iDreamPost
android-app
ios-app

హనుమాన్‌కి తొలి అవార్డ్ అందుకున్న ప్రశాంత్ వర్మ! పోస్ట్ వైరల్!

  • Published Mar 21, 2024 | 2:55 PM Updated Updated Mar 21, 2024 | 2:55 PM

Director Prasanth Varma: హనుమాన్ మూవీతో డైరక్టర్ ప్రశాంత్ వర్మ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచిన జోష్ లో ఉన్నా ప్రశాంత్ వర్మకు మరో రెట్టింపు ఉత్సాహాన్ని చేసేలా అరుదైన ఘనత దక్కింది. ఇంతకి అదే ఏమిటంటే..

Director Prasanth Varma: హనుమాన్ మూవీతో డైరక్టర్ ప్రశాంత్ వర్మ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచిన జోష్ లో ఉన్నా ప్రశాంత్ వర్మకు మరో రెట్టింపు ఉత్సాహాన్ని చేసేలా అరుదైన ఘనత దక్కింది. ఇంతకి అదే ఏమిటంటే..

  • Published Mar 21, 2024 | 2:55 PMUpdated Mar 21, 2024 | 2:55 PM
హనుమాన్‌కి తొలి అవార్డ్ అందుకున్న ప్రశాంత్ వర్మ! పోస్ట్ వైరల్!

టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ ‘ప్రశాంత్ వర్మ’. గతకొన్ని రోజులుగా సినీ ఇండస్ట్రీలో ఈయన పేరు మారు మోగిపోతుంది. అందుకు కారణం ఆయన తెరకెక్కించిన ‘హనుమాన్’ సినిమా. అతి తక్కువ బడ్జెట్ తో రూపొందించి.. సంక్రాతి బరిలో దిగిన హనుమాన్ మూవీ వరల్డ్ వైడ్ గా రికార్డులను సృష్టించింది. మరి అంతలా ఈ సినిమా ప్రపంచ దేశాల్లో కూడా బ్లాక్ బస్టర్ గా నిలచిన ఘనత ప్రశాంత్ వర్మది అనే చెప్పవచ్చు. అంతలా ఆ సినిమాకు ప్రాణం పెట్టి తీశాడు. ఇందులో హీరో తేజ సజ్జా నటించగా.. హీరోయిన్ గా అమృత అయ్యారు నటించారు. ఇక ఈ సినిమాలో వరలక్ష్మీ శరత్ కుమార్ ప్రధాన పాత్రలో నటించారు. అయితే హనుమాన్ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచిన జోష్ లో ఉన్నా ప్రశాంత్ వర్మకు మరో రెట్టింపు ఉత్సాహాన్ని చేసేలా అరుదైన ఘనత దక్కింది. దీనిని ప్రశాంత్ వర్మ తన ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా అభిమానులతో పంచుకున్నారు. ప్రస్తుతం ప్రశాంత్ వర్మ చేసిన ఈ పోస్ట్ నెట్టింట తెగ వైరల్ అవుతుంది.

‘హనుమాన్’ మూవీతో డైరక్టర్ ప్రశాంత్ వర్మ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. కాగా,ఈ సినిమాను అతి తక్కువ బడ్జెట్ తో సంక్రాతి కానుకగా జనవరి 12న థియేటర్లలో విడుదల చేశారు. ఈ క్రమంలోనే.. హనుమాన్ మూవీ ఇప్పటి వరకు రూ. 350 కోట్లకి పైగా వసూళ్లను సాధించి భారీ బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ఇక ఇటీవల ఓటీటీలో అడుగుపెట్టిన హనుమాన్ అక్కడ కూడా రికార్డులు క్రియేట్ చేస్తూ దూసుకుపోతుంది. ఇక ఈ ఉత్సాహాన్ని రెట్టింపు చేసేలా హనుమాన్ సినిమాకు గాను.. ప్రశాంత్ వర్మ తాజాగా బెస్ట్ డైరెక్టర్‌గా అవార్డు అందుకున్నారు. పైగా ఈ విషయాన్ని తానే స్వయంగా తన ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా తెలియజేశారు.అందులో ప్రశాంత్ వర్మ.. హనుమాన్‌ సినిమాకి తొలి అవార్డు అందుకున్నాను. థాంక్యూ రేడియో సిటీ” అంటూ పోస్ట్ పెట్టారు . ఇక ఈ పోస్ట్ చూసిన నెటిజన్లు ప్రశాంత్ వర్మకి పెద్ద ఎత్తునే కంగ్రాట్స్ చెబుతూ కామెంట్లు పెడుతున్నారు. అయితే కొంతమంది మాత్రం ప్రశాంత్ వర్మ కాన్ఫిడెన్స్‌ని మెచ్చుకోవాలంటూ ప్రశంసిస్తున్నారు. అలానే కొంతమంది “హనుమాన్‌కి తొలి అవార్డ్ అంటూ ఆయన చెప్పారు.. కను్క ఇలాంటి అవార్డులు మరెన్నో సాధించాలని వస్తూనే ఉంటాయి. దాన్నే ఇండైరెక్ట్‌గా చెప్పారు. అంటూ నెటజన్స్ కామెంట్లు పెడుతున్నారు.

Hanuman

ఇక ప్రశాంత్ విషయానికకొస్తే.. ఆయన ‘ఆక్టోపస్’ అనే సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నారు.ఇందులో అనుపమ పరమేశ్వరన్ లీడ్ రోల్‌లో నటిస్తుంది. మరోవైపు హనుమాన్ మూవీ సీక్వెల్ ‘జై హనుమాన్’ స్క్రిప్ట్ వర్క్ కూడా ప్రశాంత్ వర్మ మొదలుపెట్టేశారు. కాగా, ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేస్తున్నట్లుగా ఇప్పటికే ప్రకటించారు.అయితే సీక్వెల్‌లో హనుమంతు పాత్రలో తేజ సజ్జా కొనసాగబోతున్నాడు. అయితే ఆంజనేయుడి పాత్రను మాత్రం ఒక స్టార్ హీరో చేస్తారని ప్రశాంత్ వర్మ చెప్పారు. కానీ అది ఎవరు అనే విషయంపై మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. కానీ చాలా మంది ఈ పాత్రను రానా చేస్తాడని అనుకుంటున్నారు. కానీ, ఏది ఏమైనా ప్రశాంత్ వర్మకు హనుమాన్ మూవీకి అవార్డు రావడం పై ఆయన అభిమానులు పెద్ద ఎత్తునే ప్రశంసిస్తూ కామెంట్లు పెడుతున్నారు.మరి, హనుమాన్ మూవీ తెరకెక్కించిన ప్రశాంత్ వర్మకు బెస్ట్ డైరెక్టర్ అవార్డు రావడం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by Prasanth Varma (@prasanthvarmaofficial)

Jojobet GirişmeritbetmeritbetcasibomJojobetjojobetJojobet GirişjojobetjojobetjojobetcasibomcasibomPokerklasMadridbetJojobet GirişcasibomHoliganbet GirişOnwin Girişbetcio girişCasibom Girişhttps://www.hoteltarobafoz.com.br/superbetin