iDreamPost
android-app
ios-app

Gaami: ‘గామి’కి భారీ ఓపెనింగ్స్.. విశ్వక్​సేన్ మూవీ ఫస్ట్‌ డే ఎంత వసూలు చేసిందంటే..?

  • Published Mar 09, 2024 | 7:46 AM Updated Updated Mar 09, 2024 | 8:51 AM

మాస్​ కా దాస్ విశ్వక్​సేన్ యాక్ట్ చేసిన ‘గామి’ మహాశివరాత్రి పర్వదినం కానుకగా శుక్రవారం విడుదలైంది. ఈ మూవీ ఫస్ట్ డే కలెక్షన్స్ ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

మాస్​ కా దాస్ విశ్వక్​సేన్ యాక్ట్ చేసిన ‘గామి’ మహాశివరాత్రి పర్వదినం కానుకగా శుక్రవారం విడుదలైంది. ఈ మూవీ ఫస్ట్ డే కలెక్షన్స్ ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

  • Published Mar 09, 2024 | 7:46 AMUpdated Mar 09, 2024 | 8:51 AM
Gaami: ‘గామి’కి భారీ ఓపెనింగ్స్.. విశ్వక్​సేన్ మూవీ ఫస్ట్‌ డే ఎంత వసూలు చేసిందంటే..?

మాస్ కా దాస్ విశ్వక్​సేన్ హీరోగా నటించిన కొత్త చిత్రం ‘గామి’. కార్తీక్ కల్ట్ క్రియేషన్స్, వీ సెల్యులాయిడ్ బ్యానర్స్​ మీద కార్తీక్ సబరీష్ ఈ మూవీని నిర్మించారు. విద్యాధర్ రావు కగిత దర్శకత్వంలో రూపొందించిన ‘గామి’.. మహాశివరాత్రి పర్వదినం కానుకగా శుక్రవారం బిగ్ స్క్రీన్స్​లో విడుదలైంది. ఇందులో చాందినీ చౌదరి, దయానంద్ రెడ్డి తదితరులు కీలక పాత్రల్లో కనిపించారు. మార్నింగ్ షో నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ‘గామి’ భారీ ఓపెనింగ్స్ రాబట్టింది. ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ రెమ్యూనరేషన్స్​తో పాటు వీఎఫ్​ఎక్స్, ఇతర ఖర్చులతో కలసి ఈ మూవీ బడ్జెట్ రూ.24 కోట్లు అయినట్లు తెలుస్తోంది. అయితే మంచి బజ్ నెలకొనడం, టాక్ కూడా బాగుండటంతో సానుకూలమైన బాక్సాఫీస్ జర్నీతో వసూళ్లు సాధించే అవకాశం ఏర్పడింది. ఈ చిత్రం డే 1 కలెక్షన్స్ ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

రిలీజ్​కు ముందు బాగా ప్రమోట్ చేయడం, టీజర్, ట్రైలర్స్ సరికొత్తగా ఉండటంతో ‘గామి’ ఆడియెన్స్​కు బాగా కనెక్ట్ అయింది. దీంతో థియేటర్లలో మంచి ఆక్యుపెన్సీ నమోదైంది. ఈ చిత్రం మార్నింగ్ షోకు 50 శాతం, మ్యాట్నీకి 60 శాతం, ఫస్ట్ షోకు 50 శాతం, సెకండ్ షోకు 55 శాతం ఆక్యుపెన్సీ నమోదవడం గమనార్హం. కలెక్షన్స్ విషయానికి వస్తే.. ఓవర్సీస్​లో ప్రీమియర్స్, మొదటి రోజు వసూళ్లు కలిపి 250కే డాలర్స్ అంటే భారత కరెన్సీలో రూ.1.7 కోట్లు కలెక్ట్ చేసిందని తెలుస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ ఫిల్మ్ రూ.2 కోట్లకు పైగా, కర్ణాటకతో పాటు రెస్టాఫ్​ ఇండియాలో కలుపుకొని రూ.50 లక్షలు వసూలు చేసిందని ట్రేడ్ టాక్. మొత్తంగా ఈ సినిమా ఫస్ట్ డే రూ.4.5 కోట్ల మేర కలెక్షన్స్ రాబట్టిందని సమాచారం.

‘గామి’ ఫస్ట్ డే ఆక్యుపెన్సీ విషయానికి వస్తే.. వరంగల్​లో ఎక్కువ మంది ఈ చిత్రాన్ని చూశారు. అక్కడ విశ్వక్ మూవీకి అత్యధికంగా 70 శాతం ఆక్యుపెన్సీ నమోదైంది. ఆ తర్వాత హైదరాబాద్​లో 60 శాతం, కాకినాడలో 60 శాతం, విజయవాడలో 55 శాతం, గుంటూరులో 50 శాతం ఆక్యుపెన్సీ నమోదు చేసింది. ఇక, ‘గామి’కి వరల్డ్​వైడ్​గా మంచి బిజినెస్ జరిగింది. ఈ సినిమాకు సంబంధించిన నైజాం రైట్స్ రూ.3.5 కోట్లు, సీడెడ్ రూ.1.4 కోట్లు, ఆంధ్రా థియేట్రికల్ రైట్స్ రూ.3.5 కోట్ల మేర జరిగిందని ట్రేడ్ సమాచారం. ఓవర్సీస్​తో కలుపుకొని ఓవరాల్​గా ఈ సినిమాకు రూ.11 కోట్ల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిందని తెలుస్తోంది. ఫస్ట్ డేనే చాలా మటుకు రికవరీ అవడంతో వీకెండ్​లోనే ‘గామి’ హిట్ స్టేటస్ తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి.. విశ్వక్ ‘గామి’ని మీరు చూసినట్లయితే ఎలా అనిపించిందో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: పుష్ప 2లో అనసూయ అరాచకం.. సుకుమార్ అసలు ప్లాన్ ఏంటంటే?