iDreamPost
android-app
ios-app

కల్కి ఫ్యాన్స్ కి బిగ్ షాకిచ్చిన గణపత్ టీజర్! ఇవి గమనించారా..?

  • Author ajaykrishna Published - 03:29 PM, Sat - 30 September 23
  • Author ajaykrishna Published - 03:29 PM, Sat - 30 September 23
కల్కి ఫ్యాన్స్ కి బిగ్ షాకిచ్చిన గణపత్ టీజర్! ఇవి గమనించారా..?

ఇండస్ట్రీలో కొన్నిసార్లు సినిమాలు థియేటర్స్ లో రిలీజ్ అయ్యాక కాదు. జస్ట్ టీజర్స్ రిలీజ్ అయినప్పుడే సర్ప్రైజ్ చేస్తుంటాయి. కొన్ని టీజర్స్ షాకిస్తాయి. ప్రస్తుతం బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ నటిస్తున్న ‘గణపత్’ మూవీ టీజర్.. సూపర్ రెస్పాన్స్ దక్కించుకొని ట్రెండ్ అవుతోంది. అయితే.. హిందీతో పాటు తెలుగు, తమిళ, మలయాళం, కన్నడ భాషలలో రిలీజ్ అవుతున్న ఈ సినిమా.. అక్టోబర్ 20న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. కాగా.. తాజాగా రిలీజ్ చేసిన టీజర్.. ఒక్కసారిగా అందరి మైండ్ బ్లాక్ చేస్తూ వావ్ అనిపించుకుంది. కానీ.. ఒక్క డార్లింగ్ ప్రభాస్ ఫ్యాన్స్ ని మాత్రం కాసేపు షాక్ కి గురి చేసిందని సినీ వర్గాలలో టాక్ నడుస్తోంది.

మరి గణపత్ టీజర్ చూసి.. డార్లింగ్ ఫ్యాన్స్ కంగారు పడే అవసరం ఏముంది? అంటారా.. అదే విషయంలోకి వెళ్దాం. గణపత్ టీజర్ చూస్తే.. ఎవరికైనా మైండ్ లో ఒక సెకండ్ ప్రభాస్ నటిస్తున్న ‘కల్కి 2898 AD’ వచ్చి పోతుంది. అందుకు కారణం.. ఈ రెండు సినిమాల కథలు.. క్యారెక్టర్స్.. ఒకేలా ఉండటం. ముఖ్యంగా ఈ రెండు సినిమాలు ఫ్యూచర్ బేస్ చేసుకొని తెరకెక్కుతున్నాయి. గణపత్ టీజర్ లో గమనిస్తే.. కథ 2070 AD లో మొదలవుతుంది. అప్పటికి తిండి కోసం కొట్టుకునే పరిస్థితిని చూపిస్తూ.. జనాలపై జాలి, దయ లేని చెడు పై పోరాటం చేసేందుకు ఓ హీరో పుడతాడు అని చూపించారు.

కట్ చేస్తే.. ప్రభాస్ కల్కి టీజర్ లో కూడా.. ఎక్కడా జనాలకు బతుకుపై ఆశలు లేకుండా చీకటి రూపంలో చెడు కమ్మేసినప్పుడు.. కల్కి అవతారంలో సూపర్ హీరో వస్తాడని చూపించారు. భవిష్యత్ లో మనుషుల బానిస బ్రతుకులకు కల్కి చెడుని అంతం చేసి ఎలా విముక్తి కలిగించాడు? అనే విధంగా నాగ్ అశ్విన్ ప్రెజెంట్ చేశాడు. ఆ లెక్కన.. ఇప్పుడు కల్కి, గణపత్ రెండూ చెడుపై యుద్ధం చేసే వీరుల కథలే. అందులో ప్రభాస్ కల్కి, ఇందులో టైగర్ గణపత్. అందులో ప్రభాస్ తో పాటుగా దీపికా, అమితాబ్ కనిపించగా.. ఇందులో టైగర్ కి తోడుగా కృతిసనన్, అమితాబ్ కనిపిస్తున్నరు. ఈ తేడాలు టీజర్ లో ఈజీగా అర్ధమవుతున్నాయి.

ఇవేగాక కల్కి పోస్టర్ బ్యాక్ గ్రౌండ్.. గణపత్ టీజర్ లో చూపిన బ్యాక్ గ్రౌండ్, నాటి వాతావరణం, టైమ్ లైన్, విజువల్స్, ఆయుధాలు, యాక్షన్ సీక్వెన్స్ లు.. అన్ని దాదాపుగా ఒకే విధంగా ఉన్నాయని అనిపించే ఫీల్ కలుగుతుంది. కానీ.. రెండూ సూపర్ హీరో కాన్సెప్ట్ లతో వస్తున్నా.. స్క్రీన్ ప్లే, నేరేషన్, కథలో మలుపులు, విజువల్స్ వేరుగా ఉంటాయని తెలుస్తుంది. ఇదిలా ఉండగా.. కల్కి వచ్చే ఏడాది రిలీజ్ కానుండగా, గణపత్ ఈ ఏడాది దసరా సందర్బంగా అక్టోబర్ 20న రిలీజ్ అవుతోంది. గణపత్ మూవీని వికాస్ బల్ తెరకేక్కించారు. ఈయన గతంలో హృతిక్ రోషన్ తో ‘సూపర్ 30’ తీశారు. మరి ఈసారి గణపత్ తో ఎలాంటి మ్యాజిక్ చేస్తారో చూడాలి. ఇక కల్కి, గణపత్ టీజర్స్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.