iDreamPost
android-app
ios-app

వీడియో: సైంధవ్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఫన్నీ ఇన్సిడెంట్.. కెమెరామెన్ పై పొగడ్తలు

  • Published Jan 09, 2024 | 3:29 PM Updated Updated Jan 09, 2024 | 3:29 PM

ఈ సంక్రాంతి బరిలో వస్తోన్న చిత్రాల్లో విక్టరీ వెంకటేష్ సైంధవ్ కూడా ఒకటి. జనవరి 13న థియేటర్లలోకి రాబోతున్న ఈ మూవీలో ఆర్య, నవాజుద్దిన్ సిద్దిఖీ కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. ఈ మూవీ విడుదల సందర్భంగా ఇటీవల ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.

ఈ సంక్రాంతి బరిలో వస్తోన్న చిత్రాల్లో విక్టరీ వెంకటేష్ సైంధవ్ కూడా ఒకటి. జనవరి 13న థియేటర్లలోకి రాబోతున్న ఈ మూవీలో ఆర్య, నవాజుద్దిన్ సిద్దిఖీ కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. ఈ మూవీ విడుదల సందర్భంగా ఇటీవల ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.

  • Published Jan 09, 2024 | 3:29 PMUpdated Jan 09, 2024 | 3:29 PM
వీడియో: సైంధవ్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఫన్నీ ఇన్సిడెంట్.. కెమెరామెన్ పై పొగడ్తలు

కుటుంబ కథా చిత్రాల కథానాయకుడిగా, మహిళ అభిమానులను ఎక్కువగా సంపాదించుకున్న నటుడిగా ముద్ర పడ్డారు విక్టరీ వెంకటేష్. కలియుగ పాండవులు నుండి మంచి సినిమాలు అందిస్తున్న వెంకీ మామ.. ఇప్పుడు వయస్సుకు తగ్గ పాత్రలు చేస్తూ మెప్పిస్తున్నాడు.ఈ సంక్రాంతికి కూడా సైంధవ్ మూవీతో రాబోతున్నాడు. ఇది ఆయన 75వ సినిమా. హిట్ మూవీస్ దర్శకుడు శైలేష్ కొలను తెరకెక్కిస్తున్నాడు. గత ఏడాది రానా నాయుడు వెబ్ సిరీస్‌తో మహిళా ప్రేక్షకుల హృదయాలను హర్ట్ చేసిన వెంకటేష్.. ఆ లెక్కలు సరిచేసుందుకు సైంధవ్ చిత్రంతో సిద్ధమయ్యాడు. జనవరి 13న ఈ మూవీ విడుదల కాబోతుంది. ఈ మూవీలో శ్రద్దా శ్రీనాథ్, రుహనీ శర్మ హీరోయిన్లుగా నటిస్తుండగా.. ఆర్య, నవాజుద్దిన్ సిద్దిఖీ కీలక పాత్రల్లో కనిపిస్తున్నారు. ఈ మూవీ విడుదల సందర్భంగా ఆదివారం వైజాగ్‌లో గ్రాండ్‌గా ఈవెంట్ నిర్వహించారు.

ఈ సందర్భంగా ఓ ఆసక్తికరమైన, ఫన్నీ సంఘటన చోటుచేసుకుంది. ఈవెంట్ జరుగుతుండగా.. వెంకీ సినిమాలో ఘర్షణ మూవీలోని చెలియ చెలియ అనే సాంగ్‌ను వేదికపై ఆలపిస్తున్నారు సింగర్స్. హీరో, హీరోయిన్లు అందరూ వేదికను చూస్తున్నారు. అంతలో ఈ ప్రోగ్రాం షూట్ చేస్తున్న కెమెరా మెన్ ఒక్కసారిగా తన ఫోకస్ మొత్తం ఓ అపార్ట్ మెంట్ లో చిందులేస్తున్న యువతిపైకి మళ్లించారు. ఇదే పాటకు ఆమె చాలా జోష్‌గా చిందులేస్తుంది. ఆమె వైపు జూమ్ చేసి.. లైట్ తిప్పినా కూడా పట్టించుకోలేదు ఆ అమ్మాయి.. పాటలో లీనమై డ్యాన్స్ వేస్తూనే ఉంది. ఇదంతా ఈవెంట్ స్క్రీన్లపై కనిపించింది. దీంతో వెంకీ, శ్రద్ధా శ్రీనాధ్ కూడా ఆ అపార్ట్ మెంట్ వైపు తలతిప్పి చూశారు. తీరా అది చాలా దూరంలో ఉంది.

అయితే ఆమె చేసిన డ్యాన్సుకు ఫిదా అయిపోయారు. కాసేపు నవ్వుకున్నారు అక్కడి ప్రేక్షకులు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో చక్కర్లు కొడుతుంది. క్రికెట్ స్టేడియంలో మాత్రమే ఇలాంటి అద్భుతాలను తమ కెమెరాలో బంధిస్తూ ఉంటారు కెమెరా మెన్లు. కానీ ఓ ఈవెంట్‌లో ఇలా భవనాలు, నివాస స్థలాలపై ఫోకస్ చాలా అరుదు.దీంతో ఆమె కెమెరామెన్ ను పొగడ్తలతో ముంచెత్తుతున్నారు నెటిజన్లు.ఆ కెమెరామెన్ పేరు రవి అని తెలుస్తోంది. ఏమీ గుండెరా వాడిది.. ఆ గుండె బతకాలి అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అంత లాంగ్ ఎలా జూమ్ చేశావురా అంటూ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఆ అపార్ట్ మెంట్ ఎక్కడ.. అందులో నాకు ప్లాట్ కావాలంటూ రాశారు మరో నెటిజన్. ఏదీ ఏమైనప్పటికీ.. ఆ అమ్మాయితో పాటు కెమెరామెన్ పై ప్రశంసల వర్షం కురుస్తుంది. ఈ వీడియో మీరు చూసి మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by vaari devuda (@vaari_devuda)

Jojobet GirişHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetjojobetcasibom girişCasibomgrandpashabet