iDreamPost
android-app
ios-app

మిమ్మల్ని బాధ పెట్టి ఉంటే నన్ను క్షమించండి.. ప్రముఖ నటుడు తోటపల్లి మధు

  • Published May 03, 2024 | 4:35 PM Updated Updated May 03, 2024 | 5:59 PM

ప్రముఖ టాలీవుడ్ రచయిత, నటుడు ప్రముఖ దర్శకుడిపై చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి. దీంతో ఆయన అందరికీ క్షమాపణలు చెబుతూ వీడియో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.

ప్రముఖ టాలీవుడ్ రచయిత, నటుడు ప్రముఖ దర్శకుడిపై చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి. దీంతో ఆయన అందరికీ క్షమాపణలు చెబుతూ వీడియో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.

  • Published May 03, 2024 | 4:35 PMUpdated May 03, 2024 | 5:59 PM
మిమ్మల్ని బాధ పెట్టి ఉంటే నన్ను క్షమించండి.. ప్రముఖ నటుడు తోటపల్లి మధు

తోటపల్లి మధు టాలీవుడ్ లో ప్రముఖ రైటర్ గా, నటుడిగా కొనసాగుతున్నారు. కోడి రామకృష్ణ దగ్గర రైటర్ గా  కూడా పని చేశారు. 1984లో చిరంజీవి హీరోగా వచ్చిన దేవాంతకుడు మూవీతో రచయితగా కెరీర్ ప్రారంభించారు. అయితే ఇటీవల ఈయన పలువురు సెలబ్రిటీల మీద ఘాటు వ్యాఖ్యలు చేశారు. వారి పర్సనల్ విషయాల గురించి మాట్లాడారు. ఎన్టీఆర్, సావిత్రి, శ్రీదేవి, కోడి రామకృష్ణ, ఎంజీఆర్, నూతన ప్రసాద్, శోభన్ బాబు వంటి సెలబ్రిటీల మీద చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. లక్షలు, కోట్లాది మంది ఆరాధించే అభిమాన హీరోయిన్స్ మీద, అభిమాన హీరోలు, దర్శకుల మీద ఆయన చేసిన కామెంట్స్ అభిమానులని బాధించాయి.

శ్రీదేవికి తిండి తినాలంటే భయమని.. 20 ఏళ్ల వయసులో ఎలా ఉండాలో అలా ఉండాలని అనుకునేదని.. రోజుకు లక్ష రూపాయలు ఖర్చు పెట్టేదని సంచలన వ్యాఖ్యలు చేశారు. మహానటి సావిత్రి మీద కూడా ఆయన చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి. మద్యం తాగి చనిపోవడానికి సావిత్రికి 14 నెలలు పడితే.. శ్రీదేవికి 14 నిమిషాలు పట్టిందని అన్నారు. తాగుడు వల్లే వీళ్ళు చనిపోయారని.. చాలా మంది తాగి చనిపోయారని కామెంట్స్ చేశారు. టాలీవుడ్ దర్శకులు కోడి రామకృష్ణ మీద కూడా ఆయన కొన్ని ఇబ్బందికర వ్యాఖ్యలు చేశారు. దీంతో నెటిజన్స్, ఫ్యాన్స్ స్పందిస్తున్నారు. సెలబ్రిటీలు కూడా ఈయన వ్యాఖ్యల పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మన మధ్య లేని వ్యక్తుల గురించి ఇలా కామెంట్స్ చేయడం తగదని ఫ్యాన్స్, నెటిజన్స్ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. చనిపోయిన వారి వ్యక్తిగత విషయాలను ఇప్పుడు మాట్లాడడం సరికాదని కామెంట్స్ చేస్తున్నారు.

దర్శకుడు కోడి రామకృష్ణకి చాలా మంది శిష్యులు ఉన్నారు. కోడి రామకృష్ణ శిష్యులతో పాటు చాలా మంది బాధపడ్డారు. తనకు కాల్ చేసి కోడి రామకృష్ణ మీద చేసిన వ్యాఖ్యల మీద స్పందించాలని కోరారు. స్పందించకపోతే చాలా ఇబ్బంది పడతామని ఫ్యాన్స్ అనడంతో ఆయన క్షమాపణలు చెబుతూ ఒక వీడియోని షేర్ చేశారు. కోడి రామకృష్ణ శిష్యులు, అలానే కోడి రామకృష్ణ కుటుంబ సభ్యులు తనను క్షమించాలని ఆ వీడియోలో కోరారు. తాను చేసిన వ్యాఖ్యలు ఎవరినైనా ఇబ్బంది పెట్టి ఉంటే.. ఎవరి మనోభావాలు అయినా దెబ్బ తిని ఉంటే దయచేసి తనను క్షమించాలని ఆయన వేడుకున్నారు. ప్రస్తుతం తోటపల్లి మధు చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈయన అనసూయ, సముద్రఖని నటించిన విమానం, రెక్కీ, శర్వానంద్ నటించిన శ్రీకారం, యాత్ర, నాని కృష్ణార్జున యుద్ధం, హైపర్ వంటి అనేక సినిమాల్లో నటించారు.

  • కోడి రామకృష్ణ మీద చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో కింద ఉంది చూడగలరు

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişCasibomgrandpashabet