iDreamPost
android-app
ios-app

మహేశ్ బాబు ఫ్యాన్స్.. వీరిని హ్యాండిల్ చేయడం చాలా కష్టం!

గత రెండు రోజులనుంచి సోషల్‌ మీడియాలో మహేష్‌బాబు ఫ్యాన్స్‌కు.. గుంటూరుకారం నిర్మాత, లిలిక్‌ రైటర్లకు మధ్య సోషల్‌ మీడియా వేదికగా ఓ యుద్దం జరుగుతోంది..

గత రెండు రోజులనుంచి సోషల్‌ మీడియాలో మహేష్‌బాబు ఫ్యాన్స్‌కు.. గుంటూరుకారం నిర్మాత, లిలిక్‌ రైటర్లకు మధ్య సోషల్‌ మీడియా వేదికగా ఓ యుద్దం జరుగుతోంది..

మహేశ్ బాబు ఫ్యాన్స్.. వీరిని హ్యాండిల్ చేయడం చాలా కష్టం!

సినిమా.. కొంతమందికి ఇది వ్యాపారం. కొంతమందికి ఆనందం. కానీ.., ఇంకో వర్గం ఉంది. వారికి సినిమా అంటే పిచ్చి. తన ఫేవరేట్ హీరోలు అంటే ప్రాణం. వాళ్ళకి సినిమా తప్ప మరో లోకం తెలియదు. వాళ్ళ హీరో తప్ప ఇంకో దేవుడు అక్కర్లేదు. ఇలాంటి వారినే డై హార్ట్ ఫ్యాన్స్ అంటారు. ఇలాంటి అభిమానులను సంపాదించుకునే సత్తా ఉన్న హీరోలు అతి తక్కువ మంది ఉంటారు. టాలీవుడ్ లో మెగా, నందమూరి, అక్కినేని, దగ్గుబాటి, ఘట్టమనేని కుటుంబాలకు మాత్రమే ఇంతటి ఫ్యాన్ బేస్ ఉంది.

ఇక ప్రభాస్, బన్నీ కూడా అంతే స్థాయి అభిమానులను సంపాదించుకున్నారు. నిజానికి ఈ అభిమానుల లెక్క అంతా ఒక్కటే. మా హీరో తోపు. మా హీరో సినిమానే తోపు. ఆ మూవీ బాగాలేకపోయినా సరే వీళ్ళు మాత్రం తగ్గరు. సోషల్ మీడియాలో సినిమా అద్భుతం అంటూ పోస్ట్ లు పెట్టేస్తుంటారు. అవసరమైతే నేరుగా గొడవలకి దిగుతారు. ఇదంతా తమ హీరోని, సినిమాని కవర్ చేసుకునే ప్రయత్నం. కానీ.., వీరందరిలో సూపర్ స్టార్ మాహేశ్ బాబు ఫ్యాన్స్ లెక్క మాత్రం కాస్త తేడా.

మహేశ్ బాబు ఫ్యాన్ బేస్ స్ట్రెంత్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. కానీ.., వీరంతా ఒక డిఫరెంట్ మెంటాలిటీతో ఉంటారు. సూపర్ స్టార్ పై వీరిది కన్నతల్లి ప్రేమ లాంటిది. ఆయనకి ప్లస్ అయ్యేది ఏదైనా నెత్తిన పెట్టుకుంటారు. ఆయనకి మైనస్ అయ్యేది దేనినైన చీల్చి చెండాడుతారు. ఆఖరికి అది మహేశ్ సినిమా అయినా సరే.. బాగుంటేనే కాలర్ ఎగరేస్తారు. ఒకవేళ బాగాలేదో బయట వాళ్ళ కన్నా వీళ్ళే ఎక్కువ విమర్శలు చేస్తారు. పోకిరి సినిమాని ఇండస్ట్రీ హిట్ చేసిన ఈ అభిమానులే..

స్పైడర్ మూవీ చేశాడని ఏకంగా తమ హీరోపైనే కోపాన్ని వెళ్లగక్కారు. నిజానికి అది కోపం కాదు. మహేశ్ బాబు అంటే వాళ్ళకి ఉండే స్వచ్ఛమైన ప్రేమ. ఆ అభిమానంలో అంత నిజాయతీ ఉంటుంది. బాబుకి బ్యాడ్ చేసేది ఏదైనా సరే.. వీళ్ళు బెండ్ తీసేస్తారు. ఇలాంటి అభిమానాన్ని మహేశ్ బాబు ఎప్పుడో అర్ధం చేసుకున్నారు. “నాకున్న ఫ్యాన్స్ ఇంకెవ్వరికీ ఉండరు. సినిమా బాగుంటే నెత్తిన పెట్టుకుంటారు. బాగాలేకుంటే అందరికన్నా మా వాళ్ళే ఎక్కువ విమర్శిస్తారు” అని ఆయనే ఓ స్టేజ్ పై ఒప్పుకున్నారు.

ఇంతవరకు అంతా బాగానే ఉన్నా.. ఫ్యాన్స్ ని మహేశ్ అర్ధం చేసుకున్నంతగా ఆయనతో సినిమాలు చేసే టెక్నీషియన్స్ అర్ధం చేసుకోవడం లేదు. ఇప్పుడు గుంటూరు కారం మూవీ విషయంలో ఇదే రిపీట్ అయ్యింది. గుంటూరు కారం నుండి కొన్ని రోజులు క్రితం “ఓ మై బేబీ” సాంగ్ రిలీజ్ అయిన విషయం తెలిసిందే. ఆ సాంగ్ అభిమానులకి అంతగా ఎక్కలేదు. ఓ రోజు అంతా థమన్ పై సోషల్ మీడియాలో ఇష్ఠానుసారంగా పోస్ట్ లు పెట్టారు. థమన్ ఓపిక పట్టాడు. మౌనంగా భరించాడు.

Mahesh babu fans issue

నెక్స్ట్ ఒక బ్లాసింగ్ సాంగ్ తో వస్తానని హుందాగా ట్వీట్ చేశాడు. కానీ.., మధ్యలో లిరిక్స్ రైటర్ రామజోగయ్య శాస్త్రి తన బాధని వెళ్లగక్కుతూ కాస్త ఆవేశంగా ట్వీట్ చేశారు. హద్దులు దాటేస్తున్నారంటూ.., కుక్కలు అంటూ.. ఏవేవో రాసుకొచ్చేశారు. ఇక ఈయన తరువాత వంశీది కూడా ఇదే దారి. ఏకంగా ఆనిమల్ క్లయిమ్యాక్స్ షాట్ ట్వీట్ చేసి ఫ్యాన్స్ ని ఇంకాస్త గిల్లి వదిలేశాడు. దీంతో.. ఇప్పుడు మహేశ్ ఫ్యాన్స్ ఇంకాస్త రెచ్చిపోతున్నారు. నిజానికి ఇక్కడ నిర్మాత వంశీ, థమన్, రామజోగయ్య శాస్త్రి అందరి బాధ ఒక్కటే.. “మహేశ్ సినిమా కోసం మేమంతా ప్రాణం పెట్టి పని చేస్తుంటే.. మధ్యలో మీరెందుకు అనవసరంగా హద్దులు దాటి ప్రవర్తిస్తున్నారు.

ఫైనల్ రిజల్ట్ వరకు ఓపిక పట్టండి” అన్నది వీరి బాధ. కానీ.., ఆ బాధలో ఫ్యాన్స్ ని టాంపర్ చేయడమే ఇక్కడ అసలు సమస్యకి కారణం అవుతోంది. వాళ్ళు హద్దులు మీరు పోస్టింగ్స్ పెట్టిన మాట వాస్తవమే. కానీ.., లాజిక్ లేకుండా ఎమోషనల్ గా మాట్లాడే వారిని అంత సీరియస్ గా తీసుకుని.. ఆ టాపిక్ పై రెస్పాండ్ అవ్వడం ఎందుకు అన్నదే అసలు సమస్య. పైగా.. ఇక్కడ మేకర్స్ గాని.., మహేశ్ ఫ్యాన్స్ గాని కోరుకునేది గుంటూరు కారం సక్సెస్ మాత్రమే. అలాంటప్పుడు అంతా ఒక కుటుంబం కిందకే వస్తారు. మరి.. అయిన వారి మధ్య ఇంతటి అగాధాలు ఎందుకు? ఇప్పటికైనా ఈ రచ్చకి బ్రేక్ పడుతుంది ఏమో చూడాలి. మరి.. ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.