iDreamPost
android-app
ios-app

మొదటి సినిమాకే మోక్షజ్ఞ భారీ రెమ్యునరేషన్ .. ఎన్ని కోట్లంటే ?

  • Published Sep 18, 2024 | 11:36 AM Updated Updated Sep 18, 2024 | 11:36 AM

Nandamuri Mokshagna: నందమూరి బాలకృష్ణ తనయుడు.. మోక్షజ్ఞ ఎంట్రీ కోసం అభిమానులంతా ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. ఇటీవల ఆ మూవీకి సంబంధించిన అప్ డేట్ కూడా వచ్చేసింది. ఈ క్రమంలో మోక్షజ్ఞ మూవీ గురించి ఓ ఇంట్రెస్టింగ్ అప్ డేట్ వినిపిస్తుంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

Nandamuri Mokshagna: నందమూరి బాలకృష్ణ తనయుడు.. మోక్షజ్ఞ ఎంట్రీ కోసం అభిమానులంతా ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. ఇటీవల ఆ మూవీకి సంబంధించిన అప్ డేట్ కూడా వచ్చేసింది. ఈ క్రమంలో మోక్షజ్ఞ మూవీ గురించి ఓ ఇంట్రెస్టింగ్ అప్ డేట్ వినిపిస్తుంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

  • Published Sep 18, 2024 | 11:36 AMUpdated Sep 18, 2024 | 11:36 AM
మొదటి సినిమాకే మోక్షజ్ఞ భారీ రెమ్యునరేషన్ .. ఎన్ని కోట్లంటే ?

టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ దర్శకత్వంలో.. నందమూరి యంగ్ హీరో ఇండస్ట్రీలో అరంగేట్రం చేస్తున్న సంగతి తెలిసిందే. బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ ఇండస్ట్రీ ఎంట్రీకి సంబంధించి ఎప్పటినుంచో వార్తలు వస్తూనే ఉన్నాయి. ఇటీవల మోక్షజ్ఞ బర్త్ డే సంధర్బంగా.. ప్రశాంత్ వర్మ పోస్ట్ ద్వారా అది కన్ఫర్మ్ అయిపోయింది. హనుమాన్ మూవీతో పాన్ ఇండియా రేంజ్ లో హిట్ కొట్టిన ప్రశాంత్ వర్మ.. ఇప్పుడు మోక్షజ్ఞ వెండి తెర ఎంట్రీ బాధ్యత చేపట్టారు. దీనితో ఇప్పుడు అభిమానులలో ఈ సినిమాపై మరిన్ని అంచనాలు పెరిగిపోయాయి. ఇక ఇప్పుడు ఈ మూవీకి బడ్జెట్ , రెమ్యునిరేషన్ కు సంబంధించి ఇంట్రెస్టింగ్ విషయాలు వినిపిస్తున్నాయి. దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ నుంచి వస్తున్న రెండో మూవీగా.. మోక్షజ్ఞ మూవీ ఉండనుంది. కాబట్టి కచ్చితంగా సినిమా కథ నెక్స్ట్ లెవెల్ లో ఉంటుందని చెప్పి తీరాల్సిందే. ఎలాగూ ప్రశాంత్ వర్మ కథ , దర్శకత్వం విషయంలో ఎక్కడా రాజి పడడు కాబాట్టి.. దాని గురించి ప్రేక్షకులు ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇక ఇప్పుడు మూవీ బడ్జెట్ విషయానికొస్తే.. సుమారు రూ.100 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాను రూపొందించనున్నట్లు సమాచారం. బాలకృష్ణ వారసుడు ఎంట్రీ.. అందులోను ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో రావడంతో..వీరిద్దరిపై నమ్మకంతో … నిర్మాతలు కూడా ఖర్చుకు వెనుకాడడం లేదని ఇన్సైడ్ ఇండస్ట్రీలో టాక్ నడుస్తుంది. అలాగే ఈ సినిమాకు మోక్షజ్ఞ రెమ్యునిరేషన్ కూడా భారీగానే తీసుకుంటున్నాడట. సుమారు రూ.20 కోట్లు ఉంటుందని అంటున్నారు. ఇప్పటివరకు తెలుగులో ఈ స్థాయిలో రెమ్యునిరేషన్ తీసుకుంటున్న హీరో లేరని చెప్పొచ్చు.

ఇలా మొదటి సినిమాతోనే బడ్జెట్ తో పాటు.. రెమ్యునిరేషన్ విషయంలో రికార్డ్ చేస్తున్నాడు మోక్షజ్ఞ. త్వరలోనే ఈ మూవీ షూటింగ్ కూడా ప్రారంభం కానున్నట్లు సమాచారం. అలాగే ఈ మూవీలో నటించే నటీ నటులు , టెక్నీషియన్స్ వివరాలను కూడా మూవీ టీమ్ త్వరలోనే అనౌన్స్ చేయనున్నారు. అసలు ఈ మూవీ కథ ఏమై ఉంటుందా.. మోక్షజ్ఞకు జోడిగా ఎవరెవరు ఉండబోతున్నారా.. అని ఇలా ఇప్పటినుంచే ప్రేక్షకులలో ఈ సినిమాపై ఆసక్తి నెలకొంది. ఇక ఈ మూవీ నుంచి రాబోయే అప్ డేట్స్ ఎలాంటి అంచనాలను క్రియేట్ చేస్తాయో వేచి చూడాలి. ఇక ప్రశాంత్ వర్మ సినిమాల విషయానికొస్తే.. నిజానికి హనుమాన్ మూవీ తర్వాత జై హనుమాన్ సినిమానే రావాల్సి ఉంది. అయితే దానికంటే ముందు బాలీవుడ్ స్టార్ హీరో రణ్ వీర్ తో ఓ మూవీ చేసేందుకు కూడా అతని లిస్ట్ లో ఉంది. అయితే కొన్ని కారణాల వలన ఆ మూవీకి బ్రేక్ పడింది. దీనితో వెంటనే మోక్షజ్ఞ ప్రాజెక్ట్ ను చేపట్టారు ప్రశాంత్ వర్మ. కాబట్టి ఈ సినిమా పూర్తైన తర్వాత మాత్రమే జై హనుమాన్ మూవీ ఉండనుంది. మరి మోక్షజ్ఞ అప్ డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.