25 రోజుల పాటు నటుడు మిస్సింగ్.. ఇంటికి వచ్చాక తల్లి రియాక్షన్ పై

ఇంట్లో నుండి ఓ నటుడు కావాలని వెళ్లిపోయాడు. ఇంటికి కూడా తిరిగి రావాలనుకోలేదు. కొడుకు ఏమై పోయాడో, ఎటు వెళ్లిపోయాడో తెలియక తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు. కానీ 25 రోజుల తర్వాత...

ఇంట్లో నుండి ఓ నటుడు కావాలని వెళ్లిపోయాడు. ఇంటికి కూడా తిరిగి రావాలనుకోలేదు. కొడుకు ఏమై పోయాడో, ఎటు వెళ్లిపోయాడో తెలియక తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు. కానీ 25 రోజుల తర్వాత...

బయట ప్రాంతాలకు వెళుతున్నప్పుడు కన్ప్యూజ్ కామన్. ఎంత గూగుల్ మ్యాప్ ఉన్నా కూడా దారి తప్పిపోతూ ఉంటారు. చిన్న పిల్లలే కాదు.. పెద్దలు కూడా ఒక్కొక్కసారి పొరపాటు పడి.. ఓ చోటుకు వెళ్లాల్సిందీ పోయి మరో చోటుకు వెళ్లిపోతుంటారు. పిల్లలు కనబడకపోతే తప్పిపోయారు లేక ఎవరైనా కిడ్నాప్ చేసి ఉంటారని భావిస్తుంటారు. కానీ 25 ఏళ్లకు పైబడిన వాళ్లు తప్పిపేతే అది కావాలని చేసిందేనని భావిస్తుంటారు. వారంతట వారు రావాల్సిందే కానీ.. ఎవ్వరూ ఏం చేయలేరు. ఇదే జరిగింది నటుడు విషయంలో. 25 రోజుల పాటు కానరాకుండా పోయాడు. ముంబయికి వెళ్లాల్సిన నటుడు.. గమ్యస్థానాలకు చేరుకోలేదు. ఇంటికి వస్తాడేమో అనుకున్నారు.. ఇక్కడకు చేరుకోలేదు. ఎటు వెళ్లిపోయాడో .. ఏమయ్యాడో తెలియక తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు.

కానీ ఎట్టకేలకు ఆయనే ఇంటికి తిరిగి వచ్చాడు. ఇంటికి వచ్చాక పేరెంట్స్ స్పందన గురించి తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు ఈ బుల్లితెర నటుడు. ‘తారక్ మెహతా కా ఊల్తా చష్మా’సీరియల్‌తో గుర్తింపు తెచ్చుకున్న నటుడు గురు చరణ్ సింగ్. ఆ మధ్య ఉన్నట్టుండి మాయం అయిపోయాడు. ఏప్రిల్ 22న ఢిల్లీ నుండి ముంబయికి వెళ్లాల్సిన అతడు అక్కడకు వెళ్లలేదు, ఇంటికి తిరిగిరాలేదు. కంగారు పడ్డ తల్లిదండ్రులకు కంప్లయింట్ చేశారు. అయితే 25 రోజుల తర్వాత ఇంటికి తిరిగి రాగా, పేరెంట్స్ భావోద్వేగానికి లోనయ్యారు. తాజాగా ఈ ఘటనపై టెలీటాక్‌తో మాట్లాడారు. 25 రోజుల తర్వాత మే 18న గురుచరణ్ ఇంటికి చేరుకున్నానని తెలిపాడు.

‘ 25 రోజుల తర్వాత రాత్రి 2 గంలకు ఇంటికి వచ్చాను. కాలింగ్ బెల్ కొట్టగానే ఈ టైంలో ఎవరూ అనుకుంటూ అమ్మ తలుపులు తీసింది. రాగానే ఆమె నన్ను గుర్తు పట్టలేదు. రాత్రి పూట కావడంతో తల్లి గుర్తించలేదు. ఆ తర్వాత గుర్తు పట్టి.. నాన్నకు ఎవరోచ్చారో చూడు అంటూ పిలిచి.. మన సోను వచ్చాడు అంటూ ఆవేదనకు గురైంది. ముగ్గురం కలిసి ఇంట్లోకి వెళ్లి చాలా సేపు ఏడ్చేశాం. అవి ఆనంద భాష్పాలు’ అంటూ చెప్పుకొచ్చాడు చరణ్ సింగ్. తాను ఆథ్యాత్మిక బాటలో నడిచేందుకు ఇంటి నుండి బయటకు వెళ్లిపోయానని, ఇంటికి తిరిగి వచ్చే ఆలోచన లేదని చెప్పాడు. కానీ దేవుడు సాధారణ జీవితం గడపడమని సంకేతం ఇవ్వడంతోనే తిరిగి వచ్చానని చెప్పాడు. ఇక పోలీసులు సైతం ఆధ్యాత్మిక వివాహారానికి వెళ్లినట్లు ధ్రువీకరించారు.

Show comments