iDreamPost
android-app
ios-app

త్వరలోనే రణబీర్ కపూర్ రామాయణం ఆఫీషియల్ అనౌన్స్ మెంట్

  • Published Mar 02, 2024 | 8:33 PM Updated Updated Mar 02, 2024 | 8:33 PM

Nitesh Tiwari Ramayanam Movie: పాన్ ఇండియా లెవల్లో నితీష్ తివారీ రామాయణంపై భారీ అంచనాలు ఉన్నాయి. అయితే ఈ మూవీపై తాజాగా ఒక క్రేజీ బజ్ ఒకటి నడుస్తోంది.

Nitesh Tiwari Ramayanam Movie: పాన్ ఇండియా లెవల్లో నితీష్ తివారీ రామాయణంపై భారీ అంచనాలు ఉన్నాయి. అయితే ఈ మూవీపై తాజాగా ఒక క్రేజీ బజ్ ఒకటి నడుస్తోంది.

  • Published Mar 02, 2024 | 8:33 PMUpdated Mar 02, 2024 | 8:33 PM
త్వరలోనే రణబీర్ కపూర్ రామాయణం ఆఫీషియల్ అనౌన్స్ మెంట్

గతంలో అమీర్ ఖాన్ తో దంగల్ వంటి మాస్టర్‌ పీస్‌ను అందించిన బాలీవుడ్ దర్శకుడు నితీష్ తివారీ భారతీయ ఇతిహాసం రామాయణంపై ట్రయాలజీ(మూడు భాగాలలో సినిమా) రూపొందిస్తున్నారు. ఈ ఎపిక్ డ్రామాలో స్టార్ హీరో రణబీర్ కపూర్ రాముడి పాత్రలో నటిస్తున్నారు. తాజాగా బాలీవుడ్ సర్కిల్స్ లో వినిపిస్తున్న వార్తల ప్రకారం త్వరలోనే ఈ సినిమా గురించి ఆఫీషియల్ అనౌన్స్ మెంట్ రానుందని తెలుస్తోంది.

నిజానికి ఈ సినిమాని ఇంతవరకూ అధికారికంగా ప్రకటించకపోయినా… ఇందులో నటీనటుల గురించి ఆసక్తికరమైన వార్తలు వస్తూనే ఉన్నాయి. రామాయణంలో వర్సటైల్ యాక్ట్రెస్ సాయి పల్లవి సీతగా కనిపించనున్నారు. ఇక రావణుడిగా కేజీఫ్ సీరీస్ ఫేమ్ రాకీ భాయ్ యష్ నటించనున్నారు. హనుమంతుడి పాత్రలో సన్నీ డియోల్, కుంభకర్ణుడిగా బాబీ డియోల్, శూర్పణకగా రకుల్ ప్రీత్ సింగ్, కైకేయిగా లారా దత్తా, లక్ష్మణుడిగా నవీన్ పోలిశెట్టి కనిపిస్తారని టాక్. తాజా అప్‌డేట్ ప్రకారం ఏప్రిల్ 17న శ్రీరామనవమి రోజున ఈ చిత్రాన్ని అధికారికంగా ప్రకటించనున్నారు. రామాయణంపై సినిమాను తీస్తూ ఆ విషయాన్ని ప్రకటించేందుకు రాముడి జయంతి కంటే మంచి రోజు ఉండదు అనే చెప్పాలి. మరి ఆ రోజే ఈ భారీ ప్రాజెక్ట్ లో ఎవరు నటిస్తున్నారనేది తెలుస్తుంది. తెలుగు, హిందీ ప్రేక్షకులు ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

గతంలో ప్రభాస్ – ఓం రౌత్ కాంబినేషన్లో రామాయణం ఆధారంగా ఆదిపురుష్ సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. అయితే అసలైన రామాయణం తీయకుండా కల్పిత సన్నివేశాలు ఎక్కువ కలిపారని ఆ సినిమా యూనిట్ పై విమర్శలు వచ్చాయి. అయితే నితీష్ తివారీ బృందం అలాంటి తప్పులు జరగకుండా స్క్రిప్ట్ విషయంలో చాలా జాగర్తలు తీసుకుందట. నితిష్ తివారీ అండ్ కో ఈ నెలలో ముంబైలో షూటింగ్ ప్రారంభిస్తారట. అయితే అధికారిక ప్రకటన మాత్రం ఏప్రిల్‌ లోనే వస్తుంది. కాగా 2025 దీపావళి పండుగ సందర్భంగా ఈ సినిమాని విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

Jojobet Girişcasibomjojobetjojobetcasibomcasibomcasibomgrandpashabetşanlıurfa konteynerbetciobetcioGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetJojobetStarzJojobetStarzbetjojobetcratosroyalbetgrandpashabetgrandpashabetganobetcasibom girişbetciojojobetgrandpashabet girişcasibom