iDreamPost
android-app
ios-app

జెనీలియా దంపతులు రొమాన్స్.. పాపం పూజా హెగ్డే భలే బుక్ అయ్యింది!

  • Published Mar 19, 2024 | 6:20 PM Updated Updated Mar 19, 2024 | 6:20 PM

బాలీవుడ్​లో జెనిలియా దంపతులకు మంచి క్రేజ్ ఉంది. రీల్​ లైఫ్​లోనే కాదు.. రియల్ లైఫ్​లోనూ వీళ్ల మధ్య అన్యోన్యత చూసి అందరూ ఫిదా అయిపోయారు. అయితే ఈ జంట రొమాన్స్ వల్ల పాపం పూజా హెగ్డే బుక్ అయ్యింది.

బాలీవుడ్​లో జెనిలియా దంపతులకు మంచి క్రేజ్ ఉంది. రీల్​ లైఫ్​లోనే కాదు.. రియల్ లైఫ్​లోనూ వీళ్ల మధ్య అన్యోన్యత చూసి అందరూ ఫిదా అయిపోయారు. అయితే ఈ జంట రొమాన్స్ వల్ల పాపం పూజా హెగ్డే బుక్ అయ్యింది.

  • Published Mar 19, 2024 | 6:20 PMUpdated Mar 19, 2024 | 6:20 PM
జెనీలియా దంపతులు రొమాన్స్.. పాపం పూజా హెగ్డే భలే బుక్ అయ్యింది!

ఫిల్మ్ ఇండస్ట్రీలో హీరోయిన్స్​కు ఇప్పుడు ఎక్కువగా లైఫ్ ఉండట్లేదు. నటీమణులుగా లాంగ్ టైమ్ కొనసాగడం కుదరడం లేదు. అందుకే దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలనే కాన్సెప్ట్​తో ఎక్కువ మంది తారలు ఉంటున్నారు. మంచి ఫామ్​లో ఉన్నప్పుడు వరుస సినిమాలు చేస్తూ నాలుగు రాళ్లు వెనకేసుకుంటున్నారు. అయితే కొందరు మాత్రం దీనికి భిన్నమనే చెప్పాలి. అలాంటి అరుదైన హీరోయిన్లలో పూజా హెగ్డే ఒకరు. గ్లామర్ షో కంటే తన పాత్ర, స్టోరీకి ఎక్కువ ఇంపార్టెంట్ ఇస్తారామె. ఈ క్రమంలోనే తన యాక్టింగ్, డాన్సులతో కోట్లాది మంది అభిమానాన్ని సంపాదించుకున్నారు. అయితే ఈ మధ్య సినీ ఛాన్సులు తగ్గిపోవడంతో పెద్దగా యాక్టివ్​గా లేదు పూజ. అడపాదడపా ప్రైవేటు ఈవెంట్స్​లో సందడి చేస్తూనో లేదా సోషల్ మీడియాలో పోస్టుల ద్వారానో కాస్త అటెన్షన్ తీసుకుంటున్నారు. ఆఫర్లు తగ్గినా పూజ క్రేజ్ మాత్రం చెక్కుచెదరలేదు. ఇప్పటికీ ఆమె జోరు అలాగే ఉంది. సినిమాల మటుకే గానీ పూజ పర్సనల్ లైఫ్​ గురించి పెద్దగా రూమర్స్ వచ్చిన దాఖలాలు లేవు.

లవ్, డేటింగ్ లాంటి వ్యవహారాలకు దూరంగా ఉంటూ కెరీర్​ మీద ఫోకస్ చేస్తున్నారు పూజా హెగ్డే. అలాంటి బుట్టబొమ్మ తాజాగా ఓ విషయంలో వైరల్ అయ్యారు. ఒక స్టార్ కపుల్ రొమాంటిక్​గా ఉంటే వారిని చూసి ఆమె జెలసీగా ఫీలవ్వడమే దీనికి కారణం. ఆ జంట మరెవరో కాదు.. సీనియర్ హీరోయిన్ జెనీలియా-ఆమె భర్త రితేష్ దేశ్​ముఖ్. వీళ్లిద్దరూ ఆ మధ్య ముంబైలో జరిగిన ఓ ఫంక్షన్​లో అటెండ్ అయ్యారు. ఆ ఈవెంట్​కు పూజా హెగ్డే కూడా విచ్చేశారు. అయితే ఆ ఫంక్షన్​లో జెనీలియా-రితేష్​ క్లోజ్​గా మూవ్ అవుతూ కనిపించారు. రితేష్​ను పట్టుకొని ఆయనతో సరదగా మాట్లాడుతూ, నవ్వుతున్నారు జెనీలియా. కానీ ఆ టైమ్​లో అక్కడే ఉన్న పూజా హెగ్డే తనకేం పట్టనట్లు వెళ్లిపోయారు. వాళ్లిద్దరి వైపు ఓర కంటితో చూస్తూ కామ్​గా పక్క నుంచి వెళ్లిపోయారు.

పూజ జెలసీగా చూసినట్లు అనిపించిందో ఏమో జెనీలియా వెంటనే వెనక్కి తిరిగి ఆమె వైపు సీరియస్​గా చూసింది. ఇది జరిగి చాలా రోజులే అయింది. కానీ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీన్ని చూసిన నెటిజన్స్ భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కొందరు పూజకు సపోర్ట్ చేస్తూ ఆమె మామూలుగానే నడుచుకుంటూ వెళ్లిపోయిందని అంటున్నారు. కానీ మరికొందరు నెటిజన్స్ మాత్రం బుట్టబొమ్మ జెలసీతోనే అలా చేసిందని కామెంట్స్ చేస్తున్నారు. ఆమె చూపులు, ముఖం తిప్పుకున్న తీరు, లోలోపల మాట్లాడుకోవడమే దీనికి ప్రూఫ్ అని చెబుతున్నారు. కపుల్స్​ను చూస్తే సింగిల్స్ ఎవరైనా ఇలాగే చేస్తారని అంటున్నారు. అయితే ఏదేమైనా ఒక్క వీడియోతో పూజ నెట్టింట తెగ వైరల్ అవడమే కాదు.. అనవసరంగా బుక్ అయిపోయారని చెబుతున్నారు. మరి.. పూజా హెగ్డే కాంట్రవర్సీ వీడియో మీద మీ ఒపీనియన్​ను కామెంట్ చేయండి.

Jojobet GirişjojobetJojobetjojobetjojobetJojobetZirvebetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioGrandpashabetHoliganbetHoliganbetHoliganbetjojobetjojobet girişjojobet giriş