iDreamPost
android-app
ios-app

Ghani : ఇలా అయితే కలెక్షన్లు వస్తాయా

  • Published Apr 04, 2022 | 3:03 PM Updated Updated Apr 04, 2022 | 3:03 PM
Ghani : ఇలా అయితే కలెక్షన్లు వస్తాయా

ఈ వారం అతి పెద్ద రిలీజ్ వరుణ్ తేజ్ గని ఒకటే. భారీ బడ్జెట్ తోనే నిర్మించారు కానీ ఎందుకో ఈ మెగా మూవీకి ఆశించిన బజ్ రావడం లేదు. ఆర్ఆర్ఆర్ తాకిడి బాక్సాఫీస్ వద్ద ఇంకా బలంగానే ఉంది. తగ్గించిన రేట్లు ఇవాళ్టి నుంచి అమలులోకి రానుండటంతో కలెక్షన్లు మళ్ళీ పెరుగుతాయనే నమ్మకం ట్రేడ్ లో ఉంది. 14న కెజిఎఫ్ 2 వచ్చేలోగా వీలైనంత రాబట్టుకోవాలనేది డిస్ట్రిబ్యూటర్ల ఆలోచన. ఈ నేపథ్యంలో థియేటర్ కౌంట్ ఎక్కువగానే ఉండబోతోంది. సో గనికి దక్కేది పరిమిత విడుదలే. కిరణ్ కొర్రపాటిని దర్శకుడిగా పరిచయం చేస్తూ అల్లు అర్జున్ అన్నయ్య బాబీ నిర్మాతగా పరిచయమవుతున్న ఈ సినిమా బాక్సింగ్ బ్యాక్ డ్రాప్ లో తీశారు.

ఇక అసలు విషయానికి వస్తే తెలంగాణలో గనికి సైతం జిఓని వాడుకుని టికెట్లకు గరిష్ట ధరను ఫిక్స్ చేయడం ఎగ్జిబిటర్లను టెన్షన్ కలిగిస్తోంది. హైదరాబాద్ మల్టీ ప్లెక్సులో 295, సింగల్ స్క్రీన్ లో 175 చొప్పున ఆల్రెడీ ఆన్ లైన్ బుకింగ్ మొదలుపెట్టారు. ప్రస్తుతానికి కొన్ని థియేటర్లు ఉన్నాయి. ఇంకో రెండు మూడూర్ రోజుల్లో యాడ్ అయ్యేవి ఇదే ఫాలో అవుతాయా లేక పాత ధరలకు మొగ్గు చూపుతాయా అనేది వేచి చూడాలి. వాస్తవానికి ఈ స్ట్రాటజీ రిస్క్ తో కూడుకున్నది. ఆర్ఆర్ఆర్ అంటే విజువల్ వండర్ కాబట్టి టికెట్ ఎంత ఉన్నా జనం భరించారు. కానీ అలా అని వచ్చిన ప్రతి సినిమాకు అంతేసి ఖర్చు పెట్టుకోమని చెబితే ఎలా ఒప్పుకుంటారు.

వరుణ్ తేజ్ ట్రాక్ రికార్డుని పక్కనపెడితే తనమీ హెవీ క్రౌడ్ పుల్లర్ కాదు. టాక్ బాగా వస్తే నిలబెట్టగలడు కానీ యావరేజ్ అనిపించుకుంటే మాత్రం పెట్టుబడి వెనక్కు తేవడమే గొప్ప. గని అసలే బాక్సింగ్ బ్యాక్ డ్రాప్ లో రూపొందింది. ఇప్పటికే ఈ కాన్సెప్ట్ మీద చాలా సినిమాలు వచ్చాయి. ఉపేంద్ర, సునీల్ శెట్టి లాంటి క్యాస్టింగ్ ఉన్నప్పటికీ గనిలో ఉన్న ప్రత్యేకత ఏంటో సినిమా చూశాకే తెలుస్తుంది. అలాంటప్పుడు నార్మల్ రేట్లతో వెళ్లుంటే బాగుండేది. ఏపిలో పెంపు ఉండకపోవచ్చు. 13న బీస్ట్, 14న కెజిఎఫ్ 2 వస్తున్న నేపథ్యంలో గని చేతిలో ఉండేది కేవలం వారం రోజులే. బ్లాక్ బస్టర్ అనిపించుకుంటే ఓకే లేదంటే మాత్రం ఇబ్బందులు తప్పవు

Also Read : RRR collections: ట్రిపులార్ లక్ష్యం ఇంకా ఎంత దూరం ఉంది