్ అబ్దుల్.. ఈ చిత్రానికి కూడా సంగీతం అందిస్తున్నారు. అమ్మాడీ, గాజు బొమ్మ కూడా చాలా మంచి రెస్పాన్స్ వచ్చాయి. ఇప్పుడు ఓ మరో స్పెషల్ సాంగ్‌కు సంబంధించిన మేకింగ్ వీడియో విడుదల చేసింది చిత్ర యూనిట్. ఇది నాని, శృతిహాసన్ పై తెరకెక్కించిన పార్టీ సాంగ్. ఓడియమ్మ అంటూ సాగిపోయే సాంగ్.. ఇద్దరు డ్యాన్స్ ఇరగదీసినట్లు కనిపిస్తుంది. దీనికి బాస్కో కొరియగ్రఫీ అందిస్తున్నారు. హిప్ హాప్ స్టెప్పులతో  బీచ్ పార్టీ సాంగ్‌గా తెరకెక్కుతోంది. చాలా కలర్ ఫుల్‌గా కనిపిస్తోంది. అయితే ఈ పాటను ప్రముఖ హీరో కుమారుడు పాటడం విశేషం. అతడు కూడా నటుడే.

కోలీవుడ్ టాప్ హీరో చియాన్ విక్రమ్ కుమారుడు.. నటుడు ధృవ్, శృతి హాసన్ కలిసి ఈ పాటను పాడారు. ఈ మేకింగ్ వీడియోలో మనకు ధృవ్ కూడా కనిపిస్తారు. ఓడియమ్మ హీటూ అంటూ ధృవ్ పాడుతుంటే.. ఏదో తెలియని మ్యాజిక్ ఆ సాంగ్‌కు వచ్చినట్లు అనిపిస్తోంది. ఈ పాటపై మరింత అంచనాలు పెంచేసింది. అతడిలో మంచి సింగర్ కూడా ఉన్నాడు. గతంలో కూడా అతడు పలు ర్యాప్ సాంగ్స్ ఆలపించాడు. ధృవ్ తెలుగులో హిట్ అయిన అర్జున్ రెడ్డి రీమేక్ చిత్రంలో కనిపించాడు. అయితే అక్కడ అంత పెద్ద హిట్ కాలేదు. ప్రస్తుతం ఓడియమ్మ సాంగ్ యూట్యూబ్‌ను షేక్ చేసేస్తుంది. ఈ పాట, ఇతర విశేషాల గురించి నాని, శృతిహాసన్ వెల్లడించారు. మరీ ఈ పాట, మూవీ ఏ మేరకు ఆకట్టుకుంటుందో వేచి చూడాలి.

Jojobet Girişmeritbet girişcasibomcasino siteleriDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetCasibomCasibomGrandpashabetcasibomgrandpashabetmeritbet girişgrandpashabetjojobet girişcasibom girişgrandpashabetgrandpashabet girişgrandpashabetjojobet giriş