iDreamPost
android-app
ios-app

గుంటూరు కారం.. రొమాంటిక్‌గా ‘ఓ మై బేబీ ’పాట!

గుంటూరు కారం సినిమాలో మహేష్‌ బాబుకు జంటగా ‘శ్రీలీల’ నటించారు. ఈ చిత్రం జనవరి 12 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో బుధవారం ఓ పాట విడుదల అయింది.

గుంటూరు కారం సినిమాలో మహేష్‌ బాబుకు జంటగా ‘శ్రీలీల’ నటించారు. ఈ చిత్రం జనవరి 12 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో బుధవారం ఓ పాట విడుదల అయింది.

గుంటూరు కారం.. రొమాంటిక్‌గా ‘ఓ మై బేబీ ’పాట!

సూపర్‌స్టార్‌ మహేష్‌ బాబు- మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ కాంబినేషన్‌లో గుంటూరు కారం సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. జనవరి 12వ తేదీన థియేటర్లలో సందడి చేయనుంది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రేక్షకులను పలకరించనుంది. ఇక, ప్రమోషన్ల విషయంలో గుంటూరు కారం సినిమా టీం ఓ మెట్టు ముందే ఉంటోంది. ప్రతీ అప్‌డేట్‌తో మూవీపై అంచనాలను పెంచేస్తోంది. పోస్టర్‌ దగ్గరి నుంచి పాటల వరకు ప్రతీ దానికి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్‌ వచ్చింది.

ముఖ్యంగా పాటలు యూట్యూబ్‌లో మంచి హిట్‌ అయ్యాయి. ఎస్‌ఎస్‌ థమన్‌ సంగీతంతో కొద్దిరోజుల క్రితం విడుదలైన టైటిల్‌ ట్రాక్‌కు మాస్‌లో మంచి గుర్తింపు వచ్చింది. ఇప్పుడు మరో పాట ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ‘ ఓ మై బేబీ ’ అనే రొమాంటిక్‌ సాంగ్‌ ప్రేక్షకులను అలరిస్తోంది. సినిమా టీం బుధవారం సాయంత్రం 6.9 గంటల ప్రాంతంలో ఈ పాటను విడుదల చేసింది. విడుదలైన కొన్ని నిమిషాల్లోనే వేల సంఖ్యలో వ్యూస్‌తో దూసుకుపోతోంది.

కాగా, గుంటూరు కారం మూవీలో మహేష్‌బాబుకు జంటగా శ్రీలీల నటించారు. మీనాక్షి చౌదరి, జగపతి బాబు, రమ్య కృష్ణ, జయరాం, ప్రకాశ్‌రాజ్‌, సునీల్‌, బ్రహ్మానందం తదితరులు కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. ఈ సినిమా నైజాం ఏరియా డిస్ట్రిబ్యూషన్‌ హక్కుల్ని ప్రముఖ టాలీవుడ్‌ నిర్మాత దిల్‌ రాజు సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. పెద్ద మొత్తం అమౌంట్‌తో గుంటూరు కారం హక్కుల్ని సొంతం చేసుకున్నట్లు సమాచారం. అయితే, సంక్రాంతి బరిలో గుంటూరు కారంకు పోటీ గట్టిగా ఉంది. నాగార్జున  ‘నా సామిరంగ’, వెంకటేష్‌ ‘ సైంధవ్‌, ప్యాన్‌ ఇండియా మూవీ ‘హానుమాన్‌’లు కూడా సంక్రాంతి సందర్భంగానే ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.

ఇక, గుంటూరు కారం విడుదలకు ముందే మహేష్‌ మరో రికార్డు క్రియేట్‌ చేశాడు. అమెరికా ప్రీమియర్స్‌ విషయంలో మహేష్‌ నటించిన ఎనిమిది చిత్రాలు ఒక్కోటి 4 కోట్ల రూపాయల చొప్పున వసూళ్లు సాధించాయి. మహేష్‌ తర్వాతి స్థానంలో ప్రభాస్‌ ఉన్నాడు. ప్రభాస్‌ హీరోగా వచ్చిన ఆరు సినిమాలు నాలుగు కోట్ల మార్కును చేరాయి. ప్రభాస్‌ తర్వాత వరుసగా.. ఎన్టీఆర్‌, చిరంజీవి, పవన్‌ కల్యాణ్‌, అల్లు అర్జున్‌, రామ్‌ చరణ్‌, బాలకృష్ణ, విజయ్‌ దేవరకొండ, నాని ఉన్నారు. మహేష్‌ బాబు ఫ్యాన్స్‌తో పాటు సగటు సినీ ప్రేక్షకుడు ఎంతో ఆసక్తిగా గుంటూరు కారం విడుదల కోసం చూస్తున్నాడు. మరి, గుంటూరు కారం నుంచి వచ్చిన ‘ఓ మై బేబీ’ అనే రొమాంటిక్‌ సాంగ్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.