రజినీకాంత్, కమల్ హాసన్, సల్మాన్ ఖాన్ వీళ్లకు దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచంలోనే మంచి ఫాలోయింగ్ ఉంది. వీళ్ల సినిమాలు వస్తున్నాయి అంటే నెలకొనే సందడి అంతా ఇంతా కాదు. టైటిల్ అనౌన్స్మెంట్ నుంచి.. రిలీజ్ వరకు ఎప్పుడెప్పుడు సినిమా వస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటారు. వీళ్ల చాలా మందంకి రోల్ మోడల్స్ మాత్రమే కాదు.. దేవుళ్లతో సమానం. అంత గొప్ప అభిమానులు వీరికి ఉన్నారు కాబట్టే వాళ్లని తేలిగ్గా మోసం చేస్తున్నారు. ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ఈ ముగ్గురు స్టార్లు బాధితులే. అవునండి ఈ ముగ్గురు స్టార్ హీరోలు నేరుగా కాకపోయినా వీళ్ల పేరు మీద జరగిన మోసల వల్ల బాధితులుగా మారారు.
దేశవ్యాప్తంగా రజినీకాంత్- కమల్- సల్మాన్ ఖాన్ లకు లక్షల్లో అభిమానులు ఉన్నారు. వాళ్ల అంతటి స్టార్ హీరోలు, రోల్ మోడల్స్ కాబట్టే వారి పేరు అడ్డు పెట్టుకుని విచ్చలవిడిగా మోసాలు చేస్తున్నారు. మరీ ముఖ్యంగా ఈ ముగ్గురు పేర్లమీదే ఈ మోసాలు ఎక్కువ జరిగాయి. ఇటీవల సల్మాన్ ఖాన్ పేరిట కొన్ని ఈమెయిల్స్ వచ్చిన విషయం తెలిసిందే. సల్మాన్ ఖాన్ నిర్మించబోయే సినిమాలో అవకాశాలు ఉన్నాయని మెయిల్స్ పంపారు. సెలక్షన్స్ కోసం వారి ఫొటోలతో పాటు కొంత మొత్తం నగదు కూడా పంపాలంటూ చెప్పారు. అయితే ఈ వ్యవహారంపై సల్మాన్ ఖాన్ మేనేజర్ వెంటనే స్పందించాడు. అలాంటి మెయిల్స్ గురించి నమ్మొద్దు అంటూ క్లారిటీ ఇచ్చాడు.
ఈ లిస్ట్ లో రజినీకాంత్, కమల్ హాసన్ పేర్లు కూడా ఉన్నాయి. రజినీకాంత్ పేరిట ఫౌండేషన్ ఉన్న విషయం తెలిసిందే. ఈ ఫౌండేషన్ పేరిట మోసాలకు తెరలేపారు. 2 వేల మంది రిజిస్టర్ చేసుకుంటే లక్కీ డిప్ ద్వారా వారిలో 200 మందికి కాస్ట్లీ గిఫ్ట్స్ ఇస్తామంటూ మోసం చేశారు. ఇప్పటికే కోట్ల రూపాయలు వసూలు చేశారంట. ఈ విషయంపై ట్రస్టీ శివరామకృష్ణన్ పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చారు. అలాగే కమల్ హాసన్ పేరిటి కూడా ఇలాంటి మోసాలు జరిగాయి.
కమల్ హాసన్ చేతినిండా ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. హీరోగానే కాకుండా నిర్మాతగా కూడా సినిమాలు చేస్తున్నారు. తాజాగా కమల్ హాసన్ పేరిట కేటుగాళ్లు మోసాలకు పాల్పడ్డారు. కమల్ కు రాజ్ కమల్ ఫిలిమ్స్ బ్యానర్ ఉన్న విషయం అందరికీ తెలుసు. ఇప్పుడు ఆ లోగో పేరిట నటీనటులు కావాలంటూ ప్రచారం చేశారు. అయితే ఈ విషయం తెలుసుకున్న ప్రొడక్షన్ కంపెనీ వెంటనే స్పందించింది. తాము ఎలాంటి కాస్టింగ్ కాల్ చేయలేదని క్లారిటీ ఇచ్చింది. కేవలం రోజుల వ్యవధిలోనే ఈ ముగ్గురు స్టార్ల పేరిట మోసాలు జరిగాయి.. మోసం చేసేందుకు పథకాలు రచించారు. అందుకే స్టార్ల పేరిట ఏ ప్రచారాలు జరిగినా ఒకటికి రెండు సార్లు ధ్రువీకరించుకున్న తర్వాతే స్పందించాలని కోరారు. ఏదైనా ప్రకటన చూస్తే తమ అధికారిక సోషల్ మీడియా హ్యాండిల్స్ కూడా చెక్ చేసుకోవాలంటూ సూచిస్తున్నారు.