iDreamPost
android-app
ios-app

జై హనుమాన్ నుంచి క్రేజి అప్డేట్..

  • Published May 13, 2025 | 12:05 PM Updated Updated May 13, 2025 | 12:05 PM

హనుమాన్ మూవీ ఇండస్ట్రీలో ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో తెలియనిది కాదు. ఇక ఆ తర్వాత ఈ మూవీ సిక్వెల్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని అంతా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పుడు ఈ సిక్వెల్ పై ఓ క్రేజి అప్డేట్ వచ్చింది. దానికి సంబంధించిన విషయాలు చూసేద్దాం.

హనుమాన్ మూవీ ఇండస్ట్రీలో ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో తెలియనిది కాదు. ఇక ఆ తర్వాత ఈ మూవీ సిక్వెల్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని అంతా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పుడు ఈ సిక్వెల్ పై ఓ క్రేజి అప్డేట్ వచ్చింది. దానికి సంబంధించిన విషయాలు చూసేద్దాం.

  • Published May 13, 2025 | 12:05 PMUpdated May 13, 2025 | 12:05 PM
జై హనుమాన్ నుంచి క్రేజి అప్డేట్..

టాలీవుడ్ లో ఇప్పుడు టాలెంటెడ్ దర్శకులు చాలా మంది ఉన్నారు. వారిలో ప్రశాంత్ వర్మ కూడా ఒకరు. హనుమాన్ తర్వాత ప్రశాంత్ వర్మ సినిమాలకు డిమాండ్ బాగా పెరిగిపోతుందని చెప్పి తీరాలి. ఎందుకంటే హనుమాన్ క్రియేట్ చేసిన సెన్సేషన్ అలాంటిది. తెలుగు ఆడియన్స్ తో పాటు పాన్ ఇండియా లెవెల్ లో అంతా ఈ సినిమాకు ఫిదా అయ్యారని చెప్పి తీరాల్సిందే. పెద్ద సినిమాలకు పోటీగా వచ్చిన హనుమాన్ ఇండస్ట్రీ రికార్డ్స్ ను తుడిచిపెట్టేసింది. ఇక ఆ తర్వాత అంతా కూడా ఈ సినిమా సిక్వెల్ జై హనుమాన్ గురించి ఎదురుచూస్తున్న మాట వాస్తవం. ఈసారి ఎలాంటి కంటెంట్ ఉండబోతుంది.. ఎలాంటి సర్ప్రైజ్ ఉండబోతుందా అని చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.

అయితే జై హనుమాన్ మూవీ నుంచి రీసెంట్ గా ఓ ఇంట్రెస్ట్ బజ్ వినిపిస్తుంది. ఈ సినిమాలో హనుమాన్ క్యారెక్టర్ లో కన్నడ హీరో.. రిషబ్ శెట్టి హనుమాన్ గా చేస్తున్నట్లు భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ సినిమాకు టాలీవుడ్ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు ఈ మూవీ కోసం బాలీవుడ్ బిగ్ ప్రొడ్యూసర్ భూషణ్ కుమార్ వచ్చాడట. ప్రపంచ వ్యాప్తంగా భూషణ్ కుమార్ సమర్పణలో ఈ మూవీ విడుదల కానున్నట్లు కన్ఫర్మ్ చేశారు. దీనికి సంబంధించిన అఫీషియల్ అప్డేట్ ను త్వరలోనే అనౌన్స్ చేయనున్నారు మేకర్స్ . సో మొత్తానికి హనుమాన్ కంటే ఎక్కువగానే జై హనుమాన్ రీసౌండ్ గట్టిగ వినిపించబోతున్నట్లు అర్ధమౌతుంది. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.