iDreamPost
android-app
ios-app

నా సినిమా కొనడానికి ఎవరూ ముందుకు రాలేదు. సిద్ధార్థ్‌ ఎమోషనల్‌!

  • Published Oct 03, 2023 | 4:35 PM Updated Updated Oct 03, 2023 | 4:35 PM
  • Published Oct 03, 2023 | 4:35 PMUpdated Oct 03, 2023 | 4:35 PM
నా సినిమా కొనడానికి ఎవరూ ముందుకు రాలేదు. సిద్ధార్థ్‌ ఎమోషనల్‌!

తెలుగు ఇండస్ట్రీలో హీరో సిద్దార్థ అంటె తెలియని వారు ఉండరు. బాయ్స్ మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన సిద్దార్థ తర్వాత బాలీవుడ్, కోలీవుడ్ లో వరుసగా నటించారు. ఇక తెలుగు లో సిద్దార్థ నటించిన నువ్వొస్తానంటే నేనొద్దంటానా, బొమ్మరిల్లు, కొంచెం ఇష్టం కొంచెం కష్టం లాంటి చిత్రాల్లో నటించి లవర్ బాయ్ గా ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు. గత కొంత కాలంగా సిద్దార్థ్ నటించిన చిత్రాలు వరుస ఫ్లాప్ కావడంతో సతమతమవుతున్నాడు. ఇటీవల నిర్మాణ రంగంలోకి అడుగు పెట్టాడు సిద్దార్ధ్. ఈ మద్య బెంగుళూరులో సిద్దార్థ్ తన మూవీ ప్రమోషన్ సందర్భంగా తీవ్ర అవమానం ఎదుర్కొన్న విషయం తెలిసిందే. తాజాగా మరోసారి స్టేజ్ పై ఎమోషన్ అయ్యాడు సిద్దార్థ్. వివరాల్లోకి వెళితే..

ఒకప్పుడు తెలుగు లో లవర్ బాయ్ గా మంచి క్రేజ్ తో తిరుగులేని ఫాలోయింగ్ సంపాదించాడు సిద్దార్థ్. తర్వాత కొన్ని మాస్ చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.. కానీ అవి పెద్దగా సక్సెస్ సాధించలేదు. దీంతో కోలీవుడ్ పై ఎక్కువగా ఫోకస్ పెట్టాడు. ప్రస్తుతం సిద్దార్థ్ హీరోగా స్వియ నిర్మాణంలో ‘చిత్తా’ మూవీలో నటిస్తున్నాడు. ఈ చిత్రం తెలుగు లో చిన్నాగా రిలీజ్ కాబోతుంది. వాస్తవానికి ఈ మూవీ గత వారమే రిలీజ్ కావాల్సి ఉన్నా.. తెలుగులో ఎవరూ బయ్యర్లు ముందుకు రాలేదట. అంతేకాదు సిద్దార్థను తెరపై ఇంకా ఎవరు చూస్తారు అంటూ అవమానకరంగా మాట్లాడినట్లు ఆవేదన వ్యక్తం చేశాడు సిద్దార్థ్.

ఈ మూవీ ప్రీరిలీజ్ ఫంక్షన్ లో మాట్లాడుతూ.. ‘హీరోగా నేను ప్రేక్షకులకు మంచి వినోదం పంచడానికి ఎంతో ఎఫర్ట్ పెడతాను. నా సినిమా తమిళంలో ఉదయనిధి స్టాలిన్ కొన్నాడు, కన్నడలో కేజీఎఫ్ మేకర్లు తీసుకున్నారు., కేరళలో ఓ నెంబర్ వన్ డిస్ట్రిబ్యూషన్ సంస్థ తీసుకుంది.. కానీ తెలుగు లో మాత్రం బయ్యర్లు దొరకలేదు. అందుకే ప్రేక్షకుల ముందుకు ఆలస్యంగా వస్తున్నా. ఇలాంటి కష్టసమయంలో ఏసీయన్ సునీల్, జాన్వీ నారంగ్ నన్ను.. నా చిత్రాన్ని నమ్మారు. వారికి చాలా రుణపడి ఉన్నాను. నా సినిమా బాగాలేదు, నచ్చలేదు అని చెబితే మళ్లీ ఇటు రాను.. ప్రెస్ మీట్స్ పెట్టను’ అంటూ ఎమోషన్ అయి కన్నీరు పెట్టుకున్నారు. ఈ మూవీలో సిద్దార్థ్, నిమిషా సజయాన్‌ల నటన హైలెట్ గా ఉండబోతుందని టాక్ వినిపిస్తుంది.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetJojobetJojobetMadridbetMadridbetMadridbetjojobetcratosroyalbetbetgarantigrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomHoliganbetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom