iDreamPost
android-app
ios-app

PVCU నుంచి క్రేజీ అప్డేట్.. తొలి లేడీ సూపర్ హీరోని పరిచయం చేశాడు..!

  • Published Oct 10, 2024 | 1:09 PM Updated Updated Oct 10, 2024 | 1:09 PM

PVCU: 'హనుమాన్' మూవీతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన ప్రశాంత్ వర్మ తాజాగా తన యూనివర్స్ నుంచి 'మహాఖాళీ' ప్రాజెక్టుని ప్రకటించాడు.

PVCU: 'హనుమాన్' మూవీతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన ప్రశాంత్ వర్మ తాజాగా తన యూనివర్స్ నుంచి 'మహాఖాళీ' ప్రాజెక్టుని ప్రకటించాడు.

PVCU నుంచి క్రేజీ అప్డేట్.. తొలి లేడీ సూపర్ హీరోని పరిచయం చేశాడు..!

ఇండియన్ సినిమా ఇండస్ట్రీకి చాలా మంది కొత్త డైరెక్టర్లు వస్తున్నారు. అందులో కొంతమంది మాత్రమే సక్సెస్ సాధిస్తున్నారు. అలాంటి డైరెక్టర్లలో ప్రశాంత్ వర్మ ఒకరు. ప్రశాంత్ వర్మ సూపర్ ట్యాలెంటెడ్ డైరెక్టర్ అని చెప్పాలి. ఎందుకంటే ఈయన తీసిన ప్రతీ సినిమా కూడా కొత్తగా ఉంటుంది. అయితే మొదట్లో ఈయన సినిమాలకు పెద్దగా ఆదరణ రాలేదు. కానీ ఒక్క సినిమాతో మాత్రం ఏకంగా పాన్ ఇండియా డైరెక్టరే అయిపోయాడు. ఆ సినిమా ఏదో ఇప్పటికే మీ మైండ్ లో తిరిగుంటుంది. ఎస్ అదే హనుమాన్. ఈ సినిమా ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. పాన్ ఇండియా బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమా ఏకంగా 300 కోట్లకు పైగా వసూళ్ల సునామీ సృష్టించింది. ఈ సినిమాని తక్కువ బడ్జట్ తో చాలా క్వాలిటీగా తీశాడు ప్రశాంత్ వర్మ. ఈ సినిమాతో కొత్తగా ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ ని క్రియేట్ చేసుకున్నాడు. తన యూనివర్స్ లో మొదటి సినిమాతోనే సక్సెస్ అయ్యాడు. అందరి కంట్లో పడ్డాడు. ఇక ప్రశాంత్ వర్మ నుంచి రాబోయే సినిమాలపై అందరికీ ఆసక్తి పెరిగిపోయింది.

తాజాగా ప్రశాంత్ వర్మ తన  PVCU నుండి మరో ప్రాజెక్ట్‌ను ప్రకటించారు. ఆర్‌కెడి స్టూడియోస్‌పై రివాజ్ రమేష్ దుగ్గల్ ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఆర్‌కె దుగ్గల్ ఈ సినిమాని సమర్పిస్తున్నారు. RKD స్టూడియోస్ భారతదేశంలోని ఫేమస్ మోషన్ పిక్చర్ ప్రొడక్షన్, డిస్ట్రిబ్యూషన్ మరియు అక్విజిషన్ కంపెనీ. ఇప్పుడు ఈ సినిమాతో నిర్మాణంలోకి అడుగుపెట్టింది. ఈ సినిమాకి ప్రశాంత్ వర్మ కథ, స్క్రీన్ ప్లేని అందిస్తున్నారు. మహిళా దర్శకురాలు పూజ అపర్ణ కొల్లూరు ఈ సినిమాని డైరెక్ట్ చేస్తోంది. ఇది భారతదేశం నుండి వస్తున్న మొదటి మహిళా సూపర్ హీరో సినిమా కావడం విశేషం. ఈ సినిమాలో ఈ విశ్వంలోనే అత్యంత క్రూరమైన సూపర్ హీరోని చూపించబోతున్నారు. ఈ సినిమా కూడా ప్రేక్షకులకు ఒక కొత్త అనుభూతిని ఇస్తుంది అనడంలో ఏమాత్రం సందేహం లేదట. ఈ సినిమా బెంగాల్ ట్రెడిషనల్ బ్యాక్ డ్రాప్ లో సాగుతుంది. ఈ సినిమాకి “మహాకాళి” అనే టైటిల్‌ను ప్రకటించారు. మ‌హా కాళీ టైటిల్ రివీల్‌తో పాటు ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌ను రిలీజ్ చేశారు.

ఆ పోస్టర్ చూడటానికి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఇందులో ఒక అమ్మాయి తన తలను పులికి సున్నితంగా తాకినట్లు చూపించారు. ఇక బ్యాగ్రౌండ్ లో గుడిసెలు, దుకాణాలు, గుడిని చూడవచ్చు. అలాగే ప్రజలు భయాందోళనకు గురవుతున్నట్లు చూడవచ్చు. అలాగే ఇందులో ఒక ఫెర్రిస్ వీల్ మంటల్లో చూడవచ్చు. బెంగాలీ ఫాంట్‌లో డిజైన్ చేసిన టైటిల్ పోస్టర్ మధ్యలో ఒక డైమండ్ లాంటి ఆకారాన్ని చూపించారు. చూడగానే ఈ పోస్టర్ ఎంతగానో ఆక‌ట్టుకుంటోంది. కచ్చితంగా ఇది విజువల్ వండర్ గా నిలుస్తుందని తెలుస్తుంది. మొత్తం మీద ఈ పోస్టర్ తో ప్రొడక్షన్‌ వాల్యూస్ రిచ్ గా ఉండబోతున్నాయని తెలుస్తుంది. ఇక ఈ సినిమాకి స్మరణ్ సాయి సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ మూవీ IMAX 3Dలో విడుదల కానుంది. భారతీయ భాషలతో పాటు ప్రపంచంలోని చాలా భాషలలో కూడా ఈ సినిమాని విడుద‌ల చేయ‌నున్నారు. చూడాలి ఈ సినిమా ఎలాంటి హిట్ కొడుతుందో.. ఇక PVCU నుండి తాజాగా విడుదల అయిన ఈ మహాకాళి పోస్టర్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.