iDreamPost
android-app
ios-app

‘హనుమాన్’ నేర్పిన 5 పాఠాలు.. వీటిని ఫాలో అయితే టాలీవుడ్​ను ఆపలేరు!

  • Published Mar 02, 2024 | 9:13 PM Updated Updated Mar 02, 2024 | 9:13 PM

ఈ ఏడాది సంక్రాంతి పండక్కి రిలీజైన ‘హనుమాన్’ మూవీ డబుల్ బ్లాక్​బస్టర్​గా నిలిచింది. ఈ చిత్రం ఇంకా థియేటర్లలో సందడి చేస్తోంది. 50 రోజుల సక్సెస్ సెలబ్రేషన్స్​ను జరుపుకుంటున్న ‘హనుమాన్’ టాలీవుడ్​కు 5 పాఠాలు నేర్పింది. అవేంటో ఇప్పుడు చూద్దాం..

ఈ ఏడాది సంక్రాంతి పండక్కి రిలీజైన ‘హనుమాన్’ మూవీ డబుల్ బ్లాక్​బస్టర్​గా నిలిచింది. ఈ చిత్రం ఇంకా థియేటర్లలో సందడి చేస్తోంది. 50 రోజుల సక్సెస్ సెలబ్రేషన్స్​ను జరుపుకుంటున్న ‘హనుమాన్’ టాలీవుడ్​కు 5 పాఠాలు నేర్పింది. అవేంటో ఇప్పుడు చూద్దాం..

  • Published Mar 02, 2024 | 9:13 PMUpdated Mar 02, 2024 | 9:13 PM
‘హనుమాన్’ నేర్పిన 5 పాఠాలు.. వీటిని ఫాలో అయితే టాలీవుడ్​ను ఆపలేరు!

చిన్న సినిమా, పెద్ద సినిమా అనే పదాలు తరచూ వినే ఉంటారు. ఆ ఇండస్ట్రీ, ఈ ఇండస్ట్రీ అనే తేడాలేదు. అన్ని చోట్లా ఈ తేడాను గమనించే ఉంటారు. తక్కువ బడ్జెట్​తో తెరకెక్కిన మూవీస్​ను స్మాల్ ఫిల్మ్స్​గా, హ్యూజ్ బడ్జెట్​తో రూపొందిన చిత్రాలను పెద్ద సినిమాలుగా పిలుస్తుంటారు. అయితే కొన్ని ఫిల్మ్స్ మాత్రం తక్కువ బడ్జెట్​లో రూపొంది చిన్న సినిమాగా పిలిపించుకున్నా.. బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ కలెక్షన్స్​తో హల్​చల్ చేస్తుంటాయి. వాటి రిజల్ట్ చూసి చిన్న సినిమా అని అనేందుకు అందరూ భయపడేలా చేస్తాయి. అలా చేసిన రీసెంట్ ఫిల్మ్ అంటే ‘హనుమాన్’ అనే చెప్పాలి. సంక్రాంతి పండక్కి విడుదలై డబుల్ బ్లాక్​బస్టర్​గా నిలిచిందీ మూవీ. తెలుగుతో పాటు నార్త్​లోనూ వసూళ్ల మోత మోగించింది. అలాగే 150 సెంటర్స్​లో అర్ధ శతదినోత్సవం జరుపుకుంటోంది. అలాంటి ‘హనుమాన్’ మూవీ టాలీవుడ్​కు నేర్పిన 5 పాఠాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

భయాన్ని పక్కనపెట్టాలి
కంటెంట్ మీద నమ్మకం ఉండి భయపడకుండా బరిలోకి దిగితే సక్సెస్ అదే వస్తుందని ‘హనుమాన్’ ప్రూవ్ చేసింది. తాము ఎంచుకున్న కథ, మేకింగ్, నటీనటుల పెర్ఫార్మెన్స్​పై నమ్మకంతో ఈ సినిమాను సంక్రాంతి రేసులోకి దింపారు మేకర్స్. ఎదురుగా పెద్ద హీరోలు మహేష్ బాబు, వెంకటేష్, నాగార్జున చిత్రాలు ఉండటంతో థియేటర్లు దొరకలేదు. అయినా సరే నెమ్మదిగానైనా జనాలు చూస్తారనే నమ్మకంతో మూవీని రిలీజ్​ చేశారు. కట్ చేస్తే రూ.300 కోట్లకు పైగా వసూళ్లతో టాలీవుడ్ హిస్టరీలో తనకంటూ ఓ స్పెషల్ పేజ్​ను క్రియేట్ చేసుకుంది.

ఓటీటీ రిలీజ్​కు తొందరొద్దు
ఓటీటీ సంస్థలు బంపరాఫర్ ఇస్తుండటంతో ‘సలార్’, ‘గుంటూరుకారం’ లాంటి పెద్ద సినిమాలు కూడా తక్కువ గ్యాప్​లో ఓటీటీల్లోకి వచ్చేస్తున్నాయి. ఈ రెండు చిత్రాలు 28 రోజుల గ్యాప్​లో ఓటీటీ స్ట్రీమింగ్​కు వచ్చేశాయి. కానీ రిలీజై 50 రోజులు దాటినా ‘హనుమాన్’ ఇంకా డిజిటల్ స్ట్రీమింగ్ చేసుకోలేదు. థియేట్రికల్ రన్ మీద నమ్మకం ఉంచి లాభాలను మరింత పెంచుకున్నారు మేకర్స్. దీనికి జీ5 ప్లాట్​ఫామ్ సహకారం అందించడం విశేషం. 50 డేస్ పూర్తయ్యాక మార్చి 8 లేదా ఆపై వారం వచ్చే ఛాన్స్ ఉంది.

బడ్జెట్ కాదు.. క్వాలిటీ కావాలి
‘హనుమాన్’ను లిమిటెడ్ బడ్జెట్​లో తీశాడు ప్రశాంత్ వర్మ. కానీ భారీ బడ్జెట్ ఫిల్మ్​లా ఔట్​పుట్​ను అందించాడు. విజువల్ ఎఫెక్ట్స్ విషయంలో ఆయన తీసుకున్న శ్రద్ధ ప్రతి ఫ్రేమ్​లో కనిపించింది. అడ్డగోలు బడ్జెట్ పెట్టేసి నిర్మాతలను కంగారు పెట్టకుండా.. నిర్ణీత బడ్జెట్​లో డబుల్ రేంజ్ ఔట్​పుట్ ఇవ్వడం, ఫిల్మ్​ను క్వాలిటీగా తీయడం కలిసొచ్చింది.

ఒక్కరితో ఏదీ కాదు
‘హనుమాన్’ సక్సెస్ వెనుక వందలాది మంది కృషి ఉంది. దీనికి టాప్ టెక్నీషియన్స్ పని చేయలేదు. కానీ ఉన్నంతలో బెస్ట్ టాలెంట్​ను పట్టుకున్న డైరెక్టర్ ప్రశాంత్.. వాళ్లతో తనకు కావాల్సిన ఔట్​పుట్​ను రాబట్టాడు. సినిమా అంటే ఒక్కరితో అయ్యేది కాదని.. అందరూ కలసికట్టుగా హండ్రెస్ పర్సెంట్ ఎఫర్ట్ పెడితే సాధ్యమని ఈ చిత్రం నిరూపించింది. ఈ ఫిల్మ్ సక్సెస్​ సీక్రెట్​లో టీమ్ వర్క్​ ఒకటని చెప్పొచ్చు.

కంటెంటే రియల్ హీరో
‘హనుమాన్’లో తేజ సజ్జ, అమృత అయ్యర్ లాంటి అప్​కమింగ్ యాక్టర్స్ నటించారు. విలన్ వినయ్ వర్మ గురించి పెద్దగా ఎవరికీ తెలియదు. అక్క పాత్ర చేసిన వరలక్ష్మీ శరత్​కుమార్ తప్పితే నోటెడ్ ఆర్టిస్టులు లేరు. అయినా సరే కంటెంట్ సినిమాను నడిపిస్తుందని.. అదే చిత్రాన్ని ఆడియెన్స్​కు దగ్గర చేస్తుందని నమ్మారు మేకర్స్. ఆ నమ్మకమే నిలబెట్టింది. ఇంత పెద్ద విజయాన్ని కట్టబెట్టింది. మరి.. ‘హనుమాన్’ మూవీ నేర్పిన పాఠాలు ఇంకేమైనా ఉన్నాయని మీరు భావిస్తే కామెంట్ చేయండి.

ఇదీ చదవండి: త్వరలోనే రణబీర్ కపూర్ రామాయణం ఆఫీషియల్ అనౌన్స్ మెంట్