iDreamPost
android-app
ios-app

Ram Charan: RC 16కి కొత్త టెన్షన్.. భారమంతా అతడి మీదే!

  • Published Jul 30, 2024 | 1:35 PM Updated Updated Jul 30, 2024 | 1:35 PM

చరణ్-బుచ్చిబాబు ప్రాజెక్ట్ RC 16కి కొత్త టెన్షన్ మెుదలైంది. ఈ విషయం కాస్త తెలియడంతో అభిమానులు ఆందోళన చెందుతున్నారు. మరి ఫ్యాన్స్ టెన్షన్ కు కారణం ఏంటి? ఆ వివరాల్లోకి వెళితే..

చరణ్-బుచ్చిబాబు ప్రాజెక్ట్ RC 16కి కొత్త టెన్షన్ మెుదలైంది. ఈ విషయం కాస్త తెలియడంతో అభిమానులు ఆందోళన చెందుతున్నారు. మరి ఫ్యాన్స్ టెన్షన్ కు కారణం ఏంటి? ఆ వివరాల్లోకి వెళితే..

  • Published Jul 30, 2024 | 1:35 PMUpdated Jul 30, 2024 | 1:35 PM
Ram Charan: RC 16కి కొత్త టెన్షన్.. భారమంతా అతడి మీదే!

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్-శంకర్ కాంబినేషన్ లో ‘గేమ్ ఛేంజర్’ అనే మూవీ వస్తోన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ క్రిస్మస్ కానుకగా థియేటర్లలోకి రానుందని నిర్మాత దిల్ రాజ్ స్వయంగా ప్రకటించారు. అయితే భారతీయుడు 2 మూవీ ఫలితం నిరాశపరచడంతో ఈ మూవీపై మెగాఫ్యాన్స్ కాస్త ఆందోళన చెందుతున్నారు. కానీ శంకర్-చరణ్ మాత్రం కన్ఫిడెంట్ గానే ఉన్నారు. ఇదిలా ఉండగా.. చరణ్-బుచ్చిబాబు ప్రాజెక్ట్ RC 16కి కొత్త టెన్షన్ మెుదలైంది. ఇప్పుడు భారమంతా అతడి మీదే ఉంది.

RC 16.. రామ్ చరణ్-బుచ్చి బాబు కాంబినేషన్ లో తెరకెక్కబోతున్న మూవీ. ఉత్తరాంధ్ర గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కన్న ఈ మూవీని బుచ్చిబాబు అద్భుతంగా రూపొందించబోతున్నట్లు తెలుస్తోంది. పీరియాడిక్ జానర్ లో డైరెక్టర్ ఈ కథను చెప్పబోతున్నాడని తెలుస్తోంది. ఇక ఈ మూవీకి ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నాడు. బుచ్చిబాబు ఏరికోరి మరీ రెహమాన్ నే తీసుకున్నాడు. అయితే ఇప్పుడు ఇదే మెగా ఫ్యాన్స్ లో టెన్షన్ క్రియేట్ చేసింది. రెహమాన్ తెలుగులో డైరెక్ట్ గా మ్యూజిక్ అందించిన ఏ చిత్రం కూడా కమర్షియల్ గా సక్సెస్ కాలేదు. అదీకాక గత కొన్ని సంవత్సరాలుగా లోకల్ సినిమాలకు అదిరిపోయే మ్యూజిక్ ఇవ్వలేదన్న విమర్శలు కూడా ఒకపక్క ఉన్నాయి. ఇప్పుడు ఇదే చరణ్ ఫ్యాన్స్ కు టెన్షన్.

అయితే ఏఆర్ రెహమాన్ తాజాగా ధనుష్ నటించిన ‘రాయన్’ మూవీకి అద్భుతమైన బ్యాగ్రౌండ్ స్కోర్ అందించాడు. ఈ చిత్రం భారీ ఓపెనింగ్స్ రాబట్టడంతో పాటుగా సక్సెస్ టాక్ ను తెచ్చుకుంది. రాయన్ విజయంలో రెహమాన్ బ్రాగ్రౌండ్ స్కోర్ కంట్రిబ్యూషన్ ఎక్కువ ఉందన్నది కాదనలేని సత్యం. తనపై వచ్చిన విమర్శలకు రాయన్ సక్సెస్ తో గట్టి కౌంటర్ ఇచ్చాడు. ఇప్పుడు RC 16 కథకు తగ్గట్లుగా రెహమాన్ మ్యూజిక్ అందించగలడని బుచ్చిబాబు బలంగా నమ్ముతున్నాడు. రాయన్ మూవీలాగే మాస్ అండ్ కల్ట్ రేంజ్ లో చరణ్ మూవీ ఉండబోతోంది. అందుకు తగ్గట్లుగానే రెహమాన్ సంగీతం అందించగలడని వీరి నమ్మకం. దాంతో ఇప్పుడు భారమంతా ఆస్కార్ విజేతపైనే ఉంది. ఇక ఈ మూవీలో చరణ్ జోడీగా బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ నటిస్తున్న విషయం తెలిసిందే.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetHoliganbetjojobet güncel girişcratosroyalbetganobetcasibomiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom