Nidhan
ఐపీఎల్లో అత్యంత భారీ ఫ్యాన్ బేస్ కలిగిన జట్లలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఒకటి. ఆర్సీబీ అంటే చాలా మందికి ఇష్టం.
ఐపీఎల్లో అత్యంత భారీ ఫ్యాన్ బేస్ కలిగిన జట్లలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఒకటి. ఆర్సీబీ అంటే చాలా మందికి ఇష్టం.
Nidhan
ఇండియన్ ప్రీమియర్ లీగ్ స్టార్ట్ అయి 16 ఏళ్లు కావొస్తోంది. ఈ ప్రతిష్టాత్మక టోర్నమెంట్లో ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ చెరో ఐదు సార్లు విజేతగా నిలిచాయి. కోల్‌కతా నైట్ రైడర్స్ దగ్గర నుంచి సన్‌రైజర్స్ హైదరాబాద్ వరకు అన్ని టీమ్స్ కనీసం ఒక్కోసారి ఛాంపియన్స్‌గా నిలిచాయి. లక్నో సూపర్ జెయింట్స్ కొత్త జట్టు కాబట్టి దాన్ని మినహాయిస్తే ఒక్కసారి కూడా కప్ అందుకోని టీమ్స్‌లో ఒకటిగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఉంది. ఆర్సీబీకి కల్ట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇన్ని సీజన్లలో ఒక్కసారి కప్ నెగ్గకున్నా ఆ జట్టును ఎంకరేజ్ చేస్తూనే ఉన్నారు అభిమానులు. ఇంత లాయల్ ఫ్యాన్ బేస్ బహుశా ఏ టీమ్‌కూ లేకపోవచ్చు. అయితే ఈసారి కప్‌పై గురిపెట్టిన ఆర్సీబీ గెలుస్తామనే ధీమాతో ఉంది. కానీ ఆ టీమ పరువు తీశారో ఫిల్మ్ డైరెక్టర్.
ఆర్సీబీకి కప్ గెలిచేంత సీన్ లేదన్నాడు ఓ కన్నడ డైరెక్టర్. ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో యాంకర్ ఆయన్ను బెంగళూరు జట్టు ఫ్యూచర్ గురించి అడిగారు. ఆర్సీబీ గెలవొద్దని, ఒకవేళ నెగ్గితే ఆ టీమ్‌పై సెటైర్స్ వేయడానికి ఛాన్స్ దొరకదని అందరూ తనను అంటుంటారని యాంకర్ అన్నారు. ఈ నేపథ్యంలో ఈసారి ఆర్సీబీ భవిష్యత్తు ఎలా ఉండబోతోందని ఆ దర్శకుడ్ని ప్రశ్నించారు యాంకర్. దీనిపై డైరెక్టర్ బోల్డ్‌గా ఆన్సర్ ఇచ్చారు. తాను బెంగళూరు స్క్వాడ్‌ను చూశానని.. వచ్చే మూడేళ్ల వరకు మన టీమ్ గెలిచే ఛాన్సే లేదని స్పష్టం చేశారు. దీంతో యాంకర్ సహా అక్కడున్న మూవీ టీమ్ కూడా నవ్వుల్లో మునిగిపోయారు. ఆర్సీబీ ఫ్యూచర్ గురించి ప్రెడిక్ట్ చేస్తూ డైరెక్టర్ మాట్లాడిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
కన్నడ డైరెక్టర్ ఆర్సీబీ పరువు తీయడంపై సోషల్ మీడియాలో నెటిజన్స్ భిన్నంగా రియాక్ట్ అవుతున్నారు. అవును, బెంగళూరు కప్ కొట్టే ఛాన్సే లేదని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. అయితే మరికొందరు నెటిజన్స్ మాత్రం అలా ఎలా అంటారని.. ఆర్సీబీ గురించి అలా మాట్లాడటం సరికాదంటూ సీరియస్ అవుతున్నారు. సొంత జట్టు పరువు తీయడం ఏంటంటూ ఫైర్ అవుతున్నారు. కోహ్లీ, మ్యాక్స్‌వెల్, డుప్లెసిస్ లాంటి సూపర్ స్టార్లతో పాటు ఈసారి టీమ్‌లో చాలా మార్పులు చేశారని.. కాబట్టి ఈసాలా కప్ నమ్దే అంటున్నారు. టీమ్‌ను తక్కువ అంచనా వేయొద్దని.. టైమ్ కలిసొస్తే ఈసారి కప్ అందుకుంటుందని చెబుతున్నారు. తమకు బ్యాడ్ టైమ్ నడుస్తోందని.. ఎంత బాగా ఆడినా కప్ రాట్లేదని.. కానీ ఈసారి మాత్రం కథ మారుతుందని, కప్పు కల తీరుతుందని కామెంట్స్ చేస్తున్నారు. మరి.. ఆర్సీబీకి కప్ కొట్టేంత సీన్ లేదంటూ కన్నడ డైరెక్టర్ చేసిన వ్యాఖ్యలపై మీరేం అనుకుంటున్నారో కామెంట్ చేయండి.
ఇదీ చదవండి: IND vs ENG: ఇంగ్లండ్‌తో మూడో టెస్టు.. 4 మార్పులతో బరిలోకి భారత్!
Anchor: People keep telling me RCB shouldn’t win, cos if RCB win then they can’t mock them anymore. So what’s your future prediction, tell me.
Kannada Movie Director: I saw the squad, no chance of us winning for the next 3 years 😂pic.twitter.com/LUe2amt7wV
— CricketGully (@thecricketgully) February 13, 2024