iDreamPost
android-app
ios-app

ఎట్టకేలకు గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి రిలీజ్ డేట్ ఫిక్స్..!

  • Published Mar 16, 2024 | 5:23 PM Updated Updated Mar 16, 2024 | 5:23 PM

మాస్ కా దాస్ విశ్వక్ సేన్ నటించిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి చిత్రం రిలీజ్ డేట్ ఫిక్స్ అయ్యింది. ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం రిలీజ్ విషయంలో పలుమార్లు వాయిదా పడుతూ వచ్చింది. ఎట్టకేలకు రిలీజ్ కాబోతుంది.

మాస్ కా దాస్ విశ్వక్ సేన్ నటించిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి చిత్రం రిలీజ్ డేట్ ఫిక్స్ అయ్యింది. ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం రిలీజ్ విషయంలో పలుమార్లు వాయిదా పడుతూ వచ్చింది. ఎట్టకేలకు రిలీజ్ కాబోతుంది.

  • Published Mar 16, 2024 | 5:23 PMUpdated Mar 16, 2024 | 5:23 PM
ఎట్టకేలకు గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి రిలీజ్ డేట్ ఫిక్స్..!

వర్సటైల్ యాక్టర్, మాస్ కా దాస్ విశ్వక్ సేన్ మంచి జోష్ మీద ఉన్నాడు. గామి మూవీతో మంచి హిట్ అందుకున్నాడు. శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని మార్చి 8న రిలీజ్ అయిన ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ తొలి రోజే దాటి పోయి.. భారీ లాభాలను కొల్లగొడుతుంది. కేవలం ఆరు కోట్లతో తెరకెక్కిన ఈ చిత్రం.. రూ. 30 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టుకుంది. విశ్వక్ కెరీర్‌లో హయ్యర్ కలెక్షన్ మూవీగా నిలిచింది. వి సెల్యూలాయిడ్, కార్తీక్ కల్ట్ క్రియేషన్స్ బ్యానర్లపై రూపొందిన ఈ చిత్రం.. విభిన్న కథ, కథనాలతో దూసుకెళుతుంది. చాందినీ చౌదరి హీరోయిన్‌గా నటించగా.. అభినయ కీలక పాత్ర పోషించింది. విద్యాధర్ కాగిత దర్శకత్వం వహించాడు. ఈ మూవీ బాక్సాఫీసు వద్ద ఉండగానే.. మరో సినిమా రిలీజ్ ప్రకటించాడు విశ్వక్.

ఛల్ మోహన్ రంగా ఫేమ్ కృష్ణ చైతన్య దర్శకత్వంలో రూపొందుతున్న గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి రిలీజ్ డేట్ ఎట్టకేలకు ఫిక్స్ అయ్యింది. గామి కన్నా ముందే విడుదల కావాల్సిన ఈ చిత్రం.. వాయిదాలు పడుతూ.. థియేటర్లలోకి వచ్చేస్తోంది. మే 17న ప్రపంచ వ్యాప్తంగా ఈ మూవీ విడుదల కాబోతున్నట్లు ప్రకటిస్తూ.. పోస్టర్ విడుదల చేసింది చిత్ర యూనిట్. విశ్వక్ సేన్ 11వ మూవీగా గత ఏడాది రిలీజ్ కావాల్సి ఉంది. అక్కడి నుండి మార్చి 8 అంటూ ఎనౌన్స్ చేసింది కూడా చిత్ర యూనిట్. అనుకోని కారణాలతో ఆ సినిమా వాయిదా పడడటం.. ఆ ప్లేసులోకి గామి వచ్చి చేరడం చక చకా జరిగిపోయాయి. ఈ మూవీ గోదావరి బ్యాక్ డ్రాప్ లో సాగే పొలిటికల్ విలేజ్ డ్రామా అని సమాచారం.

శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్ మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్ పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నారు. అమిత్ సినిమాటోగ్రఫీ నిర్వహిస్తుండగా.. నవీన్ నూలి ఎడిటింగ్ వర్క్ చేస్తున్నారు. డీజె టిల్లు ఫేమ్ నేహా శెట్టి హీరోయిన్‌గా నటిస్తోంది. అంజలి కీలక పాత్ర పోషిస్తుంది. ఉమెన్స్ డే సందర్భంగా అంజలి పిక్ విడుదల చేసింది చిత్ర యూనిట్. దీంతో సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. ఇందులో ఆమె వేశ్య పాత్రలో కనిపించబోతుందంటూ వార్తలు వినిపిస్తున్నాయి. నాజర్, సాయికుమార్, హైపర్ ఆది కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం.. ఎట్టకేలకు సమ్మర్ లో సందడి చేసేందుకు వచ్చేస్తోంది. ఇంతకు మే నెలలోనైనా వచ్చేస్తాడా..?

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetturboslothızlıcasinohızlıcasinohızlıcasinoturboslotzenbetjojobetnakitbahiscasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetjojobetcasibom girişCasibomgrandpashabetJojobet Giriş