Nagendra Kumar
Hanuman Movie: సంక్రాంతి బరిలో పోటాపోటీగా విడుదలైన చిత్రాలలో ఇప్పుడు ముందుంది "హనుమాన్". ఇప్పుడు ఎవరి నోటా చూసినా ఒకటే మాట. అందరి దృష్టి హనుమాన్ దర్శకుడు ప్రశాంత్ వర్మ మీదే. అసలు సంక్రాంతి సమయంలో పెద్ద హీరోల మధ్యన.. హనుమాన్ విడుదల చేయడం సాహసం అనుకుంటే.. ఇప్పుడు అందరిని ఓడించి హిట్ కొట్టింది హనుమాన్.
Hanuman Movie: సంక్రాంతి బరిలో పోటాపోటీగా విడుదలైన చిత్రాలలో ఇప్పుడు ముందుంది "హనుమాన్". ఇప్పుడు ఎవరి నోటా చూసినా ఒకటే మాట. అందరి దృష్టి హనుమాన్ దర్శకుడు ప్రశాంత్ వర్మ మీదే. అసలు సంక్రాంతి సమయంలో పెద్ద హీరోల మధ్యన.. హనుమాన్ విడుదల చేయడం సాహసం అనుకుంటే.. ఇప్పుడు అందరిని ఓడించి హిట్ కొట్టింది హనుమాన్.
Nagendra Kumar
ముందసలు రిలీజే కష్టమన్నారు. అయినా నిర్మాత నిరంజన్ రెడ్డి పట్టు వదలని విక్రమార్కుడిలా విసిగిపోకుండా నిలబడ్డారు. తర్వాత ధియేటర్లు దొరకవన్నారు. అయినా నిరంజన్ రెడ్డి పట్టు వదల్లేదు. ఎన్ని ధియేటర్లు విడుదలైతే అన్నిట్లోనే రిలీజ్ అనుకున్నారు. కానీ 12 న రిలీజు ఆపుకోలేదు. ఏ బెదిరింపులకీ బెదరలేదు. సడలలేదు. ఎదురుగా ఎంత పెద్ద హీరోల సినిమాలు పడుతున్నా ఖాతరుచేయలేదు. మొక్కవోని విశ్వాసంతో హనుమాన్ చిత్రాన్ని విడుదలకు ముస్తాబు చేసి.. ముందుకు వచ్చి మహాసంగ్రామంతో తలపడ్డారు నిరంజన్ రెడ్డి.
12న హనుమాన్ రిలీజ్. అదే రోజు ప్రిన్స్ మహేష్ గుంటూరు కారం రిలీజ్. కాంబినేషన్, బ్యానర్ చూస్తే మామూలు యవ్వారం కాదు. త్రివిక్రమ్, మహేష్, నాగవంశీ కాంబినేషన్లో ముక్కుపుటాలు అదిరిపోయే ఘాటుతో గుంటూరు కారం మీదన పడింది. ముందు రోజే అంటే 11వ తేదీనాడే వరల్డ్ ఓవర్ ప్రీమియర్స్ తో హనుమాన్ మోతెక్కించేసింది. టాక్ దద్దరిల్లిపోయింది. పక్కనే పడ్డ గుంటూరు కారం యావరేజ్ టాక్ కూడా సొంతం చేసుకోలేకపోయింది. హనుమాన్ సంచలనం ప్రపంచాన్ని ఊపేసింది. తర్వాత వచ్చిన సైంధవ్ పండగ సినిమా కాదు అని తేల్చేశారు. పరవాలేదు, చూడొచ్చు అనే టాక్ తో సరిపెట్టుకుంది సైంధవ్. ఈ క్రమంలో రిలీజ్ అయిన నా సామిరంగా పండగ వాతావరణాన్ని ప్రతిబింబిస్తూ, సందడిగా ఉండడం, హుషారుగా సాగడంతో .. నాగార్జున కొత్తగా కనిపించడం వంటి ప్లస్ పాయంట్స్ తో నా సామిరంగా హిట్ పరిధిలోకి వచ్చేసింది.
ఇవన్ని ఇలా ఉండగా, హనుమాన్ వీరవిహారం యుఎస్ నుంచి నార్త్ బెల్ట్ మొత్తం కుమ్మేసింది. యుఎస్ వసూళ్ళతోనే సినిమా మేకింగ్ బడ్జెట్ రికవర్ అయపోతుందన్నారు ట్రేడ్ పండిట్స్. రిలీజ్ నాడే నిరంజన్ రెడ్డి తన టీంతో సహా ఎఫ్ ఎన్ సిసి దైవ సన్నిధానంలో మీడియా మీట్ నిర్వహించి, హనుమాన్ చిత్రాన్ని ఆదరిస్తున్నందుకు అందరికీ థాంక్స్ గివింగ్ కార్యక్రమాన్ని పూర్తి చేశారు. ఇప్పుడు మాట్లాడుతుంటే అసలు హనుమాన్ విశ్వరూపం ప్రపంచమంతా కనిపించేలా పరుచుకుంది.
ఇక దర్శకుడు ప్రశాంత్ వర్మ స్కిల్ ఆఫ్ మేకింగ్ ది ఫిల్మ్ ని మెచ్చుకోనివారు లేరు. నిర్మాత నిరంజన్ రెడ్డి గట్స్ ని కొనియాడని వారు లేనే లేరు. దానికి ముందే ఓ సీనియర్ నిర్మాత హనుమాన్ జోస్యం చెప్పేశారు, 500కోట్లు కలెక్ట్ చేస్తుంది హనుమాన్ అని. దానికి మొదలేనేమో హనుమాన్ వంద కోట్ల క్లబ్ లో ప్లేస్ సాధించేసింది. తరం మారిపోతోంది అంటే నమ్మాలి అనే స్థితి వచ్చేసింది. రెగ్యులర్ సినిమాలు ఇక చూడరు, ఏదో ఒక మ్యాజిక్ లేకపోతే అన్నది తేటతెల్లమైపోయింది. బాలీవుడ్ ఇండస్ట్రీ అయితే ఏకంగా 2024 సంవత్సరానికి హనుమానే పెద్ద హిట్ అని క్లియర్ కట్ గా చెబుతోంది. జై హనుమాన్. గట్స్ ఉన్నవాళ్ళకే హిట్స్ అన్నది మరోసారి నిరూపణ అయింది.