iDreamPost
android-app
ios-app

Prabhas: బ్యాన్ చేసిన చోటే ఇండస్ట్రీ హిట్ కొట్టాడు! ఇది సర్ ప్రభాస్ రేంజ్..

  • Published Jul 30, 2024 | 12:21 PM Updated Updated Jul 30, 2024 | 12:21 PM

పోగొట్టుకున్న చోటే వెతుక్కోవాలంటారు పెద్దలు. ఈ సామెతను నిజం చేస్తూ.. తన సినిమాను బ్యాన్ చేసిన దేశంలోనే తాజాగా ఇండస్ట్రీ హిట్ కొట్టి తన రేంజ్ ఏంటో తెలియజేశాడు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..

పోగొట్టుకున్న చోటే వెతుక్కోవాలంటారు పెద్దలు. ఈ సామెతను నిజం చేస్తూ.. తన సినిమాను బ్యాన్ చేసిన దేశంలోనే తాజాగా ఇండస్ట్రీ హిట్ కొట్టి తన రేంజ్ ఏంటో తెలియజేశాడు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..

Prabhas: బ్యాన్ చేసిన చోటే ఇండస్ట్రీ హిట్ కొట్టాడు! ఇది సర్ ప్రభాస్ రేంజ్..

ప్రభాస్.. ప్రస్తుతం పాన్ ఇండియా మూవీస్ కు కేరాఫ్ అడ్రస్ గా మారాడు. వరుసగా పాన్ ఇండియా మూవీస్ చేస్తూ.. బాక్సాఫీస్ బాద్ షా గా అవతరించాడు. అయితే డార్లింగ్ నటించిన ఓ సినిమాను అక్కడి దేశంలో బ్యాన్ చేశారు. కానీ ఇప్పుడు అదే దేశంలో కల్కి 2898 ఏడీ మూవీతో ఇండస్ట్రీ హిట్ కొట్టాడు. మరి బ్యాన్ చేసిన యంగ్ రెబల్ స్టార్ మూవీ ఏది? అది ఏ సినిమా? పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

కల్కి 2898 ఏడీ మూవీతో ప్రభాస్ సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. ఒక్క ఇండియాలోనే కాదు.. వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయిన అన్ని దేశాల్లో బ్లాక్ బస్టర్ హిట్ టాక్ తో రికార్డు స్థాయిలో వసూళ్లు కొల్లగొట్టాడు. ఓవర్సీస్ లో అయితే ఏకంగా ఆర్ఆర్ఆర్ రికార్డులనే బద్దలు కొట్టాడు. ఇప్పటి వరకు ఏకంగా రూ. 1100 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టాడు. ఇదిలా ఉండగా.. తన సినిమా బ్యాన్ చేసిన దేశంలో కల్కితో ఇండస్ట్రీ హిట్ కొట్టాడు. అవును.. గతంలో ప్రభాస్ నటించిన ఆదిపురుష్ సినిమాను నేపాల్ లో బ్యాన్ చేశారు.

కానీ ఇప్పుడు అదే నేపాల్ లో కల్కి మూవీలో ఇండస్ట్రీ హిట్ కొట్టాడు. ఎక్కడైతే తన సినిమాను బ్యాన్ చేశారో.. అక్కడే ఇండస్ట్రీ హిట్ కొట్టడం అంటే మామూలు విషయం కాదు. దాంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఇది సర్ మా డార్లింగ్ రేంజ్. మీరు ఒక్క సినిమాను ఆపితే.. మా హీరో మరో మూవీతో మీ ఇండస్ట్రీని షేక్ చేస్తాడు అంటూ సోషల్ మీడియా వేదికగా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరి కల్కి మూవీ నేపాల్ లో ఇండస్ట్రీ హిట్ కొట్టడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by Skyupsmedia (@skyupsmedia)