iDreamPost
android-app
ios-app

ధనుష్ రాయన్ మూవీకి సెన్సార్ కష్టాలు! ఆ సీన్స్ అన్నీ లేపేశారట!

  • Published Jul 10, 2024 | 12:54 PM Updated Updated Jul 10, 2024 | 12:54 PM

Dhanush Raayan Movie: తమిళ స్టార్ హీరో ధనుష్.. గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఇటీవలే సార్ మూవీతో సూపర్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక తాజాగా మరోసారి రాయన్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.

Dhanush Raayan Movie: తమిళ స్టార్ హీరో ధనుష్.. గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఇటీవలే సార్ మూవీతో సూపర్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక తాజాగా మరోసారి రాయన్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.

  • Published Jul 10, 2024 | 12:54 PMUpdated Jul 10, 2024 | 12:54 PM
ధనుష్ రాయన్ మూవీకి సెన్సార్  కష్టాలు! ఆ సీన్స్ అన్నీ లేపేశారట!

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తనదైన నటనతో సౌత్ ఇండియాలో తనకంటూ ప్రత్యేకంగా ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకున్నాడు. అలానే విలక్షణ నటుడిగా గుర్తింపు సంపాందించారు. ఇటీవలే సార్ మూవీతో సూపర్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక తాజాగా మరోసారి రాయన్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఇది ధనుష్ 50 సినిమా కావడం విశేషం. ఈ సినిమాకు సంబంధించిన సెన్సార్ పూర్తైనట్లు తెలుస్తోంది. మరి.. సెన్సార్ బోర్డు రాయన్ మూవీకి ఏ సర్టిఫికేట్ ఇచ్చింది. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం…

తమిళ స్టార్ హీరో ధనుష్.. ఇటీవల సినిమా కథలను ఎంచుకున్నే విధానం ప్రతీ ఒక్కరిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. నేటివిటికి దగ్గరగా ఉండి, తన పాత్రకు ప్రాధాన్యత ఉంటేనే మూవీస్ ను మాత్రం ధనుష్ ఒకే చేస్తున్నాడు. అసురున్, వాడా చెన్నయ్, కెప్టెన్ మిల్లర్, కర్ణన్  వంటి సినిమాలు ఆ కోవలో నుంచి వచ్చినవే. వేటికవే భిన్నమైన కథ, సహజత్వమైన కథనం ఉండే చిత్రాలు. ఇలా విభిన్నమైన సినిమాలతో ధనుష్ వరుస హిట్లు కొడుతున్నాడు. తాజాగా తన సినీ కెరీర్ లో 50 సినిమా చేస్తున్నాడు. ఆయన స్వయంగా నటిస్తూ.. దర్శకత్వం వహించిన ఆ చిత్రమే రాయన్.

ఇటీవలే రిలీజైన ఫస్ట్ లుక్ గ్లిమ్స్ కు ప్రేక్షకుల ను మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సారి మారో కొత్త కాన్సెప్ట్ తో వవస్తున్నట్లు ఆ గ్లిమ్స్ ను చూస్తే తెలుస్తోంది.  ఈ మూవీ నుంచి వచ్చిన మొదటి సింగిల్.. రాయన్ పై హైప్ మరింత పెంచింది. ప్రస్తుతం షూటింగ్ కంప్లీట్ చేసుకుని ఈ సినిమా రిలీజ్ కి సిద్ధంగా ఉంది. చిన్న చిన్న కట్స్ తో సెన్సార్ బోర్డు రాయన్  సినిమాకు‘ ఏ’ సర్టిఫికెట్ జారీ చేసినట్లు తెలుస్తోంది. రక్తపాతం, హింస పాళ్లు కొద్దిగా ఎక్కువగా ఉండడంతో ‘ఏ’ జారీ చేశారు. మొత్తంగా రాయన్ సినిమాకు పెద్దలకు మాత్రమే ఎంట్రీ ఉంటుందని, 18 ఏళ్ల లోపు వారికి రాయన్ సినిమాకు అనుమతి లేదు. పాన్ ఇండియా మూవీగా ప్రపంచ వ్యాప్తంగా ఈనెల 26న రాయన్ మూవీ విడుదల కానుంది.

ఈ చిత్రంలో సందీప్ కిషన్, కాళిదాస్ జయరామ్, అపర్ణ బాలమురుగన్, ఎస్‌జే సూర్య, సెల్వరాఘవన్, దుషారా తదితరులు నటించారు. ఇటీవల రిలీజైన ప్రమోషనల్ కంటెంట్‌కు భారీ క్రేజ్ లభించింది. దాంతో ఆయన అభిమానులు ఆసక్తిగా ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. సన్ పిక్చర్స్ ఈ భారీ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందించారు. మరోవైపు ధనుష్ ప్రస్తుతం శేఖర్ కమ్ముల దర్శకత్వంలో కుబేరుడు అనే మూవీని నేరుగా తెలుగు చేస్తున్నాడు.  మొత్తంగా రాయన్ మూవీ కోసం సినీ ప్రియులు  ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetHoliganbetjojobet güncel girişcratosroyalbetganobetcasibomiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom