iDreamPost
android-app
ios-app

పవన్ 10 ఏళ్లుగా ఏమి సాధించినట్టు? ఇది అసమర్థత కాదా: ఫ్యాన్స్

019 ఎన్నికల సమయంలో పవన్‌ టీడీపీపై, చంద్రబాబుపై విమర్శలు చేశారు. గతంలో తాను మద్దతిచ్చిన పార్టీపైనే విరుచుకుపడ్డారు. అయితే, ఆ ఎన్నికల్లో పవన్‌, చంద్రబాబులపై నమ్మకం లేని..

019 ఎన్నికల సమయంలో పవన్‌ టీడీపీపై, చంద్రబాబుపై విమర్శలు చేశారు. గతంలో తాను మద్దతిచ్చిన పార్టీపైనే విరుచుకుపడ్డారు. అయితే, ఆ ఎన్నికల్లో పవన్‌, చంద్రబాబులపై నమ్మకం లేని..

పవన్ 10 ఏళ్లుగా ఏమి సాధించినట్టు? ఇది అసమర్థత కాదా: ఫ్యాన్స్

టాలీవుడ్‌ స్టార్‌ హీరో పవన్‌ కల్యాణ్‌ జనసేన పార్టీ స్థాపించి దాదాపుగా పదేళ్లు అవుతోంది. ఈ పదేళ్ల కాలంలో ఓ రెండు సార్లు ఎన్నికలు జరిగాయి. 2014 ఎన్నికల సందర్భంలో పవన్‌ తన పార్టీని ఎన్నికల్లో పోటీ చేయించకపోయినా.. టీడీపీకి మద్దతు ఇచ్చారు. చంద్రబాబు అనుభవం కలిగిన నాయకుడంటూ ఆయనకు వత్తాసు పలికారు. ఆ ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించింది. తర్వాత 2019 ఎన్నికలు వచ్చాయి. ఈ ఎన్నికల సమయంలో జనసేన, టీడీపీలకు చెడింది. రెండు పార్టీలు వేరువేరుగా పోటీ చేశాయి.

2019 ఎన్నికల సమయంలో పవన్‌ టీడీపీపై, చంద్రబాబుపై విమర్శలు చేశారు. గతంలో తాను మద్దతిచ్చిన పార్టీపైనే విరుచుకుపడ్డారు. అయితే, ఆ ఎన్నికల్లో పవన్‌, చంద్రబాబులపై నమ్మకం లేని ప్రజలు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీని భారీ మెజార్టీతో గెలిపించారు. ఆఖరికి పవన్‌ తాను పోటీ చేసిన రెండు చోట్లా ఓడిపోయారు. దీంతో పవన్‌ రాజకీయ భవిష్యత్తు కొంత ప్రశ్నార్థకంగా మారింది. ఒంటరిగా పోటీ చేస్తే ఇబ్బందులు తప్పవని భావించారు. ఇప్పుడు 2024 ఎన్నికల సమయంలో మళ్లీ టీడీపీతో పొత్తు పెట్టుకుంటున్నారు.

పవన్ 10 ఏళ్లుగా ఏమి సాధించినట్టు?

జనసేన పార్టీ పెట్టి పదేళ్లవుతున్నా.. ఆంధ్రప్రదేశ్‌లో పార్టీకి సరైన క్యాడెర్‌ కూడా లేకపోవటం గమనార్హం. సాధారణ జనాలకు పార్టీలోని కీలక నేతలైన నాదేండ్ల మనోహర్‌, నాగబాబు  ఒకరిద్దరు తప్ప ఎవ్వరూ తెలీదు. ఇదే పవన్‌ ఫ్యాన్స్‌ను కలవరపెడుతోంది. పదేళ్లయినా.. పార్టీని బలోపేతం చేయటంలో పవన్‌ ఫెయిల్‌ అయ్యాడని ఫ్యాన్స్‌ మండిపడుతున్నారు. పండగలకు వచ్చే కొత్త అల్లుడిలా .. పవన్‌ అప్పుడప్పుడు ఏపీకి వచ్చిపోవటాన్ని తట్టుకోలేకపోతున్నారు.

అనుభవం నీకు లేదా.. అసమర్థత కాదా!

2024 ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో పవన్‌ పాత పాట పాడ్డం ఫ్యాన్స్‌ను ఇబ్బందికి గురిచేస్తోంది. ‘చంద్రబాబు అనుభవం ఉన్న నాయకుడు.. ఆయన సీఎం కావాలి’ అని పవన్‌ అనటాన్ని వారు తట్టుకోలేకపోతున్నారు. మళ్లీ టీడీపీతో పొత్తు పెట్టుకోవటాన్ని తీసుకోలేకపోతున్నారు. ప్రజారాజ్యం సమయం నుంచి రాజకీయాల్లో ఉన్న పవన్‌కు అనుభవం లేదా? అని ప్రశ్నిస్తున్నారు. ఎందుకు సీఎం అభ్యర్థిగా తనను తాను గుర్తించుకోలేకపోతున్నాడంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తనకు అనుభవం లేదని అనుకోవటం.. పార్టీని ఏవిధంగానూ బలోపేతం చేయకపోవటం.. పవన్‌ అసమర్థత కాదా అని అంటున్నారు.