iDreamPost
android-app
ios-app

‘గుంటూరు కారం’ OST: మహేష్ ఫ్యాన్స్​కు థమన్ ట్రీట్!

  • Published Feb 29, 2024 | 3:35 PM Updated Updated Feb 29, 2024 | 3:38 PM

సూపర్​స్టార్ మహేష్ బాబు అభిమానులకు మ్యూజిక్ డైరెక్టర్ థమన్ బిగ్ ట్రీట్ ప్లాన్ చేశారు. వాళ్లకు ఊహించని సర్​ప్రైజ్ ఇవ్వనున్నారు.

సూపర్​స్టార్ మహేష్ బాబు అభిమానులకు మ్యూజిక్ డైరెక్టర్ థమన్ బిగ్ ట్రీట్ ప్లాన్ చేశారు. వాళ్లకు ఊహించని సర్​ప్రైజ్ ఇవ్వనున్నారు.

  • Published Feb 29, 2024 | 3:35 PMUpdated Feb 29, 2024 | 3:38 PM
‘గుంటూరు కారం’ OST: మహేష్ ఫ్యాన్స్​కు థమన్ ట్రీట్!

సూపర్​స్టార్ మహేష్ బాబు-మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్​లో ఈ సంక్రాంతికి వచ్చిన మాస్ ఫ్యామిలీ ఎంటర్​టైనర్ ‘గుంటూరు కారం’ సినిమా బాక్సాఫీస్ వద్ద యావరేజ్​గా నిలిచింది. ప్రేక్షకులు, విమర్శకులు ఈ మూవీకి మిక్స్డ్ టాక్ ఇచ్చినా మహేష్ బాబు తన స్టార్​డమ్​తో ఫిల్మ్​కు వీలయినంత మంచి వసూళ్లు తెచ్చారు. ఇక తాజాగా ఈ సినిమా మ్యూజిక్​కు సంబంధించి సంగీత దర్శకుడు థమన్ ఒక ఇంటరెస్టింగ్ అప్డేట్ ఇచ్చారు.

నిజానికి ‘గుంటూరు కారం’ రిలీజ్​కు ముందు థమన్ ఇచ్చిన పాటలకి సరైన ఆదరణ లభించలేదు. సాంగ్స్ ఒక పెద్ద హీరో సినిమాలో ఉండాల్సిన విధంగా లేవని మహేష్ ఫ్యాన్స్ నిరాశపడ్డారు. అయితే ‘కుర్చీ మడత పెట్టి’ పాట మాత్రం పెద్ద హిట్ అయింది. ఇక మూవీ విడుదలయ్యాక పాటలకు రెస్పాన్స్ మారింది. సినిమాలో పాటలు బాగా కుదిరాయని ప్రేక్షకులు అభిప్రాయపడ్డారు. మొదట్లో బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్​కు నెగటివ్ రెస్పాన్స్ వచ్చినా.. తరువాత అది కూడా మారింది. ఇక, రమణ పాత్రని ఎలివేట్ చేసిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మహేష్ ఫ్యాన్స్​కు బాగా నచ్చింది. అలాగే చిత్రంలో లేని అమ్మ పాటను నిర్మాతలు విడుదల చేసినప్పుడు అంత మంచి పాటను సినిమాలో ఎందుకు పెట్టలేదని కంప్లైంట్ కూడా చేశారు.

ఇక, ‘గుంటూరు కారం’ సినిమా ఒరిజినల్ సౌండ్ ట్రాక్ (OST) కోసం ఎప్పటి నుంచో మహేష్ బాబు అభిమానులు ఎదురు చూస్తుండగా.. ఎట్టకేలకు దీనిపై సంగీత దర్శకుడు థమన్ స్పందించారు. ‘గుంటూరు కారం’ OSTని ఈ మార్చి 9న రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు. దీంతో మహేష్ ఫ్యాన్స్ ఆనందానికి హద్దుల్లేకుండా పోయాయి. ఇది వరకు ‘మిస్టర్ మజ్ను’, ‘అరవింద సమేత’ సినిమాలకు కూడా థమన్ ఇలానే ఒరిజినల్ సౌండ్ ట్రాక్ (OST) విడుదల చేసి మంచి స్పందన తెచ్చుకున్నారు. ఇప్పుడు కూడా ఆడియెన్స్​ను అట్రాక్ట్ చేసేందుకు సిద్ధమయ్యారు. మరి.. ‘గుంటూరు కారం’ ఒరిజినల్ సౌండ్ ట్రాక్ కోసం మీరెంత ఎదురు చూస్తున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: రాడిసన్‌ డ్రగ్‌ కేసులో ట్విస్ట్‌.. తన చెల్లి కనిపించడం లేదంటూ సినీ నటి కుషిత ఫిర్యాదు

Jojobet GirişJojobetşanlıurfa konteynerGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetjojobetjojobetjojobetbetwooncasibomcasibomcasibombetcio giriş