Vishwak Sen Vs Anchor Devi Nagavalli దేవి VS విశ్వక్ – తప్పెవరిది

హీరో చిన్నవాడైనా పెద్దవాడైన గౌరవం ఇవ్వడం కనీస బాధ్యత. నిన్న జరిగిన విశ్వక్ సేన్ ప్రాంక్ రాద్ధాంతంలో సదరు మీడియా వ్యవహరించిన వైనం విమర్శల పాలవుతోంది. యాంకర్ దేవి నేరుగా వేలు చూపించి గెటవుట్ అని లైవ్ షోలో వార్నింగ్ ఇవ్వడం, పదే పదే ఆ పదాన్ని నొక్కి చెప్పడమంటే అతన్ని అవమానించడమే. ఒకవేళ విశ్వక్ స్థానంలో ఎవరైనా వందల కోట్ల మార్కెట్, భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న స్టార్ ఉంటే ఇలాగే ప్రవర్తించేవారా అంటే డౌటే. విశ్వక్ పిలవకుండానే వెళ్ళాడనేది సదరు ఛానల్ వెర్షన్. సరే ఆహ్వానం లేకుండానే స్టూడియోకు వచ్చాడు. అలా అని తను శత్రువేం కాదు కదా. ఇంటికి వచ్చిన అతిథికి రెస్పెక్ట్ ఇవ్వాలిగా.

సరే తను ఓ తప్పు మాట అన్నాడు. కానీ దానికన్నా ముందు విశ్వక్ ని పాగల్ సేన్ అని, డిప్రెషన్ లో ఉన్నాడని చెప్పడం ఎవరి తప్పు. అందుకే అలా రియాక్ట్ అవ్వాల్సి వచ్చింది. ఒక యువ హీరోకన్నా ఎక్కువగా దశాబ్దాల చరిత్ర కల ఆ ఛానల్ బాధ్యతగా వ్యవహరించాల్సి ఉంది. ఒకవేళ జరుగుతోంది నచ్చలేదంటే ప్రోగ్రాంని ఆపేయడమో లేదా ఎడిటింగ్ చేసి కట్ చేయడమో ఉండాలి. కానీ అలా జరగలేదు. వ్యూస్ కోసమో వివాదం కోసమో టెలికాస్ట్ ని కానిచ్చేశారు. ఇప్పుడు విశ్వక్ తప్పనేలా పదే పదే డిబేట్లు పెట్టడం సబబా. ఇదంతా జనానికి ఎలా కనిపిస్తోందన్న కనీస విజ్ఞత ఉండాలి కదా. సరే ఒక కోణంలో చూడటం ఎందుకు రెండో వైపు చూద్దాం

ప్రాంక్ అయినా సరే గుర్తింపు ఉన్న విశ్వక్ సేన్ లాంటి హీరో నడిరోడ్డు మీద అలాంటివి చేయడం ఎంత మాత్రం సమర్ధనీయం కాదు. ఒకవేళ ప్రమోషన్ అనుకుంటే ముందే పోలీస్ శాఖ నుంచి పర్మిషన్ తీసుకున్నారా లేదా. ఉంటే ఆధారం చూపించాలి. తన మీద ఏదో ఛానల్ లో నెగటివ్ గా మాట్లాడుతున్నారు. దానికి టెంపర్ కోల్పోయి స్టూడియోకు వెళ్లడం ఎందుకు. సోషల్ మీడియాలోనో లేదా ప్రెస్ మీటో పెట్టి గట్టిగా నిలదీయొచ్చుగా. అలా కాకుండా డైరెక్ట్ గా వెళ్లిపోవడం ఎంత మాత్రం కరెక్ట్ కాదు. ఎవరు సారీలు చెప్పినా చెప్పకపోయినా ఇష్యూ ముదిరిపోయింది. మే 6న విడుదల కావాల్సిన విశ్వక్ సినిమా కంటే దీని గురించే ఎక్కువ చర్చ జరగడం విచారకరం.

Show comments