P Krishna
Burglary at Film Director House: ఈజీ మనీ కోసం కొంతమంది ఎన్నో అక్రమాలకు పాల్పపడుతున్నారు. ఎదుటి వారిని మోసం చేసి డబ్బు గుంజుతున్నారు. ఎన్నో రకాల దందాలు చేస్తూ కోట్లు సంపాదిస్తున్నారు.
Burglary at Film Director House: ఈజీ మనీ కోసం కొంతమంది ఎన్నో అక్రమాలకు పాల్పపడుతున్నారు. ఎదుటి వారిని మోసం చేసి డబ్బు గుంజుతున్నారు. ఎన్నో రకాల దందాలు చేస్తూ కోట్లు సంపాదిస్తున్నారు.
P Krishna
ఈ మధ్య చాలామంది లగ్జరీ జీవితం గడిపేందుకు అక్రమ మార్గాల్లో వెళ్తున్నారు. దొంగతనాలు, డ్రగ్స్, అక్రమాయుధాల వ్యాపరం, స్మగ్లింగ్, హైటెక్ వ్యభిచారం ఇలా ఎన్నో రకాల దందాలకు పాల్పపడుతున్నారు. మాలీవుడ్ లో ప్రముఖ డైరెక్టర్ జోషి కి మంచి గుర్తింపు ఉంది. దాదాపు 80 సినిమాలకు పైగా ఆయన దర్శకత్వం వహించారు. ఇటీవల ఆయన తనయుడు అభిలాష్ సైతం దర్శకత్వ రంగంలోకి అడుగు పెట్టారు. మమ్ముట్టి తనయుడు దుల్కన్ సల్మాన్ నటించిన ‘కింగ్ ఆఫ్ కొత్తా’ మూవీ ద్వారా డైరెక్టర్ గా ఎంట్రీ ఇచ్చారు. తాజాగా దర్శకులు జోషీ ఇంట్లో భారీ చోరీ జరిగింది. సుమారో కోటికి పైగా డబ్బు, ఆభరణాలు దొంగతనం అయినట్లు వార్తలు వస్తున్నాయి. పూర్తి వివరాల్లోకి వెళితే..
మాటీవుడ్ లో స్టార్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న జోషీ ఇంట్లో పెద్ద ఎత్తున దొంగతనం జరిగింది. సుమారు కోటీ ఇరవై లక్షల సొత్త చోరీకి గురైనట్లు ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడు ఇర్ఫాన్ గా గుర్తించిన పోలీసులు అతన్ని కర్ణాటక పోలీసుల సహాయంతో ఉడిపి జిల్లాలో అరెస్ట్ చేశారు. సీసీటీవీలో రికార్డ్ అయిన వీడియోలో ఇర్ఫాన్ ఉపయోగించిన కారు నంబర్ క్లీయర్ గా కనిపించడంతో దాని ఆధారంగా పట్టుకున్నట్లు నగర పోలీస్ కమిషనర్ శ్యామ్ సుందర్ తెలిపారు. ఇర్ఫాన్ ఉపయోగించిన కారు వెనుక భాగంలో గ్రామ సర్పంచ్ అనే బోర్డు ఉందని పోలీసులు తెలిపారు.
ఇర్ఫాన్ పలు రాష్ట్రాలు తిరుగుతూ సంపన్నుల ఇళ్లను రెక్కీ నిర్వహించి పక్కా ప్లాన్ తో చోరీకీ పాల్పపడతారని పోలీసులు తెలిపారు. దొంగతనం చేసిన సొత్తు బీహార్ లోని పేద ప్రజలకు పంచుతున్నాడని వార్తలు వస్తున్నాయి.. కానీ దీనిపై స్పష్టమైన ఆధారాలు లేవని అంటున్నారు. తమ దృష్టిలో మాత్రం ఇర్ఫాన్ ఒక నిందితుడు అంటున్నారు. ఇర్ఫాన్ పై ఆరు రాష్ట్రాల్లో 19 కేసులు ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు. గత నెలలోనే జైలు నుంచి రిలీజ్ అయ్యాడు ఇర్ఫాన్. ప్రస్తుతం ఇర్ఫాన్ నుంచి కోటీ 20 లక్షల విలువైన బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. తమ దర్యాప్తులో ఇర్ఫాన్ ఏప్రిల్ 20 ఈ చోరీకి పాల్పపడినట్లు చెబుతున్నారు. ఆ సమయంలో జోషీ కుటుంబ సభ్యులు ఇంట్లోనే ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. తెల్లవారుజామున జగరడంతో వారంత గాఢ నిద్రలో ఉన్నట్లు సమాచారం. కేసు దర్యాప్తు కొనసాగుతుందని పోలీసులు తెలిపారు.