iDreamPost
android-app
ios-app

గేమ్ చేంజర్ నుంచి కియారాకు బర్త్ డే గిఫ్ట్

  • Published Jul 31, 2024 | 11:20 AM Updated Updated Jul 31, 2024 | 11:20 AM

Game Changer: రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్ ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా.. అనే అందరూ ఎదురుచూస్తున్నారు. మొదటి నుంచి ఈ సినిమా గురించి రకరకాల డిస్కషన్స్ నడుస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలో తాజాగా ఈ సినిమా నుంచి మరొక ఇంట్రెస్టింగ్ అప్ డేట్ రిలీజ్ అయింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

Game Changer: రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్ ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా.. అనే అందరూ ఎదురుచూస్తున్నారు. మొదటి నుంచి ఈ సినిమా గురించి రకరకాల డిస్కషన్స్ నడుస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలో తాజాగా ఈ సినిమా నుంచి మరొక ఇంట్రెస్టింగ్ అప్ డేట్ రిలీజ్ అయింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

  • Published Jul 31, 2024 | 11:20 AMUpdated Jul 31, 2024 | 11:20 AM
గేమ్ చేంజర్ నుంచి కియారాకు బర్త్ డే గిఫ్ట్

రామ్ చరణ్ , శంకర్ కాంబినేషన్ లో వస్తున్న గేమ్ చేంజర్ సినిమాపై.. ఇప్పటివరకు చాలానే అప్ డేట్స్ వచ్చాయి. రాజమౌళి దర్శకత్వంలో నటించిన తర్వాత.. రామ్ చరణ్ పై అందరికి అంచనాలు పెరిగిపోయాయి. ఈ క్రమంలో ఇప్పుడు రాబోతున్న గేమ్ చేంజర్ పై కూడా అదే రేంజ్ లో అంచనాలు కొనసాగుతున్నాయి. ఇక ఈ సినిమాలో రామ్ చరణ్ కు జోడిగా కియారా అద్వానీ నటిస్తున్న సంగతి తెలిసిందే. సాధారణంగా నటి నటుల బర్త్ డేస్ రోజున వారి కొత్త సినిమాలకు సంబంధిచిన లుక్స్ ను రివీల్ చేయడం ఈ మధ్య ట్రెండ్ అయిపోయింది. ఈ క్రమంలో తాజాగా గేమ్ చేంజర్ సినిమా నుంచి కియారా లుక్స్ ను రివీల్ చేశారు మేకర్స్. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

ఈరోజు కియారా అద్వానీ పుట్టిన రోజు సందర్బంగా.. హ్యాపీ బర్త్ డే కియారా అంటూ గేమ్ చేంజర్ మూవీ నుంచి ఆమె లుక్ ను రివీల్ చేశారు మేకర్స్ . ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన ప్రతి అప్ డేట్ ను సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు అభిమానులు. ఇక ఇప్పుడు ఈ మూవీకి సంబంధించి విడుదల చేసిన కియారా పోస్టర్ ను కూడా ట్రెండ్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాపై అందరికి భారీ అంచనాలు పెరిగిపోయాయి. ఇక లేటెస్ట్ గా ఈ సినిమాకు సంబంధించిన ఓ సాంగ్ అప్ డేట్ కూడా బాగానే వైరల్ అయింది. చూడబోతుంటే చరణ్ తో శంకర్ ఎదో గట్టిగానే ప్లాన్ చేసాడనిపిస్తుంది. మరి ఈ మూవీ అందరి అంచనాలను అందుకుంటుందో లేదో చూడాలి. అయితే మూవీ రిలీజ్ డేట్ పై కూడా మేకర్స్ త్వరలోనే క్లారిటీ ఇవ్వనున్నారని సమాచారం.

ఇక కియారా విషయానికొస్తే.. 2016లో వచ్చిన ధోనీ బయోపిక్ ఎమ్మెస్ ధోనీ : ది అన్‌టోల్డ్ స్టోరీ మూవీలో ఈ అమ్మడు నటించింది. ఆ తర్వాత తెలుగులో మహేష్ కు జోడిగా భరత్ అనే నేను మూవీతో తెలుగులో ఎంట్రీ ఇచ్చింది. ఈ క్రమంలోనే రామ్ చరణ్ కు జోడిగా వినయ విధేయ రామ మూవీలో నటించి.. మళ్ళీ ఇన్నాళ్లకు అదే హీరోతో జత కట్టింది. ఇక ఈ సినిమాతో పాటు ఆమె ఎన్టీఆర్ నటిస్తున్న వార్ -2 మూవీలో కూడా మెయిన్ లీడ్ లో నటిస్తుంది. సో ప్రస్తుతానికి ఈ అమ్మడు భారీ ప్రాజెక్ట్స్ తో బిజీ బిజీగా ఉంది. ఒకవేళ అనుకున్న విధంగా గేమ్ చేంజర్ హిట్ కొట్టేస్తే మాత్రం.. రానున్న రోజుల్లో ఈ అమ్మడికి వరుస సినిమాలు క్యూ కట్టడం ఖాయం. గేమ్ చెంజర్ మూవీ ఎలాంటి రిజల్ట్ ను అందిస్తుందో చూడాలి. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.