ప్యాడ్ పట్టుకున్న ఈ నూనుగు మీసాల కుర్రాడు ఎవరో తెలుసా..? అస్సలు నమ్మలేరు

ఈ ఫోటోలో దర్శక దిగ్గజాలతో ప్యాడ్ పట్టుకుని ఉన్న ఈ నూనుగు మీసాల కుర్రాడు ఎవరో తెలుసా..? చెబితే అస్సలు నమ్మలేరు. అసిస్టెంట్ డైరెక్టర్ నుండి డైరెక్టర్ అయ్యి.. ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్టుగా రాణిస్తున్నాడు. ఎక్కువగా తండ్రి పాత్రలో కనిపిస్తున్నారు. ఇంతకు ఆయన ఎవరంటే..?

ఈ ఫోటోలో దర్శక దిగ్గజాలతో ప్యాడ్ పట్టుకుని ఉన్న ఈ నూనుగు మీసాల కుర్రాడు ఎవరో తెలుసా..? చెబితే అస్సలు నమ్మలేరు. అసిస్టెంట్ డైరెక్టర్ నుండి డైరెక్టర్ అయ్యి.. ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్టుగా రాణిస్తున్నాడు. ఎక్కువగా తండ్రి పాత్రలో కనిపిస్తున్నారు. ఇంతకు ఆయన ఎవరంటే..?

మెగా ఫోన్ పట్టుకుని యాక్షన్ చెప్పాల్సిన దర్శకులు కొంత మంది.. ఈ మధ్య కాలంలో యాక్టర్లుగా మారిపోతున్నారు. ఆనాటి భారతీ రాజా నుండి నేటి తరుణ్ భాస్కర్ వరకు డైరెక్షన్ చేస్తూనే మరో వైపు నటనలోనూ అక్షరాలు దిద్దుతున్నారు. ఇదిగో ఈ ఫోటోలో రైట్ సైడ్ కార్నర్‌లో కనిపిస్తున్న ఈ నూనుగు మీసాల కుర్రాడిని గుర్తుపట్టారా..? అతడు కూడా అంతే.. డైరెక్టర్ నుండి ఈ రోజు బిజీయెస్ట్ క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారారు. ఈ ఫోటోలో దిగ్గజ నటులు, దర్శకులు ఉండటం విశేషం. దివంగత దర్శకులు దాసరి నారాయణ రావు, కోడి రామకృష్ణ, కాస్ట్యూమ్ కృష్ణ, దిగ్గజ కమెడియన్లు బ్రహ్మానందం, బాబు మోహన్ కనిపిస్తున్నారు. వీరి మధ్యలో అత్యతం వినమ్రంగా చేతిలో ప్యాడ్ పట్టుకుని కనిపిస్తున్న ఈ కుర్రాడు ప్రముఖ దర్శకుడు.. ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్టుగా రాణిస్తున్న సి.దేవీ ప్రసాద్.

సినిమాలపై పిచ్చితో చదువు మధ్యలోనే ఆపేశాడు దేవీ. గుంటూరు జిల్లాలో పుట్టిన ఆయన..ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. అసిస్టెంట్ డైరెక్టర్‌గా మొదలైన ఆయన ప్రస్థానం.. ఆ తర్వాత దర్శకుడిగా.. ఇప్పుడు నటుడిగా మారింది. కామెడీ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచాడు దేవీ ప్రసాద్. కోడి రామకృష్ణ వద్ద సహాయ దర్శకుడిగా కెరీర్ స్టార్ చేశాడు. అలాగే చిన్న చిన్న రోల్స్ చేసేవాడు. ఆ తర్వాత దర్శకుడిగా మారి.. 2002లో శ్రీకాంత్ ఆడుతూ పాడుతూ మూవీతో మెగాఫోన్ పట్టాడు.  ఈ చిత్రం మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. ఆ తర్వాత ఆర్యన్ రాజేష్ హీరోగా లీలా మహాల్ సెంటర్ మూవీ తెరకెక్కించగా ఇది హిట్ అందుకుంది. పాండు మూవీ అంతగా ఆకట్టుకోలేదు. ఆ తర్వాత బ్లేడ్ బాజ్జీ కమర్షియల్ హిట్. సునీల్ హీరోగా మిస్టర్ పెళ్లికొడుకు, కెవ్వు కేక వంటి చిత్రాలు తెరకెక్కించాడు.

ప్రముఖ దర్శకులు ఈవీవీ సత్యనారాయణ ఇద్దరి కొడుకుల్ని డైరెక్ట్ చేశాడు దేవీ. ఎక్కువగా కామెడీ చిత్రాలను రూపొందించిన దేవీ ప్రసాద్.. మెగాఫోన్‌కు రెస్ట్ ఇచ్చి.. పూర్తి స్థాయిలో నటుడిగా మారాడు. నీది నాది ఓకే కథ చిత్రంలో శ్రీ విష్ణుకు తండ్రిగా నటించాడు. ఈ సినిమా ఈ ఇద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు చాలా రియాలిటీగా ఉంటాయి. అక్కడ నుండి వరుసగా ఆఫర్లు వచ్చాయి. తండ్రి క్యారెక్టర్లకు కేరాఫ్ అడ్రస్ అయ్యాడు. ఎక్కడ పడ్డాడో అక్కడే లేవడం స్టార్ట్ చేశాడాయన. దర్శకుడిగా వెనకడుగు వేసినప్పటికీ.. నటుడిగా సక్సీడ్ అవుతున్నాడు. జయమ్మ పంచాయితీ, నాందీ, కళ్యాణం కమనీయం.. ఇటీవల వచ్చిన యేవమ్, శివం భజే చిత్రాల్లో కనిపించాడు ఈ వర్సటైల్ నటుడు దేవీ ప్రసాద్. దర్శకుడే కాదు ఆర్టిస్టు కూడానూ.

Show comments