iDreamPost
android-app
ios-app

జై హనుమాన్ మూవీ ఏమైంది! ఎంత వరకు వచ్చింది?

  • Published Sep 12, 2024 | 5:13 PM Updated Updated Sep 12, 2024 | 5:13 PM

Jai Hanuman Movie Update: ఈ సంవత్సరం సంక్రాంతికి చిన్న సినిమాగా వచ్చి.. బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ ను బ్రేక్ చేసిన సినిమా హనుమాన్ . ఈ సినిమాతో ప్రశాంత్ వర్మ క్రేజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. దీనితో ఇప్పుడు అభిమానులు జై హనుమాన్ మూవీ కోసం ఎదురుచూస్తున్నారు. మరి జై హనుమాన్ మూవీ ఎంతవరకు వచ్చింది .. ఆ వివరాలు చూసేద్దాం.

Jai Hanuman Movie Update: ఈ సంవత్సరం సంక్రాంతికి చిన్న సినిమాగా వచ్చి.. బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ ను బ్రేక్ చేసిన సినిమా హనుమాన్ . ఈ సినిమాతో ప్రశాంత్ వర్మ క్రేజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. దీనితో ఇప్పుడు అభిమానులు జై హనుమాన్ మూవీ కోసం ఎదురుచూస్తున్నారు. మరి జై హనుమాన్ మూవీ ఎంతవరకు వచ్చింది .. ఆ వివరాలు చూసేద్దాం.

  • Published Sep 12, 2024 | 5:13 PMUpdated Sep 12, 2024 | 5:13 PM
జై హనుమాన్ మూవీ ఏమైంది! ఎంత వరకు వచ్చింది?

ప్రశాంత్ వర్మ.. ఇప్పుడు ఈ దర్శకుడు పేరు తెలియని వారు ఎవరు ఉండరు. 2024 సంక్రాంతికి రిలీజ్ అయినా హనుమాన్ సినిమాతో ఒక్కసారిగా ప్రశాంత్ వర్మ క్రేజ్ పెరిగిపోయింది. కథలో కంటెంట్ ఉంటే కనుక క్యాస్టింగ్ , బడ్జెట్ తో సంభందం లేదని ఈ సినిమా ప్రూవ్ చేసింది. స్టార్ హీరోల సినిమాలకు పోటీగా నిలిచిన హనుమాన్ మూవీ ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక హనుమాన్ మూవీకి జై హనుమాన్ సిక్వెల్ ను అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. దీనితో అభిమానులంతా ఈ మూవీ అప్ డేట్ ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తున్నారు. ఈలోపే తాజాగా బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ డెబ్యూ కూడా ప్రశాంత్ డైరెక్షన్ లోనే జరగనుందని కన్ఫర్మ్ అయింది. దీనితో ప్రేక్షకులకు మరి జై హనుమాన్ పరిస్థితి ఏంటి ? అసలు ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ నుంచి మొత్తం ఎన్ని సినిమాలు ఉన్నాయనే విషయాలను చూసేద్దాం.

ప్రస్తుతం ప్రశాంత్ వర్మ కోసం చాలా మంది స్టార్ హీరోలు క్యూ లో నిలబడ్డారు. మోక్షజ్ఞ ను వెండి తెరపై పరిచయం చేయడం ప్రస్తుతం ప్రశాంత్ వర్మ చేతిలో ఉన్న పెద్ద బాధ్యత. రీసెంట్ గా ఈ సినిమా గురించి అనౌన్సమెంట్ రావడంతో జై హనుమాన్ సినిమా మీద సందేహాలు మొదలయ్యాయి. నిజానికి హనుమాన్ మూవీ తర్వాత ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ నుంచి రావాల్సింది జై హనుమాన్ సినిమానే.. జనవరి 2025 అంటూ రిలీజ్ డేట్ కూడా ప్రకటించారు. ప్రస్తుతం ఈ మూవీ స్క్రిప్ట్ వర్క్ కూడా జరుగుతుంది. ఈ మూవీ కోసం చాలా పెద్ద టీమ్ కష్టపడుతున్నట్లు సమాచారం. అయితే జై హనుమాన్ సినిమా కంటే ముందు ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ నుంచి.. అధీరా రానుంది. ఈ సినిమాతో డివివి దానయ్య కుమారుడు కళ్యాణ్ దాసరి హీరోగా పరిచయం అవుతున్నాడు. అలాగే బాలీవుడ్ లోను ప్రశాంత్ వర్మ ఓ సినిమా చేయబోతున్నాడు. వీటితో పాటు కొత్తగా మోక్షజ్ఞ మూవీ కూడా రానుంది. కాబట్టి జై హనుమాన్ సినిమా కంటే ముందు ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ నుంచి కనీసం మూడు సినిమాలు రానున్నాయి.

ఇక ఈ సినిమాలు కాకుండా ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ నుంచి.. ఇంకా చాలానే ప్రాజెక్ట్స్ రానున్నట్లు సమాచారం. మరి వీటిలో హనుమాన్ రేంజ్ లో ఈసారి ప్రేక్షకులను ఏ సినిమాలు మెప్పిస్తాయో. ఈ సినిమాలు ప్రశాంత్ వర్మ కు ఎలాంటి క్రేజ్ ను తెచ్చిపెడతాయో చూడాలి. చూడబోతుంటే హనుమాన్ తో మొదలైన ఈ దర్శకుడి సక్సెస్ జర్నీ ఇక ఆగేలా లేదనిపిస్తుంది. సో మొత్తానికి జై హనుమాన్ మూవీ అప్ డేట్స్ తెలియాలంటే.. మేకర్స్ నుంచి ఏదైనా అనౌన్సుమెంట్ వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే. మరి ప్రశాంత్ వర్మ మూవీ అప్ డేట్స్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetjojobetcasibom girişCasibomgrandpashabet